అగ్రికల్చర్ యూనివర్సి టీలో బీఎస్సీ/బీటెక్


Wed,June 26, 2019 01:50 AM

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అగ్రిసెట్ & అగ్రిఇంజినీరింగ్‌సెట్-2019 నోటిఫికేషన్ విడుదలైంది.
PJTSAU
-కోర్సుపేరు: నాలుగేండ్ల బీఎస్సీ(ఆనర్స్)
-మొత్తం సీట్లసంఖ్య: 65. వీటిలో అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థులకు 58, సీడ్ టెక్నాలజీ డిప్లొమా అభ్యర్థులకు 7 సీట్లు కేటాయించారు.
-విద్యార్హత: పీజేటీఎస్‌ఏయూ/ఏఎన్‌జీఆర్‌ఏయూ ల నుంచి అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-కోర్సు పేరు: బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
-మొత్తం సీట్ల సంఖ్య: 8
-విద్యార్హత: పీజేటీఎస్‌ఏయూ/ఏఎన్‌జీఆర్‌ఏయూల నుంచి అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
గమనిక: 2018-19 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తిచేయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలు రూ.1200/- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 600/-
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా. రెండు గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 17
-పరీక్షతేదీ: జూలై 26
-వెబ్‌సైట్: www.pjtsau.ac.in

597
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles