ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 14, 2020 , 12:22:56

హెచ్ఏఎల్‌లో 2 వేల అప్రెంటిస్‌, విజిటింగ్ ఫ్యాక‌ల్టీ పోస్టులు

హెచ్ఏఎల్‌లో 2 వేల అప్రెంటిస్‌, విజిటింగ్ ఫ్యాక‌ల్టీ పోస్టులు

న్యూఢిల్లీ: హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్‌)లో ట్రేడ్ అప్రెంటిస్‌, విజిటింగ్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి టెక్నిక‌ల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెచ్ఏఎల్ నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఆస‌క్తి,  అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 2 వేల పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ద‌ర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్‌ [email protected] ఉన్నాయ‌ని తెలిపింది. 

మొత్తం పోస్టులు: 2000

అర్హ‌త‌లు: విజిటింగ్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టులో ఎన్ఏసీ లేదా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసి, క‌నీసం బోధ‌నా రంగంలో ప‌దేండ్ల అనుభ‌వం ఉండాలి. 

ట్రేడ్ అప్రెంటిస్‌ల‌కు గుర్తింపుపొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణుల‌వ్వాలి. కోర్సు ముగిసిన త‌ర్వాత రెండేండ్ల అనుభ‌వం ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: సెప్టెంబ‌ర్ 5

వెబ్‌సైట్‌: [email protected]     


logo