బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 06, 2020 , 14:46:26

మ‌రో 270 పీఓ పోస్టుల‌ను పెంచిన ఐబీపీఎస్

మ‌రో 270 పీఓ పోస్టుల‌ను పెంచిన ఐబీపీఎస్

న్యూఢిల్లీ: వివిధ బ్యాంకుల్లో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీఓ) పోస్టుల సంఖ్య‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) పెంచింది. 1147 పీఓ పోస్టుల‌తో ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. తాజాగా వీటికి మ‌రో 270 పోస్టుల‌ను జ‌త‌చేసింది. దీంతో మొత్తం పోస్టుల‌ సంఖ్య‌ 1417కు చేరింది. ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 734 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌లో 250 పోస్టులు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో 83, యూకో బ్యాంక్‌లో 350 పోస్టులు ఉన్నాయ‌ని తెలిపింది. 

వీటికి సంబంధించి ఆగ‌స్టు 5న ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. డిగ్రీ పూర్తిచేసిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఆగ‌స్టు 26వ తేదీవ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని, జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.850 అని, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.175 చెల్లించాల‌ని ప్ర‌క‌టించింది.  


logo