గెయిల్‌లో 160 ఖాళీలు


Thu,November 15, 2018 12:56 AM

మహారత్న కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
gail
పోస్టులు-అర్హతలు:
-మొత్తం ఖాళీలు: 160.
-విభాగాల వారీగా: జూనియర్ ఇంజినీర్ (కెమికల్)-2, జూనియర్ ఇంజినీర్ (మెకానికల్)-1, ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్)-6, ఫోర్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-25, ఫోర్‌మ్యాన్ (మెకానికల్)-2, ఫోర్‌మ్యాన్ (సివిల్)-22, జూనియర్ కెమిస్ట్-10, జూనియర్ సూపరింటెండెంట్ (అఫిషియల్ లాంగ్వేజ్)-5, జూనియర్ సూపరింటెండెంట్ (హెచ్‌ఆర్)-2, టెక్నీషియన్ (మెకానికల్)-17, టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-14, టెక్నీషియన్ ఎలక్ట్రికల్-6, టెక్నీషియన్-టెలికం&టెలిమెట్రీ-14, అసిస్టెంట్ (స్టోర్స్&పర్చేస్)-1, అకౌంట్స్ అసిస్టెంట్-10, మార్కెటింగ్ అసిస్టెంట్-10, అసిస్టెంట్ (హెచ్‌ఆర్)-2.
-పేస్కేల్: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.16,300-38,500/
-ఫోర్‌మ్యాన్ పోస్టులకు-రూ.14,500-36,000/-
-టెక్నీషియన్, అసిస్టెంట్ పోస్టులకు-రూ.12,500-33,000/-
-అర్హతలు: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత విభాగం/బ్రాంచీలో కనీసం 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు అనుభవం ఉండాలి.
-ఫోర్‌మ్యాన్ పోస్టులకు-కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జూనియర్ కెమిస్ట్‌కు-ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. రెండేండ్ల అనుభవం.
-టెక్నీషియన్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-అసిస్టెంట్ పోస్టులకు మూడేండ్ల డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-మిగిలిన పోస్టుల అర్హతలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వయస్సు: కనిష్ఠ వయస్సు 18 ఏండ్లు, గరిష్ఠ వయోపరిమితి పోస్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
-ఎంపిక: జూనియర్ ఇంజినీర్, ఫోర్‌మ్యాన్, పోస్టులకు రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్ ద్వారా. జూనియర్ సూపరింటెండెంట్ పోస్టుకు రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ (కంప్యూటర్ ప్రొఫీషియన్సీ లేదా ట్రాన్స్‌లేషన్ టెస్ట్). టెక్నీషియన్ పోస్టులకు రాతపరీక్ష/ట్రేడ్‌టెస్ట్, అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, భోపాల్, ముంబై, కోల్‌కతా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30 (సాయంత్రం 6 గంటల వరకు)
-వెబ్‌సైట్: http://gailonline.com

689
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles