ఈఎస్‌ఐసీలో జూనియర్ ఇంజినీర్లు


Mon,November 19, 2018 12:43 AM

న్యూఢిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) సివిల్/ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ESIC
-పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్
-మొత్తం పోస్టులు: 79
-జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 52 ఖాళీలు (జనరల్-26, ఓబీసీ-15, ఎస్సీ-6, ఎస్టీ-5)
-జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 27 ఖాళీలు (జనరల్-13, ఓబీసీ-8, ఎస్సీ-4, ఎస్టీ-2)
-అర్హత: సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018 డిసెంబర్ 16 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ.35,400/- (7వ వేతన పే స్కేల్ అనుసరించి), డీఏ, హెచ్‌ఆర్‌ఏ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సులు అదనంగా ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ.500/- (ఎస్సీ/ఎస్టీలకు రూ.250/-)
-ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష ద్వారా
-రాతపరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-50, జనరల్ అవేర్‌నెస్-50, జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్)-100 మార్కులకు సబంధించిన ప్రశ్నలు ఇస్తారు. కాలవ్యవధి రెండు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 15
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: డిసెంబర్ 18
-వెబ్‌సైట్: www.esic.nic.in

537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles