మంగళవారం 26 మే 2020
Nipuna-education - May 23, 2020 , 18:39:14

హెచ్‌ఎంఎస్‌డబ్ల్యూఎస్‌బీ మేనేజర్‌ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

హెచ్‌ఎంఎస్‌డబ్ల్యూఎస్‌బీ మేనేజర్‌ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: హెచ్‌ఎంఎస్‌డబ్ల్యూఎస్‌బీ మేనేజర్‌ పోస్టుల ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ మే 31 వరకు పొడిగించింది.  హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజి బోర్డు (హెచ్‌ఎంఎస్‌డబ్ల్యూఎస్‌బీ)లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మే 15తో ముగిసింది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించడంతో దరఖాస్తుల గడువును టీఎస్‌పీఎస్సీ ఈ నెలాఖరు వరకు పొడిగించింది. 

అదేవిధంగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఫిజిక్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు మీడియం)కు ఎంపికైన పీహెచ్‌సీ అభ్యర్థుల సర్టిఫికెట్‌ పరిశీలన పూర్తి చేసింది. కాగా, వారికి మెడికల్‌ ఎగ్జామ్‌ను మే 29 నుంచి టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌లో నిర్వహిస్తామని వెల్లడించింది.


logo