మంగళవారం 20 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 27, 2020 , 14:54:30

అక్టోబ‌ర్ 18న ఐఐఎంసీ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌‌

అక్టోబ‌ర్ 18న ఐఐఎంసీ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌‌

న్యూఢిల్లీ: మాస్ క‌మ్యూనికేష‌న్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్‌క‌మ్యూనికేష‌న్ (ఐఐఎంసీ) ప‌రీక్ష తేదీని ఎన్‌టీఏ ప్ర‌క‌టించింది. ఈ ఆన్‌లైన్ ప‌రీక్ష‌ వ‌చ్చేనెల 18న జ‌రుగుతుంద‌ని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్ల‌డించింది. దీనికోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులు పూర్తివివ‌రాల‌కు iimc.ssinfotechonline.com వెబ్‌సైట్ చూడ‌వ‌చ్చ‌ని తెలిపింది. 

కంప్యూట‌ర్ ఆధారితంగా ఈ ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని, విద్యార్థులు ఎక్క‌డినుంచైనా రాసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. అయితే వారికి డెస్క్‌టాప్ గానీ, ల్యాప్‌టా గానీ ఉండాల‌ని తెలిపింది. ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 23న ముగిసింది.


logo