శుక్రవారం 27 నవంబర్ 2020
Nipuna-education - Oct 28, 2020 , 09:55:25

తెలుగు వ‌ర్సిటీలో డిస్టెన్స్ కోర్సులు

తెలుగు వ‌ర్సిటీలో డిస్టెన్స్ కోర్సులు

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని తెలుగు విశ్వ‌విద్యాల‌యం 2020-21 విద్యాసంవ‌త్సరానికిగాను దూరవిద్యావిధానంలో వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఆస‌క్తి క‌లిగిన‌వారు వ‌చ్చే నెల 30లోపు ద‌ర‌ఖాస్తుచేసుకోవాల‌ని సూచించింది. 

కోర్సులు-అర్హ‌త‌

పీజీ డిప్లొమా కోర్సులు- టీవీ జ‌ర్న‌లిజం, జ్యోతిషం

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ పూర్త‌యి ఉండాలి. 

డిప్లొమా కోర్సులు- లైట్ మ్యూజిక్‌, ఫిలిమ్ రైటింగ్‌, జ్యోతిషం

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిలిమ్ రైటింగ్ కోర్సుకు తెలుగులో రాయ‌డం, చ‌ద‌వ‌డం వచ్చి ఉండాలి.  

స‌ర్టిఫికెట్ కోర్సులు- జ్యోతిషం, సంగీత విశార‌ద‌, మోడ్ర‌న్ తెలుగు

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. సంగీత విశార‌ద కోర్సుకు 12 ఏండ్లు నిండిన వారైఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌

అప్లికేష‌న్ ఫీజు: ‌రూ.300

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌ర్ 31 

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: న‌వంబ‌ర్ 30

వెబ్‌సైట్‌: http://www.teluguuniversity.ac.in/ లేదా www.teluguuniversity.ac.in/