e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే.. ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే.. ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే.. ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

న్యూఢిల్లీ: నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఈటీటీ) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌రఖాస్తులు వ‌చ్చేనెల 6 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 50 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నుంది. ఇవి మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ విభాగంలో ఉన్నాయి. గేట్‌-2021 స్కోర్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తుంది. అయితే ఈ పోస్టుల‌కు మ‌హిళా అభ్య‌ర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది.
మొత్తం పోస్టులు: 50
ఇందులో ఎల‌క్ట్రిక‌ల్ 22, మెకానిక‌ల్ 14, ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హ‌త‌: సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. 27 ఏండ్ల లోపువ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ 2021 మార్కుల ఆధారంగా
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 16
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 6
వెబ్‌సైట్‌: ntpccareers.net

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

ఇవికూడా చదవండి..

కేంద్ర పోలీసు బ‌ల‌‌గాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టులు
జూమ్‌లో పార్ల‌మెంట్ స‌మావేశాలు.. న‌గ్నంగా కనిపించిన ఎంపీ
IPL 2021: ధోనీ మ‌ళ్లీ అలాగే చేస్తే.. నాలుగు మ్యాచ్‌ల నిషేధం!
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్‌ సీఈఓ
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే.. ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే.. ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే.. ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ట్రెండింగ్‌

Advertisement