సులభతర వాణిజ్య సూచీ


Wed,November 21, 2018 01:41 AM

EOCD
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆ దేశంలోని వాణిజ్యంపై ఆధారపడి ఉంటుంది. అనుకూలమైన ప్రదేశాల్లో వాణిజ్యం కొనసాగడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం) అంటారు. ప్రపంచంలోని ధనిక, పేద దేశాలన్నింట్లో జరిగే సులభతర వాణిజ్యంపై ప్రతి ఏటా ఓ సూచికను విడుదల చేస్తారు. సులభతర వాణిజ్య సూచికను ఎవరు ప్రకటిస్తారు? ఈ ఏడాది
సూచికలోని ఆయా దేశాల స్థానాలేంటో చూద్దాం..

- ఈ సూచికను ప్రపంచ బ్యాంకు 2001లో ఆర్థికవేత్త సిమియోన్ జంకోవ్ (Simeon Djankov), ప్రొఫెసర్లు ఒలీవర్ హార్ట్, ఆండ్య్రూ ష్లీఫర్‌ల సహాయంతో ప్రారంభించింది. 2003లో మొదటి సూచికను రూపొందించింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు 190 దేశాలకు ర్యాంకులను ఇస్తుంది.
- వ్యాపార ఆరంభం, నిర్మాణ అనుమతులు, రుణం పొంద డం, మైనారిటీ ఇన్వెస్టర్ల రక్షణ, పన్నుల చెల్లింపు, విద్యుత్ కనెక్షన్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, సరిహద్దుల వాణిజ్యం, ఒప్పందాల అమలు, దివాలా పరిష్కారం వంటి పది విషయాల ఆధారంగా ప్రపంచ బ్యాంకు నిపుణులు ఈ సూచికను రూపొందిస్తారు.
వ్యాపారాన్ని ప్రారంభించడం
- కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికోసం ఆయా దేశాలు ఎలాంటి నియమాలు అనుసరిస్తున్నాయి? గత నియమాలను ఎంతవరకు సరళీకరించాయి? ప్రోత్సాహం ఎలా ఉంది? తదితర విషయాలను పరిశీలిస్తారు.

2018 సూచిక
1) న్యూజీలాండ్
2) సింగపూర్
3) డెన్మార్క్
4) దక్షిణ కొరియా
5) హాంకాంగ్
6) అమెరికా
7) బ్రిటన్
8) నార్వే
9) జార్జియా
10) స్వీడన్
78) చైనా
147) పాకిస్థాన్

ఆస్తుల రిజిస్ట్రేషన్

- వ్యాపారాన్ని ప్రారంభించాలంటే దానికి సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్ ఎలా ఉందో చూస్తారు. ఆయా దేశాల్లో భూ పరిపాలన వ్యవస్థ విధానం, ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో అనుసరిస్తున్న విధానాలు, మౌలిక సదుపాయాలు అందించే తీరు గమనిస్తారు.

రుణం పొందడం

- వ్యాపారం ప్రారంభించాలంటే రుణం అనేది చాలా ముఖ్యమైంది. ఈ రుణ సదుపాయాలను కల్పించడంలో వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తారు. సురక్షిత లావాదేవీలకు సం బంధించి రుణదాతలు, రుణగ్రహీతల చట్టపరమైన హక్కులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు.

నిర్మాణ అనుమతులు

- వ్యాపారాలకు సంబంధించి వివిధ నిర్మాణాలకు అనుమతులిచ్చే తీరు, నాణ్యత, సమ యం, నిధుల కేటాయింపు తదితర విషయాలను పరిశీలిస్తారు.

విద్యుత్ కనెక్షన్

- వ్యాపారాలకు సంబంధించిన కంపెనీలకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చేందుకు పట్టే సమ యం, నాణ్యత, సరఫరా ఎలా ఉన్నాయో చూస్తారు.

సరిహద్దుల వాణిజ్యం

- వివిధ దేశాల్లో అంతర్గత, సరిహద్దుల వాణిజ్య వివాదాలను ఎలా పరిష్కరిస్తున్నారు. ఇందుకు ఎంత సమయాన్ని, ఖర్చును భరిస్తున్నారు, చట్టాల అమలు తీరు ఎలా ఉందని పరిశీలిస్తారు.

మైనారిటీ ఇన్వెస్టర్ల రక్షణ

- వ్యాపార లావాదేవీల్లో వైరుధ్యం ఏర్పడినప్పుడు సంస్థలోని మైనారిటీ ఇన్వెస్టర్ల (వాటాదారులు) హక్కుల పరిరక్షణలో ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ను గమనిస్తారు.
- ఒప్పందాల అమలు: ఎగుమతులు, దిగుమతులు, వివిధ దేశాలకు సరకు సరఫరా తదితర ఒప్పందాల అమలుతీరును పరిశిలీస్తారు.

పన్నుల చెల్లింపు

- సూక్ష్మ, మధ్యస్థాయి కంపెనీలు ఏడాదికి ఎంత పన్ను కడుతున్నాయి, పన్నుల రేట్లు, విధానం ఎలా ఉన్నాయనే వాటి ని గమనిస్తారు.

దివాలా పరిష్కారం

- కంపెనీలు దివాలా తీసినప్పుడు ప్రభు త్వం పరిష్కరించేతీరు, రుణ వసూళ్లు, ఆర్థిక న్యాయ ప్రక్రియ విధానాలను పరిశీలిస్తారు.

2019 సూచీ


Bank
- ప్రపంచ బ్యాంకు 190 దేశాల్లో పై పది అంశాలను పరిశీలించి సులభతర వాణిజ్య ర్యాంకులను ప్రకటించింది. ఇందులో వరుసగా మొదటి పదిస్థానాల్లో నిలిచిన దేశాలు.
1) న్యూజీలాండ్
2) సింగపూర్
3) డెన్మార్క్
4) హాంకాంగ్
5) దక్షిణ కొరియా
6) జార్జియా
7) నార్వే
8) అమెరికా
9) బ్రిటన్
10) మాసిడోనియా

- భారతదేశం 77వ ర్యాంకు పొంది దక్షిణాసియా దేశాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది. గతేడాది 100వ స్థానంలో నిలిచిన భారత్ ఏడాదిలో 23 స్థానాలు ఎగబాకి 77వ స్థానం దక్కించుకోవడం విశేషం.
- ఈ సూచికలో చైనా 46, పాకిస్థాన్ 136వ స్థానాల్లో నిలిచాయి.
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019లో భారత్ నాలుగు అంశాల్లో వెనుకబడిందని సూచిక వెల్లడించింది. అవి.. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, ఒప్పందాల అమలు, మైనారిటీ ఇన్వెస్టర్ల రక్షణ, దివాలా పరిష్కారం.
- వ్యాపారం ప్రారంభించడం, నిర్మాణ అనుమతులు, విద్యుత్ కనెక్షన్, రుణాలు పొందడం, పన్నుల చెల్లింపు, సరిహద్దుల వ్యాపారం వంటి ఆరు విషయాలు భారత్ మెరుగుపర్చుకున్న అంశాలు.

-చాపల సత్యం

మానవ యాత్రకు మరో అడుగు


Tower
జీఎస్‌ఎల్‌వీ మార్క్ -3d2
- అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపాలని తహతహలాడుతున్న భారత్ ఆ దిశగా మరో ముందడుగు వేసింది. మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అవసరమయ్యే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ను నవంబర్ 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా భారత కృత్రిమ ఉపగ్రహాల చరిత్రలో అత్యంత బరువైన జీశాట్-29ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
- అంతరిక్ష ప్రయోగాల్లో వైఫల్యం అన్నది ఎరుగకుండా అమెరికా, రష్యా వంటి దేశాలకు దీటుగా భారత్ పరుగులు తీస్తున్నది. తక్కువ వ్యయంతో ప్రయోగాలు చేయటం ద్వారా ఈ రంగంలోని మార్కెట్‌పై ఇప్పటికే ఆధిపత్యం సాధించిన భారత్, ఇక భారీ ప్రయోగాలపై దృష్టిపెట్టింది. మరో మూడేండ్లలో అంతరిక్షంలోకి మనిషిని పంపాలని లక్ష్యం నిర్దేశించుకున్న ఇస్రో ఆ దిశగా మరో అడుగు వేసింది. స్వీయ సమాచార ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నవంబర్ 14న జీశాట్-29 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఈ ప్రయోగం ద్వారా భారీ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీని మరోసారి పరీక్షించి చూశారు. ఇస్రో త్వరలో చేపట్టబోయే చంద్రయాన్-2, మానవ సహిత యాత్రలకు ఈ రాకెట్‌నే వాడనున్నారు.

ప్రయోగ విశేషాలు


- జీఎస్‌ఎల్వీ మార్క్-3డీ2 బరువు జీశాట్-29తో కలిపి 640 టన్నులు
- జీశాట్ -29 ఉపగ్రహం బరువు 3,423 కిలోలు.
- రాకెట్‌లో మూడు దశలున్నాయి. ఘన, ద్రవ, క్రయోజనిక్ (ఇందులో క్రయోజనిక్ దశ అత్యంత శక్తిమంతమైనది)
- రాకెట్ ఎత్తు 143 అడుగులు (43.5 మీటర్లు)
- శ్రీహరికోట షార్‌లోని రెండో లాంచ్‌పాడ్ నుంచి ప్రయోగించారు.
- ఈ రాకెట్‌కు 4 టన్నుల బరువును మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది.
- జీశాట్ ఉపగ్రహం జీవిత కాలం 10 ఏండ్లు

- ఈశాన్య రాష్ర్టాలు, జమ్ముకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాలకు కూడా సమాచార వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చేందుకు, డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
- ఇందులో Ka/Ku ట్రాన్స్‌పాండర్లను అమర్చారు.
- జీశాట్-29లో కేయూ బాండ్ ఫోర్ యూజర్ స్పాట్ బీమ్స్, కేఏ బాండ్ ఫోర్ యూజర్ స్పాట్ బీమ్, వన్ యూజర్ స్టీరిబుల్ బీమ్, క్యూవీ బాండ్ కమ్యూనికేషన్ పేలోడ్, జియో హైరిజల్యూషన్ కెమెరా, ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్ అనే పరికరాలు అమర్చారు.
- ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు.
- జీఎస్‌ఎల్వీ మార్క్-3డీ1 రాకెట్‌ను 2017 జూన్ 5న ప్రయోగించారు. దాని ద్వారా జీశాట్ 19 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపారు.
- జీఎస్‌ఎల్వీ మార్క్-3డీ2 ప్రయోగం సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిపిన ప్రయోగాల్లో 67వది.
- ఇస్రో నిర్మించిన సమాచార ఉపగ్రహాల్లో జీశాట్ -29 ఉపగ్రహం 33వది.

- వేణు బెక్కం

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles