బుధవారం 28 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 25, 2020 , 12:20:09

నిమ్స్‌లో హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సు

నిమ్స్‌లో హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సు

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (నిమ్స్‌) మాస్ట‌ర్ ఇన్ హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్ర‌వేశాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. 

అర్హ‌త‌: ఏదైనా మెడిక‌ల్ డిగ్రీ లేదా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 2020, డిసెంబ‌ర్ 31 నాటికి‌ 30 ఏండ్ల‌లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాల‌ని తెలిపింది.   

కోర్సు కాల‌వ్య‌వ‌ధి: ‌రెండేండ్లు+ ఆరు నెల‌లు ఇంట‌ర్న్‌షిప్‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. హార్డ్ కాపీని ప్రింట్ తీసి సంబంధిత చిరునామాకు పంపించాలి. 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 8

హార్డ్ కాపీలు పంపించ‌డానికి చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 10

హాల్‌టికెట్ల విడుద‌ల‌: అక్టోబ‌ర్ 16

ప్ర‌వేశ‌పరీక్ష‌: అక్టోబ‌ర్ 19

ఫ‌లితాల విడుద‌ల‌: అక్టోబ‌ర్ 19 సాయంత్రం 4 గంట‌ల‌కు

వైవా: అక్టోబ‌ర్ 20

కోర్సు ప్రారంభం: న‌వంబ‌ర్ 1న‌

వెబ్‌సైట్‌: www.nims.edu.in


logo