గురువారం 24 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 13, 2020 , 13:28:29

వ‌చ్చేనెల 7న క్లాట్-2020.. త్వ‌ర‌లో అడ్మిట్ కార్డులు

వ‌చ్చేనెల 7న క్లాట్-2020.. త్వ‌ర‌లో అడ్మిట్ కార్డులు

న్యూఢిల్లీ: ‌దేశంలోని 22 న్యాయ విశ్వ‌విద్యాల‌య్యాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే క్లాట్-2020 తేదీని లా వ‌ర్సి‌టీల కాన్సార్షియం ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 7న మ‌ధ్యాహ్నం 2 నుంచి 4 గంట‌ల వ‌ర‌కు కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌) జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. అడ్మిట్ కార్డుల‌ను రెండు వారాల్లో విడుద‌ల చేస్తామ‌ని తెలిపింది. అడ్మిట్ కార్డ‌ల‌ను అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in/clat-2020/ ‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. 

షెడ్యూల్ ప్ర‌కారం ఈ ప‌రీక్ష మే 24న జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే క‌రోనా నేప‌థ్యంలో జూన్ 21కి, అనంత‌రం ఆగ‌స్టు 22కు వాయిదావేశారు. అయితే దేశంలో క‌రోనా కేసులు పెరిగిపోతుండ‌టంతో మ‌రోమారు ప‌రీక్ష వాయిదాప‌డింది. దీంతో మ‌ళ్లీ ప‌రీక్ష తేదీని ప్ర‌క‌టించారు. క్లాట్‌-2020కి సుమారు 68 వేల మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 

క్లాట్ యూజీ ప‌రీక్ష 150 మార్కుల‌కు జ‌రుగుతుంది. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక్క మార్కు చొప్పున మొత్తం 150 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. అదేవిధంగా పీజీ ప‌రీక్ష‌లో 120 బ‌హుళైచ్చిక ప్ర‌శ్న‌లు, 120 మార్కుల‌కు ఉంటాయి. అయితే త‌ప్పు స‌మాధానాల‌కు మార్కులు కోత‌విధిస్తారు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్క‌లు క‌ట్ చేస్తారు. 


logo