శుక్రవారం 07 ఆగస్టు 2020
Nipuna-education - Jul 04, 2020 , 07:16:50

సీఏ పరీక్షలు మళ్లీ వాయిదా

సీఏ పరీక్షలు మళ్లీ వాయిదా

న్యూఢిల్లీ: కరోనా కారణంగా చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. పరీక్షలను పరిస్థితులను బట్టి నవంబర్‌లో నిర్వహిస్తామని తెలిపింది. కరోనా దృష్ట్యా విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి మినహాయింపు అవకాశం కూడా కల్పించింది. మినహాయింపు వద్దనుకుంటే నంబర్‌లో పరీక్షలకు హాజరు కావొచ్చని వెల్లడించింది. తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుని నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. 

షెడ్యూల్‌ ప్రకారం మే 2 నుంచి 18 వరకు సీఏ పరీక్షలు జరగాల్సి ఉన్నది. అయితే దేశంలో కరోనా లాక్‌డౌన్‌ ఉండటంతో ఐసీఏఐ వాయిదావేసింది. జూన్‌ 19 నుంచి జూలై 4 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా పరీక్షలను మళ్లీ వాయిదా వేసి, జూలై 29 నుంచి ఆగస్గు 16 వరకు నిర్వహిస్తామని జూలై 4న ప్రకటించింది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతుండటం, పరీక్షల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సీఏ పరీక్షలను ఐసీఏఐ మరోమారు వాయిదావేసింది.


logo