సోమవారం 25 మే 2020
Nipuna-education - Mar 29, 2020 , 17:57:59

ఐపీ మ్యాట్‌-2020 వాయిదా !

ఐపీ మ్యాట్‌-2020 వాయిదా !

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) టెస్ట్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఇండోర్ ఐఐఎం ప్ర‌క‌టించింది. జాతీయ‌స్థాయిలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. ఇంట‌ర్‌స్థాయిలో ఐఐఎంలో చ‌దివే అవ‌కాశం క‌ల్పించే ఈకోర్సుకు బాగా డిమాండ్ ఉంది. ఇంట‌ర్‌లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించిన వారు ఈ ప‌రీక్ష రాయ‌వ‌చ్చు. ఐపీఎం మ్యాట్‌తో ఐదేండ్ల‌ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. మొద‌ట ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 30 న ప‌రీక్ష నిర్వ‌హించాల్సి ఉంది. కొత్త ప‌రీక్ష తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని ఐఐఎం ప్ర‌క‌టించింది. అదేవిధంగా ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకునే తేదీని ఏప్రిల్ 20 వ‌ర‌కు పొడ‌గించారు. 


logo