హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, హెల్త్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని వెల్లడించింది. ఎంపికైనవారిని కొత్తగూడెం, రామగుండం, రామకృష్ణాపూర్, భూపాలపల్లిలోని సింగరేణికి చెందిన కొవిడ్ వార్డ్స్, క్వారంటైన్ సెంటర్లలో నియమిస్తారు. ఈ పోస్టులను ఆరు నెలల కాలానికిగాను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టులు: 11
ఇందులో పల్మనాలజిస్ట్ 4, అనెస్థెటిస్ట్ 4, హెల్త్ ఆఫీసర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత స్పెషాలిటీలో పీజీ చేసి ఉండాలి.
కన్సాలిడేటెడ్ పే: నెలకు రూ.1,25,00
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ ప్రదేశం: సింగరేణి భవన్, మూడో అంతస్థు, రెడ్ హిల్స్, లక్డీకపూల్, హైదరాబాద్
ఇంటర్వ్యూ తేదీ: మే 28న
వెబ్సైట్: https://scclmines.com/