ప్రభుత్వ ఆదాయ వనరులు-పన్నులు


Wed,June 26, 2019 02:05 AM

దేశంలో పన్నుల విధానం

ప్రభుత్వం తాను నిర్వహించే విధుల కోసం వ్యయం చేయవలసి ఉంటుంది. దీన్నే ప్రభుత్వ వ్యయం అంటారు. దీన్ని ప్రభుత్వం పన్నులు, రుణాలు, ఇతర మార్గాల ద్వారా సేకరిస్తుంది.
ప్రభుత్వవ్యయానికి కావాల్సిన విత్త వనరులను సమీకరించడాన్ని రెవెన్యూ విధానం తెలుపుతుంది. ఇది ప్రభుత్వ విత్త వనరులను నిర్బంధంగా గాని, ప్రోత్సాహక పద్ధతుల ద్వారా గానీ సేకరిస్తుంది.
ప్రభుత్వ ఆదాయ మార్గాలను స్థూలంగా పన్నులు, పన్నేతర ఆదాయంగా వర్గీకరించవచ్చు.
ప్రభుత్వ ఆదాయంలో ఎక్కువ భాగం పన్నుల ద్వారానే సమకూరుతుంది.

పన్నుల విధానం

దేశ ఆర్థిక, సాంఘిక లక్ష్యాలను సాధించడం ద్రవ్యోల్బణ రహిత ఆర్థికవృద్ధికి తోడ్పడటం పన్నుల విధాన ప్రధాన లక్ష్యాలు. ఇవి రెండు రకాలు.. అవి..
1. ఆదాయ మార్గాల మధ్య సముచితమైన రీతిలో పన్నుల భారాన్ని పంపిణీ చేయడం, దీన్ని లంబసమానత్వం అంటారు.
2. ఒకే రకమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ప్రజల మధ్య న్యాయంగా పన్ను భారాన్ని పంపిణీ చేయడం. దీన్ని సమతల సమానత్వం అంటారు.
సమతల సూత్రానికి తోడుగా పన్ను చెల్లింపు సామార్థ్య సిద్ధాంతాన్ని అనువర్తింప చేయాల్సి ఉంటుంది. వినియోగాన్ని తగ్గించే పన్ను విధానం అవసరమవుతుంది. ఇలాంటి విధానానికి మూడు సూత్రాలు అవసరమవుతాయి.
GSTT

1. జాతీయాదాయాన్ని పెంచడానికి ప్రభుత్వ రంగానికి కావాల్సిన వనరులను సేకరించడం.
2. ప్రత్యక్ష, పరోక్ష పన్నులను విస్తృత పరచడం.
3. పన్నులు పెంచుతూ మిగులును సమీకరించడం.
పన్నుల ఎగవేతకు అవకాశం లేని సంఘటితమైన పన్నుల విధానాన్ని రూపొందించడం, పరోక్ష పన్నుల శాతాన్ని పెంచడం, వ్యవసాయ కమతాలపై పన్ను విధించడడం, వాల్యూయాడెడ్ ట్యాక్స్ ప్రవేశపెట్టడంతోపాటు ప్రోత్సాహ క పన్నుల విధానం అవసరమని ఆర్థికవేత్తలు భావించా రు. పన్నుల విధానాలు సమానత్వాన్ని కల్పించడంతోపాటు రెవెన్యూ ఉత్పత్తిని పెంచడం ప్రధాన ఉద్దేశంగా ఉండాలి.
ఆర్థికాభివృద్ధికి తోడ్పడే పన్నుల విధానంలో మూడు అంశాలు పాటించాలి.
1. ఉత్పాదకత- అంటే ఆర్థికాభివృద్ధికి కావాల్సిన వనరులను సమకూర్చగల పన్నులు.
2. సామర్థ్యం- అంటే పరిపాలనా ఆచరణ యోగ్యమైనవి
3. సమన్వయం- అంటే ప్రైవేటు పెట్టుబడులపై ప్రభావం కలిగి ఉండటం.
ద్రవ్యోల్బణరహిత ఆర్థికాభివృద్ధి సాధించడానికి సంతులితమైన వనరుల కేటాయింపు ప్రధాన లక్ష్యంగా ఉండాలి కాని వనరుల సమీకరణే లక్ష్యంగా ఉండకూడదు.
పన్నుల రకాలు: పన్నుల స్వభాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు.
1. తాత్కాల్కిక పన్నులు: ప్రభుత్వం కొన్ని పన్నులను తాత్కాలిక ప్రాతిపదికపై విధిస్తుంది.
ఉదా : అత్యవసర పరిస్థితుల్లో అంటే యుద్ధం, కరువుల్లాంటివి, అధిక వ్యయాన్ని భరించడానికి కార్పొరేట్ లాభాలపైన సర్‌చార్జీలు విధిస్తుంది.
2. శాశ్వత పన్నులు: ప్రభుత్వం, ప్రభుత్వ రుణాలు చెల్లిండానికి ప్రత్యేక విధింపులు కూడా ఉంటాయి. అయితే కొన్ని పన్నులను శాశ్వత ప్రాతిపదికపై విధిస్తుంది.
ఉదా: ఆదాయపు పన్ను, సంపద పన్ను, అమ్మకపు పన్ను మొదలైనవి. వీటిని పన్ను విధింపు కాలాన్నిబట్టి వర్గీకరించారు.
3. ఆస్తి, వస్తువులపై పన్ను: ఆస్తి పన్ను అంటే ఒక నిర్ణీత గడువులో ఆస్తిపై ఒకేసారి చెల్లించే పన్ను.
ఉదా : ఇంటిమీద విధించే పన్ను, నీటి పన్ను వంటివి.
వస్తువులపై పన్నుని వస్తుత్పత్తి మీద వస్తు అమ్మకాలపై విధించేవి.
ఉదా : అమ్మకంపన్ను, ఎక్సైజ్ సుంకాల వంటివి.
4. మూల్యానుగత పన్నులు, నిర్దిష్ట పన్నులు: ఒక వస్తువుకు ప్రత్యేక లక్షణాలు లేదా రుణాలు ఉంటే వాటిని ఆధారంగా విధించే పన్నును నిర్దిష్ట పన్ను అంటారు. అయితే ఈ రకమైన నిర్దిష్ట పన్నును ఆ వస్తువు బరువు, పరిమాణం లేదా సైజును బట్టి విధిస్తారు.
వస్తువు విలువను బట్టి విధించే పన్నును మూల్యానుగత పన్ను అంటారు. ఈ పన్నును విధించేటప్పుడు వస్తువు నిర్ధారిస్తారు.
5. ఉత్పత్తి పన్ను, వినియోగంపై పన్ను: ఒక వస్తువు ఉత్పిత్తిని బట్టి విధించే పన్నును ఎక్సైజ్ డ్యూటీ అంటారు. ఒక వస్తువు వినియోగాన్నిబట్టి విధించే పన్నును వినియోగపు పన్ను అంటారు.
6. ఆదాయం, మూలధనంపై పన్ను: వ్యక్తి ఆదాయంపై, సంస్థ ఆదాయంపైగాని పన్ను విధించడమే ఆదాయ పన్ను.
ఉదా : ఒక వ్యక్తి ఆర్జిస్తున్న జీతంమీద విధించే పన్ను, ఒక సంస్థ ఆర్జిస్తున్న ఆదాయంపైన పన్ను లేదా ఒక వ్యక్తి ఆస్తులపై వస్తున్న వడ్డీపై పన్ను వంటివి.
ఒక వ్యక్తి లేదా సంస్థల ఆస్తుల విలువ ఆధారంగా విధించేదాన్ని మూలధనంపై పన్ను అంటారు.

పన్నుల వ్యవస్థ

భారత రాజ్యాంగం సమాఖ్య స్వభావం కలిగి కేంద్ర, రాష్ర్టాలకు పన్నులు విధించే అధికారం కల్పించింది. రాష్ట్ర జాబితాలోని పన్నులు పూర్తిగా రాష్ర్టానికే చెందుతాయి. కేంద్ర జాబితాలోని పన్నుల్లో కొంత భాగం రాష్ర్టాలకు కూడా చెందుతుంది. అయితే ఉమ్మడి జాబితాలో ఏ పన్ను కూడా పేర్కొనబడలేదు.
కేంద్రం, రాష్ర్టాల మధ్య పన్నుల విభజన
1. కేంద్రం విధించి, వసూలు చేసి, కేంద్రమే జమ చేసుకుని పూర్తిగా కేంద్రానికే చెందేవి- కస్టమ్స్ సుంకాలు, కార్పొరేషన్ పన్ను, వ్యవసాయ భూమి తప్ప మిగిలిన మూలధనంపై విధించే పన్నులు.
2. కేంద్రంతో విధించబడి, వసూలు చేయబడి కేంద్ర రాష్ర్టాల మధ్య పంచేవి- ఆదాయపన్ను (వ్యవసాయ ఆదాయంపై తప్ప), కేంద్ర ఎక్సైజ్ పన్నులు, సేవాపన్ను. ఈ పన్నులను ఆర్థికసంఘం సూచనల ఆధారంగా పంపిణీ చేస్తారు.
3. కేంద్రంతో విధించబడి, వసూలు చేయబడి రాష్ర్టాలమధ్య పంచబడేవి- ఎస్టేట్ డ్యూటీ (వ్యవసాయ భూమిపై తప్ప), టర్మినల్ పన్ను, రైల్వే చార్జీలపై పన్ను, స్టాక్ మార్కెట్‌పై పన్ను, దినపత్రికల అమ్మకం-వాటిలో ప్రకటనలపై పన్ను.
4. కేంద్రంతో విధించబడి, రాష్ర్టాలు వసూలు చేసుకుని అనుభవించేవి- కేంద్ర జాబితాలో పేర్కొన్నవి కాకుండా మిగిలిన వాటిపై స్టాంప్ డ్యూటీలు, మెడికల్, టాయిలెట్ వస్తువులపై ఎక్సైజ్ పన్ను.
5. పూర్తిగా రాష్ర్టానికే హక్కులుండే పన్నులు- భూమిశిస్తు, స్టాంప్ డ్యూటీ
కస్టమ్స్ సుంకాలు, కార్పొరేషన్ పన్నులతోపాటు, ఆదాయ పన్ను, కేంద్ర ఎక్సైజ్ పన్ను, సేవా పన్నుల్లో వచ్చే వాటా కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.
రాష్ర్టాలకు కేంద్ర ఎక్సైజ్ పన్నుల్లో వాటా, వాణిజ్య పన్నులు, భూమిశిస్తు, స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆల్కహాల్, నార్కోటిక్స్ పై రాష్ట్ర సేల్స్ ట్యాక్స్‌లు అనేవి ప్రధాన ఆదాయ మార్గాలు.
మొత్తం రాష్ట్ర వాణిజ్య పన్నుల్లో అమ్మకపు పన్ను అధిక ఆదాయం అందిస్తుంది.

పన్నుల రకాలు

పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు షెడ్యూల్ ఆధారంగా పన్నులను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి..
1. అనుపాత పన్నులు: పన్ను విధించే మొత్తంతో సంబంధం లేకుండా పన్ను రేటు స్థిరంగా ఉంటే దాన్ని అనుపాత పన్ను అంటారు. ఆదాయం లేదా సంపద పెరిగినప్పటికీ పన్నురేటులో మార్పు ఉండదు.
సగటు పన్ను రేటు, ఉపాంత పన్నురేటు సమానంగా ఉంటే పన్నురేటు నిర్మాణాన్ని అనుపాత పన్ను విధానం అంటారు.
2. పురోగామి పన్నులు: పన్ను విధించే మొత్తం పెరిగినప్పుడు పన్నురేటు కూడా పెరిగితే అది పురోగామి పన్ను.
పురోగామి పన్నుల విషయంలో సగటు పన్నుకంటే ఉపాంత పన్నురేటు ఎక్కువగా ఉంటుంది. ఇందులో పన్ను విధించే మొత్తం పెరిగేకొద్దీ ఉపాంత పన్నురేటు కూడా పెరుగుతుంది.
పేదవారు చెల్లించాల్సిన పన్నురేటు కంటే ధనవంతులు చెల్లించాల్సిన పన్నురేటు ఎక్కువగా ఉండాలనేది ఈ పన్ను సూత్రం.
దేశంలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల సమీకరణ, ఆర్థిక వ్యత్యాసాల నిర్మూలన, పన్నుల విధానం ముఖ్య ఆశయాలుగా ఉన్నాయి. పురోగామి నిర్మూలన, పన్నుల విధానం ముఖ్య ఆశయాలుగా ఉన్నాయి. పురోగామి పన్ను ల ద్వారా కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.
ఉదా: ఆదాయపు పన్ను, సంపద పన్ను, ఎస్టేట్ డ్యూటీ వంటివి భారతదేశంలో పురోగామి పన్నులు.
ప్రయోజనాలు: అధిక ఉత్పాదకత, పన్ను చెల్లింపు సామర్థ్యంపై ఆధారపడుతుంది. ఆదాయ అసమానతలను తగ్గిస్తుంది. వ్యాపార చక్రాలను తొలగించవచ్చు. సంపూర్ణోద్యోగిత సాధించడం, మితవ్యయం, ఆడంబర వినియోగం తగ్గించడం వంటివి ప్రధాన ప్రయోజనాలు.
లోపాలు: ఉత్పత్తి స్థాయిని తగ్గిస్తాయి, పన్నురేటు శాస్త్రీయమైంది కాదు. పన్ను ఎగవేతకు అవకాశం, పెట్టుబడి తరలింపు, కష్టపడి పనిచేయాలనే కోరిక తగ్గుతుంది.
3. తిరోగామి పన్నులు: పన్ను విధించే మొత్తం పెరిగినప్పుడు పన్నురేటు తగ్గితే దాన్ని తిరోగామి పన్ను అంటారు.
ఆదాయం లేదా సంపద పెరిగిన కొద్దీ పన్నురేటు క్రమంగా తగ్గుతుంది.
ఈ విధానంలో ఆదాయానికి, పన్నురేటుకి విలోమ సంబంధం ఉంటుంది.
భారత్‌లో ఈ పన్నును 1980లో పారిశ్రామికోత్పత్తులను ప్రోత్సహించడానికి విధించారు. అయితే ఇది 1984లో రద్దయ్యింది.
4. డిగ్రెసివ్ పన్ను: పన్ను ఆధారం (ఆదాయం) పెరుగుతున్న కొద్దీ పురోగామిత్యం క్షీణిస్తే దాన్ని డిగ్రెసివ్ పన్ను అంటారు.
ఈ పన్ను రెండు రకాలు
1. పన్ను ఆదాయంలో కొంతమొత్తాన్ని పన్ను చెల్లింపు నుంచి మినహాయించి మిగిలిన మొత్తానికి ఒకే పన్నురేటును వర్తింపచేయడం.
2. పన్ను ఆదాయం, పెరిగినంత వేగంగా పన్నురేటు షెడ్యూల్ పెరగడకపోవడం.ప్రాక్టీస్ బిట్స్

1. ఆరంభ భారం అంటే?

1) ఉత్పత్తిదారుడు విధించే భారం
2) ఉత్పత్తి వ్యయ పన్ను
3) ఉత్పత్తిదారునిపై పడేది 4) ఏదీకాదు

2. పురోగామి పన్నుల సుగుణాలు ఏవి?

ఎ. పన్ను చెల్లింపు సామర్థ్య నియమాన్ని పాటించడం
బి. విలాస వస్తువుల వినియోగాన్ని తగ్గించడం
సి. పొదుపు, పెట్టుబడులను పెంచాలన్న ప్రజల కోరికను ప్రోత్సహిస్తాయి
డి. ఆదాయ అసమానతలను తగ్గిస్తాయి

1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, డి

3. కిందివాటిలో సరిగా జతపర్చనిది ఏది?

1) కార్పొరేషన్ పన్ను- ప్రత్యక్ష పన్ను
2) కస్టమ్ డ్యూటీ- పరోక్ష పన్ను
3) ఎక్సైజ్ పన్ను- ప్రత్యక్ష పన్ను
4) ఆదాయ పన్ను- ప్రత్యక్ష పన్ను

4. మితవ్యయ నియమం దేన్ని తెలుపుతుంది?

1) పన్నుల వసూలుకయ్యే ఖర్చు, దానివల్ల వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉండాలి
2) పన్నుల వసూలుకయ్యే ఖర్చు దానివల్ల వచ్చే ఆదాయంలో సమానంగా ఉండాలి
3) పన్నుల వసూలుకయ్యే ఖర్చు, దానివల్ల వచ్చే ఆదాయం కంటే చాలా తక్కువగా ఉండాలి
4) ఏదీకాదు

5. చట్టాలను అతిక్రమించిన వారిపై ప్రభుత్వం వేటిని విధించి ఆదాయం రాబట్టుకుంటున్నది?

1) ప్రత్యేక విధింపులు 2) ఫీజులు
3) ఎక్సైజ్ 4) జరిమానాలు

978
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles