సోమవారం 26 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 30, 2020 , 11:46:26

అక్టోబ‌ర్ 7 వ‌ర‌కు గేట్ అప్లికేష‌న్స్ గ‌డువు పొడిగింపు

అక్టోబ‌ర్ 7 వ‌ర‌కు గేట్ అప్లికేష‌న్స్ గ‌డువు పొడిగింపు

హైద‌రాబాద్‌: ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కోసం నిర్వ‌హించే గేట్ ప‌రీక్ష ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రో వారం రోజుల‌పాటు పొడిగించారు. విద్యార్థుల అభ్య‌ర్థ‌న మేర‌కు ఆన్‌లైన్ అప్లికేష‌న్ గ‌డువును అక్టోబ‌ర్ 7 వ‌ర‌కు పొడిగిస్తున్నామ‌ని ఐఐటీ బాంబే ప్ర‌క‌టించింది. దీంతో వ‌చ్చే బుధ‌వారం వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ gate.iitb.ac.inలో ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వరిలో జ‌రగ‌నున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్‌)-2021 నోటిఫికేష‌న్‌ను ఐఐటీ బాంబే విడుద‌ల చేసింది.  

గేట్‌లో అర్హ‌త సాధించ‌డం ద్వారా దేశంలోని ఐఐటీలు, ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో ఇంజినీరింగ్, టెక్నాల‌జీ, ఆర్కిటెక్చ‌ర్ కోర్సుల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు చేసుకోవ‌డానిక అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో పీహెచ్‌డీ చేసుకోవ‌చ్చ‌ది. దీంతోపాటు ప‌లు ప్ర‌భుత్వరంగ‌, ప్రైవేటు సంస్థ‌లు గేట్ మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుని నియామ‌కాలు చేప‌డుతున్నాయి.    


logo