మంగళవారం 26 మే 2020
Nipuna-education - May 22, 2020 , 20:38:21

ఇగ్నో అసైన్‌మెంట్‌ సమర్పనకు గడువు పొడిగింపు

ఇగ్నో అసైన్‌మెంట్‌ సమర్పనకు గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: జూన్‌ 2019 విద్యాసంవత్సరానికి సంబంధించిన అసైన్‌మెంట్లను సమర్పన గడువును ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) పొడిగించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇగ్నోలో కోర్సులు చేస్తున్నవారు జూన్‌ 15 వరకు అసైన్‌మెంట్లను సమర్పించవచ్చని వెల్లడించింది. సాధారణంగా అసైన్‌మెంట్లను మే 31లోపు సమర్పించాల్సి ఉంటుంది. అసైన్‌మెంట్లను ఆన్‌లైన్‌ ద్వారా కూడా సమర్పించవచ్చని యూనివర్సిటీ వీసీ నాగేశ్వరరావు తెలిపారు. జూన్‌ 2020 విద్యాసంవత్సరానికి సంబంధించిన పరీక్షలు జూన్‌ 1న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఆ పరీక్షలను కూడా వాయిదావేశామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.


logo