చెట్లపై ఉత్పత్తి చేసిన ముడి లక్క ?


Wed,June 26, 2019 01:34 AM

గతవారం తరువాయి

క్రస్టేషియా

-వీటి అధ్యయనాన్ని కార్సినాలజి అంటారు.
-ఇవి జలచర జీవులు
ఉదా: రొయ్య (పాలిమాన్), పీత (కాన్సర్) బలాన (రాక్‌బార్నకిల్), సాక్యులైన (రూట్‌హెడెడ్ బార్నకిల్), అస్టికస్ (క్రేచేప), డాఫ్నియా (వాటర్‌ఫ్లీ)
నోట్: మంచినీటి రొయ్యల పెంపకాన్ని ప్రాన్‌కల్చర్ అంటారు
-సముద్ర రొయ్యల పెంపకాన్ని ష్రింప్ కల్చర్ అంటారు
-చేపల పెంపకాన్ని ఫిషీ కల్చర్ అంటారు
-జలచర జీవుల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు.

కైలోపొడా

-ఇవి భూచరాలు
-దీనిలో శతపాదులను (centipedes-వందకాళ్ల జీవులు) చేర్చారు.
ఉదా: కాలుజెర్రి (స్కాలోపెండ్రా) స్కూటిజెరా
డిప్లోపొడా
-ఇవి భూచరాలు
-దీనిలో సహస్రపాదులను (millipedes- వేయికాళ్ల జీవులు) చేర్చారు
ఉదా: స్పైరోస్ట్రప్టన్ (గాజుపురుగు) జూలస్
Bear

ఇన్‌సెక్టా (కీటకాలు)

-ఇది జంతుశాస్త్రంలో అతిపెద్ద విభాగం
-ఇవి విశ్వవ్యాప్త జీవులు
-వీటి అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటారు.
-వీటిలో మూడు జతల కాళ్లు, రెండు జతల రెక్కలు ఉంటాయి
-వీటి శ్వాస అవయవాలు-వాయునాళాలు
-వీటి విసర్జక అవయవాలు- మాల్ఫీజియన్ నాళికలు
-వీటిలో నేత్రాలు- సంయుక్త నేత్రాలు
-ఇవి యూరికోటెలిక్ జీవులు (ఇవి నీటిని పొదుపు చేసే అనుకూలనం వల్ల యూరికామ్ల స్పటికాలను విసర్జిస్తాయి)
ఉదా: బొద్దింక (పెరిప్లానేట), ఈగ (మస్కా), లెపిస్మా (వెండిచేప), దోమ, సీతాకోక చిలుక, పట్టుపురుగు, తేనేటీగలు, మాత్స్, లక్కపురుగు (డ్రాసోఫిలా, చీమలు, నల్లి (bedbug), పేను ( lice)

కూలి ఈగలు (Worker bee)

-ఇవి తేనెతుట్టెలో చాలా చిన్నవి
-ఇవి తేనెతుట్టెలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి (సుమారుగా 40వేల నుంచి 50వేల వరకు)
-ఇవి మైనాన్ని స్రవించి షడ్బుజాకార గదులు కలిగిన తేనెతుట్టెను నిర్మిస్తాయి
-ఇవి పుష్పాల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను తయారుచేస్తాయి.
-స్కౌట్ ఈగలు (కూలి ఈగలు) తేనెపట్టుకు తిరిగి వచ్చిన తరువాత మకరందం దొరికే ప్రదేశ సమాచారాన్ని ఇతర ఈగలకు తెలపడానికి వాగల్ నృత్యాన్ని (waggle dance) ప్రదర్శిస్తాయి
-కారల్‌వాన్ ఫ్రిష్ అనే శాస్త్రవేత్త తేనెటీగలు నృత్యం ద్వారా సంభాషించుకుంటాయని తెలియజేశాడు. అందుకు గాను అతనికి నోబెల్ బహుమతి లభించింది.
-ఇవి విషతుల్యమైన కట్టు పరికరంను కలిగి ఉండే తేనెపట్టును (Beehive) రక్షిస్తాయి.
-ఇవి నమిలేరకపు ముఖభాగాలను కలిగిఉంటాయి.

ముఖ్యమైన తేనెటీగలు

-ఎపిస్ మెల్లిఫెరా (ఐరోపా తేనెటీగ)
-ఇది ఎక్కువ నాణ్యమైన తేనెనిస్తుంది. ఇది తేనెటీగల పెంపకంలో ప్రీతిపాత్రమైంది.
-ఎపిస్‌సెరనాఇండికా(భారత/ఆసియన్ తేనెటీగ)
-ఎపిస్ డార్సేటా (వన్య/రాక్ తేనెటీగ)

తేనెటీగల ఆర్థిక ప్రాముఖ్యం

-తేనెటీగల ఉత్పత్తులైన తేనె, మైనం, ప్రొపోలిస్, తేనెటీగల విషం అనేక విధాలుగా ఉపయోగిస్తారు.
-తేనె-ప్రక్టోస్, గ్లూకోజ్, ఖనిజాలు, విటమిన్‌లకు మంచి వనరు
-మైనాన్ని సౌందర్య సాధనాలు, అనేక రకాల పాలిష్‌లు, కొవ్వొత్తుల తయారీలో వాడతారు.
-ప్రొప్పోలిస్‌ను కాలిన ఉపరితల గాయాలకు, వాపులకు ఉపయోగిస్తారు
-కూలి ఈగల కొండెం నుంచి తీసిన విషాన్ని కీళ్లవ్యాధి చికిత్సలో వాడతారు
-మొక్కలలో పరాగసంపర్కం చేసేవి తేనెటీగలే.

పట్టుపురుగు (Silk worm)

-దీని శాస్త్రీయ నామం- బాంబిక్స్ మోరి
-ఇది ఒక మాత్
-పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు
-వీటి ఆహారం- మల్బరీ ఆకులు
-పట్టులో ఉండే ప్రొటిన్- సిరిసిన్, ఫైబ్రాయిన్
-పట్టును లాలాజల గ్రంథులు స్రవిస్తాయి
-పట్టుకాయలను కకూన్‌లు అంటారు
-కకూన్‌ల నుంచి పట్టుదారం తీయడాన్ని రీలింగ్ అంటారు.
-పట్టుదారం తీసే దశ- ప్యూపా (కోశస్తదశ)
-రేయాన్‌ను కృత్రిమ పట్టు అంటారు. మొక్కలలోని సెల్యులోజ్‌ను వేడిచేసి విస్కోజ్ అనే పదార్థంగా మార్చి దాని నుంచి రేయాన్‌ను తయారుచేస్తారు.
-పట్టు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు వరుసగా చైనా, జపాన్, ఇండియా
-మన దేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం- కర్ణాటక
-1kg పట్టు ఉత్పత్తికి సుమారు 5000 పట్టు గూళ్లు అవసరం. పట్టులో ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. అవి
-మల్బరీ పట్టు (Mulberry silk), టస్సార్ పట్టు (Tussar silk), ఈరీ పట్టు (Eri silk), మూగా పట్టు (Muga silk)

మల్బరీ పట్టు

-ఇది అన్నింటికంటే నాణ్యమైనది
-ఈ పట్టును బాంబిక్స్ మోరీ అనే కీటకం ఉత్పత్తి చేస్తుంది

టస్సార్ పట్టు

-ఈ పట్టును ఆంథీరియా పాపియా అను కీటకం ఉత్పత్తి చేస్తుంది
-దీనిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్‌లలో పెంచుతున్నారు.

ఈరీ పట్టు

-ఈ పట్టును అట్టాకస్‌రెసిని, అట్టాకస్ సిందియా అనే కీటకాలు ఉత్పత్తి చేస్తాయి.

మూగా పట్టు

-ఈ పట్టును థియోఫిలా రిలీజియోజా అనే కీటకం ఉత్పత్తి చేస్తుంది. ఇది నాసిరకం పట్టు

పట్టు ఉపయోగాలు

-వస్ర్తాల తయారీకి ఉపయోగపడుతుంది
-గాయాలను కుట్టడానికి తోడ్పడుతుంది
నోట్: యూజి ఈగలు పట్టు పరిశ్రమకు నష్టాన్ని కలిగిస్తాయి

చీమ

-వీటి అధ్యయనాన్ని మిర్మికాలజి అంటారు.
-ఇవి కూడ సంఘజీవులు.
-ఎర్రచీమలు ఉత్పత్తి చేసే ఆమ్లం- ఫార్మిక్ ఆమ్లం
-ఇవి పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు
నోట్: కీటకాలు తమజాతి జీవులను గుర్తించటానికి విడుదల చేసే రసాయనాలను ఫిరమోన్స్ అంటారు

చెదలు (Termites)

-వీటిని తెల్లచీమలు (White ants) అంటారు
-ఇవి కాగితం, చెక్కను ఆహరంగా తీసుకుంటాయి

బొద్దింక

-శాస్త్రీయ నామం-పెరిప్లానేట
-ఇది నిశాచర జీవి (రాత్రిపూట సంచరిస్తుంది)
-ఇది సర్వభక్షకి (Ominvare)
-దీనిలో కొరికి నమిలే రకానికి చెందిన ముఖ భాగాలు ఉంటాయి.
-దీనిలో రక్తం తెలుపు రంగులో ఉంటుంది. దీనికి గల కారణం శ్వాసవర్ణకం (HB) ఉండదు.
-దీన్ని 13 గదుల హృదయం ఉంటుంది.
-శ్వాసక్రియ వాయునాళాల ద్వారా జరుగుతుంది.
-విసర్జనక్రియ మాల్సీజియన్ నాళాల ద్వారా జరుగుతుంది

ఈగ (Housefly)

-దీని శాస్త్రీయ నామం- మస్కా డొమెస్టికా
-ఈగల ద్వారా కలరా, టైఫాయిడ్, క్షయ, అమీబియాసిస్ మొదలగు రోగాలు సంక్రమిస్తాయి
-ఈగ లార్వాను(డింబకం) మాగట్ అంటారు. దీన్ని ఉపయోగించి వైద్యరంగంలో గాయాలను శుభ్రం చేస్తారు. దీనిని మాగట్ థెరఫీ అంటారు

దోమ(Mosquito)

-ఎడిస్, అనాఫీలిస్, క్యూలెక్స్ లాంటి ప్రజాతులు కలవు
-దీనిలో గుచ్చి పీల్చే రకానికి చెందిన ముఖ భాగాలు ఉంటాయి.
-దోమలో రక్తం గడ్డకట్టకుండా ఉంచే పదార్ధం- హీమోలైసిన్
-ఆడ దోమలు రక్తాన్ని గుచ్చి పీల్చుకుంటాయి.
-మగ దోమలు చెట్ల రసాలను పీల్చుతాయి.
-దోమల శబ్ధాలను ష్రిల్ అంటారు.
-దోమ లార్వా - రాగ్లర్
-దోమ ప్యూపా- టంబ్లర్
-దోమ లార్వాలను చంపటానికి నీటిలో కిరోసిన్ చల్లటం వల్ల అవి శ్వాస ఆడక మరణిస్తాయి.
-గాంబూసియా చేపలను నీటిలో వదిలి దోమ లార్వాలను జీవశాస్త్రీయంగా నిర్మూలిస్తారు.
-ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
-ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా బోదకాలు & మెదడు వాపు వ్యాధి వ్యాప్తి చెందుతాయి.
-ఎడిస్ దోమ ద్వారా డెంగ్యూ జ్వరం (ఎల్లోఫీవర్) చికెన్ గున్యా వ్యాధి వ్యాప్తి చెందుతాయి.

డ్రోసోఫిలా (Fruit fly)

-దీన్ని సిండెరెల్లా ఆఫ్ జెనెటిక్స్ అంటారు.
-ఎక్కువగా జన్యుశాస్త్ర ప్రయోగాలలో ఉపయోగిస్తారు.

తేనెటీగ (Honey bee)

-తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు
-తేనెటీగలను తేనె, మైనం కోసం పెంచుతారు
-ఇవి సంఘజీవనం గడుపుతాయి
-తేనెటీగ సహనివేశం/తేనెతుట్టెలో మూడు రకాల ఈగలు ఉంటాయి. అవి.. రాణి ఈగ (Queen bee), డ్రోన్‌లు (Drones), కూలి ఈగలు (Worker bee)

రాణిఈగ (Queen bee)

-ఇది సహనివేశంలో/తేనెతుట్టెలో అతిపెద్దజీవి
-తేనె తుట్టెలో ఒకటి మాత్రమే ఉంటుంది
-ఇది గుడ్లు పెట్టడం అనే ఏకైక విధిని నిర్వహిస్తుంది

డ్రోన్‌లు/మగ ఈగలు (Drones)

-ఇవి బలిష్టంగా, పెద్దరెక్కలు కలిగి తక్కువ సంఖ్యలో ఉండి తక్కువ కాలం జీవిస్తాయి
-ఒక తేనెతుట్టెలో ఇవి సుమారు 200-300 వరకు ఉంటాయి

లక్కపురుగు (Lac worm)

-దీని శాస్త్రీయనామం- లాక్సిఫర్ లక్కా/ టాకార్డియాలక్కా
-వీటి పెంపకాన్ని లాక్‌కల్చర్ అంటారు
-లక్కపురుగు ఆహారం- తుమ్మ, రావి, బేర్ ఆకులు
-వీటి శరీర కుడ్యంలో త్వచ గ్రంథులు ఉండి లక్కను స్రవిస్తాయి
-లక్కను సీల్ వేయడంలో, ఆభరణాలు, గుండీలు, గ్రామ్‌ఫోన్ రికార్డులు, బొమ్మలు, అద్దాల వెనుక పూత, తోలు వస్తువుల తయారీలో వాడతారు
-చెట్లపై ఉత్పత్తి చేసిన ముడి లక్కను స్టిక్‌లాక్ అంటారు. శుద్ది చేసిన లక్కను షెల్లాక్ అంటారు.
-ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానం - ఇండియా
-ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో ద్వితీయ స్థానం - మయన్మార్
-ఇండియాలో లక్క ఉత్పత్తిలో ప్రథమస్థానం -బీహార్

Mallesh

424
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles