మంగళవారం 09 మార్చి 2021
Nipuna-education - Dec 31, 2020 , 18:36:37

సీబీఎస్ఈ-2021 ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

సీబీఎస్ఈ-2021 ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

న్యూఢిల్లీ: సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ)-2021 ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 4 నుంచి జూన్ 10 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. జూలై 15న ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ మీడియాకు వెల్ల‌డించారు. విద్యార్థులు ఏయే ప‌రీక్ష‌లను ఏయే తేదీల్లో నిర్వ‌హిస్తార‌నే వివ‌రాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

డిసెంబ‌ర్ 31న సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను వెల్ల‌డిస్తామ‌ని కేంద్ర విద్యాశాఖ గ‌త వారం ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ఈ నెల 22న నిర్వ‌హించిన వెబినార్‌లో సీబీఎస్ఈ-2021 ప‌రీక్ష‌లు ఈ జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో జ‌రిగే అవ‌కాశం లేద‌ని కొంత క్లారిటీ ఇచ్చారు. తాజాగా మే 4 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు.         

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo