శుక్రవారం 05 జూన్ 2020
Nipuna-education - Apr 01, 2020 , 22:29:09

విద్య, ఉద్యోగ సమాచారం

విద్య, ఉద్యోగ సమాచారం

నాటా  వాయిదా 

 •  జాతీయస్థాయిలో ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నాటా (I)ను వాయిదా వేసినట్లు కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ ప్రకటించింది.   

       నాటాను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. దీనిలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఐదేండ్ల్ల బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మొదటి నాటా టెస్ట్‌ను ఏప్రిల్‌ 19న, రెండో నాటా టెస్ట్‌ను మే 31న నిర్వహించాల్సి ఉంది. 

 •  కొత్త తేదీని లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత వెల్లడిస్తామని  కౌన్సిల్‌ తెలిపింది. ఈ పరీక్ష దరఖాస్తు దాఖలు చేసుకునే గడువును 15వ తేదీ వరకు పొడిగించింది. రుసుమును 19వ తేదీ వరకు చెల్లించవచ్చని కౌన్సిల్‌ పేర్కొంది. పూర్తి వివరాల కోసం http://www.nata.in చూడవచ్చు.


తిరుపతి సంస్కృత విద్యాపీఠానికి సెంట్రల్‌ హోదా !

 • తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి సెంట్రల్‌ యూనివర్సిటీ హోదాను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీమ్డ్‌ యూనివర్సిటీ హోదాలో ఉన్న సంస్కృత విద్యాపీఠం స్వతంత్ర (సెంట్రల్‌ యూని వర్సిటీ) సంస్కృత విశ్వవిద్యాలయంగా మారింది. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలం డీమ్డ్‌ యూనివర్సిటీలలో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం ఇచ్చిన సెంట్రల్‌ యూనివర్సిటీ హోదాతో మరిన్ని కోర్సులు, పరిశోధనలకు ఈ సంస్థ వేదిక కానున్నది అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎకనామిక్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు

 • బెంగళూర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
 • కోర్సు: ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సు
 • అర్హతలు: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు 

ఉత్తీర్ణత

 •  కోర్సు: ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ 
 • అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్‌) ఇన్‌ ఎకనామిక్స్‌ ఉత్తీర్ణత.
 •  దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
 •  చివరితేదీ: ఏప్రిల్‌ 20
 •  దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు  రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు రూ. 150/-
 • పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: https://base.ac.in

బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌

 • భోపాల్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)లో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
 • అప్రెంటిస్‌
 • మొత్తం ఖాళీలు: 229
 • విభాగాల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-138, డిప్లొమా అప్రెంటిస్‌-91 
 • విభాగాలు: కెమికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఇండస్ట్రియల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటలర్జీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు ఉన్నాయి.
 • అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా  (ఇంజినీరింగ్‌), బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
 • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
 • చివరితేదీ: ఏప్రిల్‌ 3
 • వెబ్‌సైట్‌: http://careers.bhelbpl.co.in


logo