శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nipuna-education - Jan 22, 2021 , 13:39:04

బెల్‌లో టెక్నీషియన్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

బెల్‌లో టెక్నీషియన్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌: ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా టెక్నీషియన్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారు బెంగళూరులోని బెల్‌ కాంప్లెక్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది. 

మొత్తం పోస్టులు: 49

ఇందులో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ (ఈఏటీ)-25 (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్ 14, మెకానికల్‌ 10, ఎలక్ట్రికల్‌ 1), టెక్నీషియన్‌-24 (ఎలక్ట్రో మెకానిక్‌ 14, ఫిట్టర్‌ 3, మెషినిస్ట్‌ 6, వెల్డర్‌ 1)

అర్హతలు: ఈఏటీ పోస్టులకు డిప్లొమాలో ఇంజినీరింగ్‌ చేసి ఉండాలి. అదేవిధంగా టెక్నీషియన్‌ పోస్టులకు పదోతరగతి, ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 28 ఏండ్ల లోపువారై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష అధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 2

వెబ్‌సైట్‌: bel-india.in

VIDEOS

logo