గురువారం 25 ఫిబ్రవరి 2021
Nipuna-education - Jan 27, 2021 , 08:20:28

సీ మ్యాట్‌ దర‌ఖా‌స్తుల గడువు పొడిగింపు

సీ మ్యాట్‌ దర‌ఖా‌స్తుల గడువు పొడిగింపు

హైద‌రా‌బాద్‌: ఎంబీఏ, పీజీ‌డీఎం కోర్సుల్లో ప్రవే‌శాల కోసం నిర్వహించే కామన్‌ మేనే‌జ్‌‌మెంట్‌ అడ్మి‌షన్‌ టెస్ట్‌ (సీ మ్యాట్‌) దర‌ఖా‌స్తుల గడు‌వును ఈ నెల 30 వరకు పొడి‌గిం‌చి‌నట్టు నేష‌నల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎ‌న్టీఏ) తెలి‌పింది. గడువు ఈ నెల 22తో ముగి‌సింది. అయితే మరికొంతమంది అభ్యర్థులకు అవకాశం కల్పించడానికి ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువును పొండిగించింది. ఆన్‌‌లై‌న్‌లో దర‌ఖాస్తు చేసు‌కున్నవారు 31వ తేదీ అర్ధరాత్రి 11:59 గంటల వరకు ఫీజు చెల్లిం‌చ‌వ‌చ్చు. దర‌ఖా‌స్తు‌ల్లోని తప్పులను ఫిబ్రవరి 1, 2 తేదీల్లో సవరించుకోవచ్చు. ఫిబ్రవరి 22, 27 తేదీల్లో పరీ‌క్షలు నిర్వహిస్తారు. దేశ‌వ్యా‌ప్తంగా 153 కేంద్రాలు ఏర్పాటుచేశారు. రాష్ట్రం‌లో హైద‌రా‌బాద్‌, కరీం‌న‌గర్‌, వరం‌గల్‌ నగ‌రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. 

VIDEOS

logo