స్టీల్ ప్లాంట్‌లో 156 ట్రెయినీలు


Sat,November 17, 2018 01:05 AM

బర్న్‌పూర్ (పశ్చిమ బెంగాల్)లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న ఐఐఎస్‌సీవో స్టీల్ ప్లాంట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

IISCO
-మొత్తం పోస్టులు: 156
-ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ-126 (జనరల్-64, ఓబీసీ-27, ఎస్సీ-28, ఎస్టీ-7)
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-36, మెటలర్జీ-35, ఎలక్ట్రికల్-25, ఇన్‌స్ట్రుమెంటేషన్-10, కెమికల్-5, సివిల్-10, సిరామిక్స్-5.
-అర్హత:పదోతరగతితోపాటు సంబంధిత బ్రాంచీలో కనీసం 50 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ-30 (జనరల్-17, ఓబీసీ-6, ఎస్సీ-6, ఎస్టీ-1)
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-10, ఎలక్ట్రీషియన్-10, టర్నర్-5, వెల్డర్-3, మెషినిస్ట్-2
-అర్హత: మెట్రిక్యులేషన్‌పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 డిసెంబర్ 14 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-ట్రెయినింగ్ : రెండేండ్లు. శిక్షణ సమయంలో ఆపరేటర్/అటెండెంట్ టెక్నీషియన్ పోస్టులకు మొదటి ఏడాదికి నెలకు రూ.10,700/8,600, రెండో ఏడాదికి నెలకు రూ. 12,200/10,000 కన్సాలిడేటెడ్ పే కింద చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/-
(అటెండెంట్ కమ్ టెక్నీషియన్‌కు రూ. 150/-)
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14
-వెబ్‌సైట్: www.sail.co.in

930
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles