టాలెంట్ ర్యాంకింగ్స్


Mon,December 10, 2018 01:12 AM

దేశంలో నైపుణ్యం ఉన్నవారి సంఖ్య ప్రతిఏటా తగ్గుతూ వస్తున్నది. ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నామని చెబుతున్నప్పటికీ, సర్కార్ విద్యాసంస్థల్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోతున్నాయి. విద్యావ్యవస్థ నుంచి ప్రభుత్వాలు క్రమంగా తప్పుకుంటూ ప్రజాధనాన్ని వెచ్చించడంలేదు. దీంతో మెరుగైన విద్యా అవకాశాలు అందరికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. దేశ జనాభాలో మానవవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో నిపుణుల కొరత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో నిపుణుల తయారీ, లభ్యత, సంసిద్ధత ఆధారంగా ఐఎండీ బిజినెస్ స్కూల్ ప్రకటించిన గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్ గురించి తెలుసుకుందాం...
skill
-విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి, వనరులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టడం, విద్యపై ప్రజలు వెచ్చించే ధనం, విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి, నిపుణులైన మానవవనరులను తయారుచేసేలా మౌలిక వసతుల కల్పన వంటి అంశాల ఆధారంగా ఐఎండీ బిజినెస్ స్కూల్ ప్రపంచ నైపుణ్య ర్యాంకులను కేటాయిస్తుంది.
-ఈ జాబితాలో భారత్ గతేడాది కంటే రెండు స్థానాలు కోల్పోయి 53వ స్థానంలో నిలిచింది. 2017లో 51వ స్థానంలో ఉన్నది.
-జాబితాలోని 63 దేశాల ఆర్థికవ్యవస్థల్లో తలసరి ఆదాయం అధికంగా ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 48 దేశాలు నైపుణ్యాల అభివృద్ధి, అత్యధిక నైపుణ్యాలు ఉన్నవారిని ఆకర్షించడం, దేశంలో ఉన్న నైపుణ్యాన్ని అక్కడే ఉండేలా చర్యలు తీసుకోగా, మిగిలిన 15 దేశాలు విఫలమయ్యాయి.

-ఐఎండీ గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్‌లో స్విట్జర్లాండ్ వరుసగా ఐదోసారి మొదటి స్థానంలో నిలిచింది. మొత్తంగా ఆ దేశం 100 పాయింట్లు సాధించగా, 91.97 పాయింట్లతో డెన్మార్క్ రెండోస్థానంలో ఉంది.
-గతేడాదికంటే 4 స్థానాలు ఎగబాకిన నార్వే 86.37 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఐరోపా దేశాలైన ఆస్ట్రియా, నెదర్లాండ్స్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, లక్సెంబర్గ్, జర్మనీలు టాప్ 10లో నిలిచాయి.
-ఆసియా దేశాల్లో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం జాబితాలో 78.66 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నది.
-స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్ ప్రతి ఏటా ఈ ర్యాంకులను విడుదల చేస్తుంది.
-ఇది ఒక ఆర్థికవ్యవస్థలోని టాలెంట్ పూల్‌లో నైపుణ్యం ఉన్నవారి లభ్యతను తెలుపుతుంది. అదేవిధంగా ఆయా దేశాలు అంతర్జాతీయ నిపుణులను ఎంతమేరకు ఆకర్షిస్తున్నాయనే విషయాలను తెలుసుకోవచ్చు.

ర్యాంకులకు ఆధారం..

-టాలెంట్ ర్యాంకులను కేటాయించడానికి ఐఎంబీ బిజినెస్ సంస్థ మూడు అంశాలను కొలమానాలుగా తీసుకుంటుంది. అవి.. టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులు, అప్పీల్, సంసిద్ధత.
-పెట్టుబడి, అభివృద్ధి: దేశంలో నిపుణులు లేదా నైపుణ్యం ఉన్నవారిని తయారుచేయడానికి అవసరమైన వసతుల కోసం పెట్టుబడి పెట్టడం, అభివృద్ధి చేయడం.
-అప్పీల్: దేశీయ అవసరాలకోసం విదేశీ నిపుణులను ఆకర్షించడం, దేశంలోని ప్రతిభావంతులను విదేశీ టాంలెంట్ పూల్‌లోకి వెళ్లకుండా నిలువరించడం (అట్టిపెట్టుకోవడం).
-సంసిద్ధత: దేశంలో సామర్థ్యం ఉండి సిద్ధంగా ఉన్న నిపుణులు, ప్రజ్ఞావంతుల లభ్యత.

వివిధ అంశాల్లో భారత్ ర్యాంకులు

-టాలెంట్ ర్యాంకింగ్స్‌లో భారత్ 53వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకును నిర్ణయించడానికి కొలమానాలుగా తీసుకునే అంశాలైన పెట్టుబడి, అభివృద్ధిలో 63వ స్థానంలో, విదేశీ నిపుణులను ఆకర్షించడం, దేశీయ నైపుణ్యాన్ని తరలిపోకుండా నిలిపి ఉంచడం(అప్పీల్)లో 44, సంసిద్ధతలో భారత్ 30వ స్థానంలో నిలిచింది. వీటిలో మిళితమై ఉన్న మరికొన్ని అంశాలు, వాటిలో భారత్ ర్యాంకులు...

అప్పీల్

-జీవన వ్యయం- 78.90 (ఇండెక్స్)- 42వ ర్యాంకు
-ప్రతిభావంతులను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం- 6.56 (సర్వే)- 34వ ర్యాంకు
-కార్మికుల ప్రేరణ- 5.82 (సర్వే)- 34వ స్థానం
-Brain drain (ఉన్నత విద్య, అత్యధిక సామర్థ్యం కలిగినవారు)- 5.03 (సర్వే)- 31వ ర్యాంకు
-నాణ్యమైన జీవనం- 4.55 (సర్వే)- 54వ ర్యాంకు
-అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులు- 5.02 (సర్వే)- 36వ ర్యాంకు
-సేవల విభాగంలో జీతాలు- 7,092 డాలర్లు (బోనస్ వంటివాటితో కలుపుకుని మొత్తం వార్షిక ఆదాయం)- 59వ ర్యాంకు
-మేనేజ్‌మెంట్ జీతాలు- 105,656 డాలర్లు- 44వ ర్యాంకు
-వృత్తి పన్ను- 11.4 శాతం- 17వ ర్యాంకు
-వ్యక్తిగత భద్రత, ఆస్తి హక్కు- 40వ ర్యాంకు సంసిద్ధత
-కార్మికుల పెరుగుదల- 1.82 శాతం- 20వ ర్యాంకు
-నైపుణ్యం ఉన్న కార్మికులు- 6.12 (సర్వే)- 19వ ర్యాంకు
-ఫైనాన్స్ స్కిల్స్- 6.80 (సర్వే)- 22వ ర్యాంకు
-అంతర్జాతీయ అనుభవం- 4.94 (సర్వే)- 46వ ర్యాంకు
-కాంపిటెంట్ సీనియర్ మేనేజర్స్- 5.92 (సర్వే)- 27వ ర్యాంకు
-ఎడ్యుకేషనల్ సిస్టమ్స్- 5.63 (సర్వే)- 35వ ర్యాంకు
-సైన్స్ ఇన్ స్కూల్స్- 6.49 (సర్వే)- 13వ ర్యాంకు
-యూనివర్సిటీ స్కూల్స్- 5.88 (సర్వే)- 31వ ర్యాంకు
-మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్- 6.41 (సర్వే)- 26వ ర్యాంకు
-లాంగ్వేజ్ స్కిల్స్- 6.96 (సర్వే)- 27వ ర్యాంకు

ప్రాంతాల వారీగా

-ఐఎండీ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో దేశాలను ప్రాంతాల వారీగా విభజించారు. అందులో పశ్చిమ ఐరోపా, తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియా-ఆఫ్రికా, మధ్య ఆసియా-Ex-కామన్‌వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ (CIS), తూర్పు ఆసియా, దక్షిణాసియా-పసిఫిక్ దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు ఉన్నాయి. వీటిలో పశ్చిమ ఐరోపా దేశాలు అగ్రస్థానంలో ఉండగా, తూర్పు ఐరోపా, దక్షిణ అమెరికా దేశాలు చివరి 10 స్థానాల్లో ఉన్నాయి.
-దక్షిణాసియా, పసిఫిక్ దేశాలు: ఆసియాతోపాటు, దక్షిణాసియా దేశాల్లో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సింగపూర్ సంసిద్ధతలో రెండో స్థానంలో, నిపుణులను ఆకర్షించడంలో 15, టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడుల్లో 34వ స్థానంలో నిలిచి మొత్తంగా ఈ ర్యాంకుల్లో 13వ స్థానంలో ఉంది. మిగిలిన దేశాలైన భారత్ 53వ ర్యాంకులో, మలేషియా 22, థాయ్‌లాండ్ 42, ఇండోనేషియా 45, ఫిలిప్పీన్స్ 55వ స్థానంలో, పసిఫిక్ దేశాలైన ఆస్ట్రేలియా 14, న్యూజీలాండ్ 20వ ర్యాంకులో ఉన్నాయి.
-టాలెంట్ పూల్‌లో భారత్ సగటు స్థాయి కన్నా మెరుగ్గా ఉండగా (సంసిద్ధత ప్రాతిపదికన 30వ స్థానం), టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడుల్లో మాత్రం వెనుకబడి 63వ స్థానంలో ఉన్నది.
-పశ్చిమ ఆసియా, ఆఫ్రికా: ఈ ప్రాంతంలో 19వ ర్యాంకుతో ఇజ్రాయెల్ ప్రథమ స్థానంలో ఉన్నది. మిగిలిన దేశాలైన ఖతార్ 24, యూఏఈ 26, సౌదీ అరేబియా 34, జోర్డాన్ 41, దక్షిణాఫ్రికా 50, టర్కీ 51వ ర్యాంకులో ఉన్నాయి.
-మధ్య ఆసియా, Ex-CIS: కజకిస్థాన్ 40, రష్యా 46, మంగోలియా 62వ ర్యాంకుల్లో ఉన్నాయి.

-తూర్పు ఆసియా: ఈ ప్రాంతంలోని దేశాల్లో హాంకాంగ్ 18వ ర్యాంకులో ఉండగా, తైవాన్ 27, జపాన్ 29, కొరియా 33, చైనా 39వ స్థానాల్లో నిలిచాయి.
-పశ్చిమ ఐరోపా: ఈ ప్రాంతంలో స్విట్జర్లాండ్, నార్డిక్ దేశాలు అగ్ర స్థానాల్లో ఉన్నాయి. విద్యపై ప్రభుత్వ పెట్టుబడి, అభివృద్ధిలో 4వ స్థానంలో, ఆకర్షించడం, సంసిద్ధత అంశాల్లో టాప్ ర్యాంకుతో టాలెంట్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉన్నది. నార్డిక్ దేశాలైన డెన్మార్క్ 2, నార్వే 3, ఫిన్లాండ్ 7, స్వీడన్ 8వ స్థానాల్లో ఉండగా, ఐస్‌లాండ్ మాత్రం 16వ స్థానంలో ఉన్నది. పశ్చిమ ఐరోపా దేశాలైన ఆస్ట్రియా 4, నెదర్లాండ్స్ 5, లక్సెంబర్గ్ 9, జర్మనీ 10, బెల్జియం 11, సైప్రస్ 15, పోర్చుగల్ 17, ఐర్లాండ్ 21, యునైటెడ్ కింగ్‌డమ్ 23, ఫ్రాన్స్ 25, స్పెయిన్ 31, ఇటలీ 32, గ్రీస్ 44వ స్థానాల్లో ఉన్నాయి.
-తూర్పు ఐరోపా: ఎస్తోనియా 28వ ర్యాంకుతో తూర్పు ఐరోపాలో అగ్రస్థానంలో ఉండగా స్లొవేనియా 30, లాత్వియా 35, లిథువేనియా 36, చెక్ రిపబ్లిక్ 37, పోలెండ్ 38, ఉక్రెయిన్ 48, హంగరీ 49, క్రొయేషియా 54, రొమేనియా 56, బల్గేరియా 57, స్లొవాక్ రిపబ్లిక్ 59వ స్థానాల్లో నిలిచాయి.
-ఉత్తర అమెరికా: కెనడా 84.50 స్కోర్‌తో జాబితాలో 6వ స్థానంలో నిలవగా, యూఎస్‌ఏ 12 (79.22 పాయింట్లు), మెక్సికో 61 (38.86 స్కోర్)వ స్థానాల్లో ఉన్నాయి.
-దక్షిణ అమెరికా: చిలీ 43వ స్థానంలో ఉండగా, అర్జెంటీనా 47, పెరూ 52, బ్రెజిల్ 58, కొలంబియా 60, వెనెజులా 63వ స్థానాల్లో నిలిచాయి.

పెట్టుబడి, అభివృద్ధి

-విద్యపై ప్రజలు చేసే ఖర్చు- 3 శాతం (జీడీపీలో)- 59వ ర్యాంకు
-సెకండరీ విద్యపై ప్రభుత్వ ఖర్చు- 16.8 శాతం (తలసరి జీడీపీ)- 43వ ర్యాంకు
-ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక విద్య- 29.06- 60వ ర్యాంకు
-ఉన్నత విద్య- 31.65- 63వ ర్యాంకు
-అప్రెంటిషిప్స్- 5.38 (సర్వే ప్రకారం 0-10 పాయింట్లు)- 18వ ర్యాంకు
-ఎంప్లాయీ ట్రైనింగ్- 5.37 (సర్వే)- 42వ ర్యాంకు
-మహిళా కార్మికులు- 23.19 శాతం (మ్తొతం కార్మికుల్లో)- 58వ ర్యాంకు
-వైద్య సౌకర్యాలు- 4.29 (సర్వే)- 45వ ర్యాంకు

గణేష్ సుంకరి

761
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles