శనివారం 30 మే 2020
Nipuna-education - Mar 28, 2020 , 15:54:38

ఇఫ్లూ దరఖాస్తు గడువు పొడిగింపు !

ఇఫ్లూ దరఖాస్తు గడువు పొడిగింపు !

హైదరాబాద్‌లోని ది ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ వాయిదా ప‌డింది. కోవిడ్-19 మహ్మరితో దేశంలోని అన్ని విద్యా సంస్థలు పరీక్షలను వాయిదా వేసుకోవాలనే కేంద్రహోంశాఖ సూచనల మేరకు పరీక్షతేదీని, దరఖాస్తు గడువును కూడా పొడిగించినట్లు ఇఫ్లూ వెబ్‌సైట్‌లో పేర్కొంది. మొదట తెలిపిన‌ ప్రకారం యూజీ కోర్సులో ప్రవేశాలకు ఏప్రిల్ 12న ప్రవేశపరీక్ష జరగాల్సి ఉంది. అదేవిధంగా ఏడాది కాలవ్యవధిగల పోస్టుగ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ కోర్సు దరఖాస్తు దాఖలు చేసుకునే గడువును మార్చి 15 నుంచి 31 వరకు పొడగించింది. ఈ కోర్సు జూలై మధ్య నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని తగు సర్టిఫికెట్లు, డీడీలతో దరఖాస్తును దాఖలు చేయాలని పేర్కొంది. logo