ఫిజిక్స్ గొట్టు ఏమీకాదు


Wed,November 21, 2018 01:38 AM

- నీట్ (యూజీ)లో విజయం సాధించాలంటే ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించడం తప్పనిసరి. అయితే ఫిజిక్స్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలి? ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు? ముఖ్యంగా మెడికల్ విద్యార్థులు గణితపరమైన విషయాలను స్కూల్ స్థాయి వరకే చదివి ఉండటంవల్ల కొంత గాబరాపడటం సహజం, అయినప్పటికీ ఫిజిక్స్‌ను పక్షపాత ధోరణితో చూడకుండా, ఇష్టపడి చదివేవిధంగా ఉండాలనే తపనను ఈ వ్యాస రూపంలో అందిస్తున్నాం.
- ఏ పరీక్ష అయినప్పటికీ నూటికి నూరు శాతం అన్ని పాఠ్యాంశాలను చదవాలా? లేక కొన్ని పాఠ్యాంశాలు చదివితే సరిపోతుందా? అనే కోణం నుంచి విశ్లేషణను ఆరంభిస్తున్నాం.

ఫిజిక్స్‌లో ముఖ్యమైన పాఠ్యాంశాలు

- నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష అనేది ఒక పోటీ పరీక్ష. దీనికి సిలబస్‌పై పూర్తి అవగాహన మాత్రమే కాదు, పాత ప్రశ్నపత్రాలపై సంపూర్ణమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది.
- ప్రవేశ పరీక్ష దృష్ట్యా ఫిజిక్స్‌ను స్థూలంగా 6 భాగాలుగా విభజించుకోవాలి.

1) మెకానిక్స్ (30 శాతం)
2) ఎలక్ట్రో డైనమిక్స్ (20 శాతం)
3) హీట్ అండ్ థర్మోడైనమిక్స్ (10 శాతం)
4) మోడరన్ ఫిజిక్స్ (15 శాతం)
5) ఆప్టిక్స్ (13 శాతం)
6) ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్ (12 శాతం)

ప్రశ్నల సరళి

- నీట్‌లో ప్రశ్నలు ఏవిధంగా ఉంటున్నాయి. వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలనే విషయాన్ని కొన్ని ఉదాహరణలతో చర్చిద్దాం.
- పైన పేర్కొన్న వెయిటేజీ ఆధారంగా చూస్తే మెకానిక్స్‌ను ఒక ప్రత్యేకమైన విభాగంగా పరిగణించి చదవాలి. ప్రత్యేకం అని ఎందుకంటే దాదాపుగా నూటికి 90 శాతం మంది విద్యార్థులు ఈ విభాగాన్ని చూస్తే భయపడుతున్నారు. కారణం ఏమై ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు.

కారణం

1) ఈ విభాగంలోని ప్రశ్నలు పూర్తిగా గణిత ఆధారపరమైనవి కావడం, దీనికి గణిత సంబంధ మౌలిక అంశాలపట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉండటం
2) ఒక పాఠ్యాంశానికి మరో పాఠ్యాంశానికి మధ్య అంతర సంబంధిత ప్రశ్నలు అనేకం ఉండటం
3) మూడు లేదా నాలుగు అంశాలను మిళితం చేస్తూ ప్రశ్నలు అడగటం
ఉదా: 1) ది మోడరన్ ఆఫ్ ది ఫోర్స్ F= 4i + 5j (2, 0, -3) about the point (2, -2, -2) is given by.
- ప్రశ్న చూడటానికి చాలా సరళంగా ఉన్నప్పటికీ ఎగ్జామ్ ఆంతర్యం చాలా క్లిష్టంగా ఉంది, అదేమంటే విద్యార్థికి లీనియర్ మోషన్‌కు సర్క్యులర్ మోషన్‌కు తేడా తెలుస్తుందా? లేదా?
- ఏ విద్యార్థి అయితే ఈ చిన్న అంతరాన్ని పసిగడతాడో అతడే విజేతగా నిలుస్తాడు.
- ఎప్పుడయితే మూమెంట్ అనే పదాన్ని భిన్నంగా చదువుతాడో అది సర్క్యులర్ మోషన్ అని Torque గురించి ప్రశ్నిస్తున్నాడని, l~= rxF అనే సంబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని ప్రశ్నకు సమాధానం ఇవ్వగలుగుతాడు.
- ఇంతకు మునుపు ఒక పాఠ్యాంశానికి, ఇంకొక పాఠ్యాంశానికి అంతర సంబంధం ఉంటుంది. ఇక్కడ విద్యార్థికి డిస్‌ప్లేస్‌మెంట్ వెక్టర్ ( r) పైన అవగాహన అవసరం. అంటే వెక్టర్స్ పాఠ్యాంశానికి, సర్క్యులర్ మోషన్ పాఠ్యాంశంలోని అంశాలను కలుపుతూ ప్రశ్నించడం జరిగింది.
ఉదా: 2) A metalic rod of mass per unit length 0.5 kg/m is lying horizantally on a smooth inchioned plane which maken an angle of 30o with the horizantal the rod is not allowed to slide down by flowing a current through it when a magnetic field.
- of induction 0.25 T is acting on it in the vertical direction. The current flowing in the rod to keep is stationary is ->
- పై ప్రశ్నను గమనిస్తే ఎలక్ట్రోడైనమిక్స్ విభాగానికి, మెకానిక్స్ విభాగానికి అనుసంధానిస్తూ ప్రశ్నించడం జరిగింది. ఇందులో నాలుగు మౌలికమైన అంశాలపైన స్పష్టత

అవసరం.

1) ఎలక్ట్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్/ఫోర్స్
2) వెక్టార్స్ రిసొల్యూషన్
3) Inclined plane properties
4) బ్యాలెన్సింగ్ ఆఫ్ మెకానికల్ ఫోర్స్ టు ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఫోర్స్
- ఈ ఉదాహరణ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక విభాగాన్ని పూర్తిగా చదివి, మరొక విభాగాన్ని వదిలివేయడంవల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని చెప్పడం.

ఏది శ్రేయస్కరం?

1) అన్ని పాఠ్యాంశాలను సమతూకంతో చదివి ఎక్కువసార్లు ప్రాక్టీస్ పేపర్లను రాయడం
2) పైన పేర్కొన్న 6 అంశాలను వాటి వెయిటేజీ ప్రకారం ప్రాధాన్యతతో చదవడం
3) గణితపరమైన మౌలిక అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ చదవడం

చదవాల్సిన బుక్స్

HC Verna పార్ట్-1 అండ్ పార్ట్-2

వాస్తవాలు - అపోహలు

- ఫిజిక్స్‌ను వదిలి మిగతా సబ్జెక్టుల్లో 100 శాతం చదివితే నీట్‌లో మంచి ర్యాంక్ వస్తుంది.
- ఇది ఒక రకమైన అపోహ. దీనివల్ల ప్రయోజనం లేదు.
- సెకండియర్ ఫిజిక్స్‌ను పూర్తిగా చదివి ఫస్టియర్ ఫిజిక్స్‌ను పూర్తిగా వదిలివేయడం.
- ఇది కూడా అపోహనే, పైన పేర్కొన్న ఉదాహరణనే ఈ ప్రశ్న ఔచిత్యాన్ని చెబుతుంది.
- గణితపరమైన విషయాల వైపునకు వెళ్లకుండా పూర్తిగా థియరీ బేస్డ్ చాప్టర్స్ చదవడం.
- దీనివల్ల కూడా పూర్తి ప్రయోజనం కలగదు, ఈ రకమైన ప్రిపరేషన్‌తో మిగతా సబ్జెక్టులపైన పూర్తి భారంపడి టెన్షన్‌తో పరీక్షకు వెళ్లడం జరుగుతుంది.
gopi

611
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles