గురువారం 22 అక్టోబర్ 2020
Nipuna-education - Aug 01, 2020 , 12:26:11

ఇగ్నో జూలై సెష‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

ఇగ్నో జూలై సెష‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీ (ఇగ్నో) ప్ర‌వేశాల గ‌డువును మ‌రోమారు పొడిగించింది. డిగ్రీ, పీజీ, పీజీ స‌ర్టిఫికెట్‌, పీజీ డిప్లొమా, స‌ర్టిఫికెట్‌, డొప్లొమా వంటి ఇత‌ర కోర్సుల్లో జూలై సెష‌న్‌కు సంబంధించిన ప్ర‌వేశాలు, రీ-అడ్మిష‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆగ‌స్టు 16 వ‌ర‌కు స‌మ‌ర్పించ‌వ‌చ్చ‌ని తెలిపింది. షెడ్యూల్ ప్ర‌కారం జూలై 31తో ఈ గ‌డ‌వు ముగిసిపోయింది.  

ఎంఏ ఇంగ్లిష్‌, బీఏ హిందీ, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, అడ‌ల్ట్ ఎడ్యుకేష‌న్‌లో పీజీ స‌ర్టిఫికెట్‌, ఎన్విరాన్‌మెంట్‌, పాపులేష‌న్‌, స‌స్టెయిన‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో అప్రిసియేష‌న్ కోర్సుల‌తోపాటు మ‌రో 24 కోర్సు‌ల‌ను ఇగ్నో అందిస్తున్న‌ది.


logo