శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 23, 2020 , 13:29:47

ఐబీపీఎస్ పీఓ అడ్మిట్‌కార్డుల విడుద‌ల‌

ఐబీపీఎస్ పీఓ అడ్మిట్‌కార్డుల విడుద‌ల‌

న్యూఢిల్లీ:  వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పీఓ పోస్టుల భ‌ర్తీని చేప‌ట్టిన ఐబీపీఎస్ ప్రిలిమ్స్ ప‌రీక్ష అడ్మిట్ కార్డుల‌ను విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 11 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ ibps.in‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. దేశంలోని వివిధ సెంట‌ర్ల‌లో వ‌చ్చెనెల 3, 10, 11 తేదీల్లో ప‌రీక్ష జ‌రుతుంది.   

మొత్తం 1417 పీఓ పోస్టుల భ‌ర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అప్లికేష‌న్ ప్ర‌క్రియ ఆగ‌స్టు 5న ప్రారంభ‌మ‌వ‌గా, ఆగ‌స్టు 26న ముగిసింది. ప‌రీక్ష ఫ‌లితాల‌ను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేస్తారు.  పీఓ మెయిన్ ఎగ్జామ్ న‌వంబ‌ర్ 28న జ‌ర‌గ‌నుంది.