శుక్రవారం 07 ఆగస్టు 2020
Nipuna-education - Jul 01, 2020 , 12:44:11

‘దోస్త్‌' రిజిస్ట్రేషన్ల వాయిదా

‘దోస్త్‌' రిజిస్ట్రేషన్ల వాయిదా

హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటినుంచి ప్రారంభంకావాల్సిన డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లు వాయిదా వేస్తున్నస్తున్నట్లు దోస్ట్‌ కన్వీనర్‌ లింబాద్రి ప్రకటించారు. దోస్త్‌ ప్రక్రియ తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాయిదావేసింది.  

దోస్త్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జూన్‌ 22న ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ప్రకారం ఈ రోజు మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాల్సి ఉన్నది. దోస్త్‌ రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 14తో ముగియాల్సి ఉంది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా పడ్డాయి. దోస్త్‌ అప్లికేషన్‌ ఫీజు రూ.200లు. రాష్ట్రంలోని సుమారు వెయ్యికిపైగా డిగ్రీ కాలేజీల్లో 200 కోర్సుల్లో సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేస్తారు.


logo