బుధవారం 25 నవంబర్ 2020
Nipuna-education - Oct 29, 2020 , 12:30:14

క్యాట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల.. న‌వంబ‌ర్ 29న ప‌రీక్ష‌

క్యాట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల.. న‌వంబ‌ర్ 29న ప‌రీక్ష‌

న్యూఢిల్లీ: దేశంలోని ప్ర‌తిష్ఠాత్మ‌క మేనేజ్‌మెంట్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్‌ (క్యాట్) అడ్మిట్ కార్డుల‌ను ఐఐఎం ఇండోర్ విడుద‌ల చేసింది. ప‌రీక్ష‌కోసం రిజిస్ట‌ర్ చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in.లో అందుబాటులో ఉన్నాయ‌ని, డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ప‌రీక్ష‌ను న‌వంబ‌ర్ 29న నిర్వ‌హించనున్నారు. య‌ధావిధంగా మూడు సెష‌న్ల‌లో ప‌రీక్ష ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ఇందులో వెర్బ‌ల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్ర‌హెన్ష‌న్‌, డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష ద్వారా ఐఐఎంల‌లోని పీజీ, ఫెలో ప్రోగ్రామ్ కోర్సుల్లో అడ్మిష‌న్స్ క‌ల్పిస్తారు.