చదువు చెప్పి కొలువిస్తారు


Wed,November 14, 2018 03:20 AM

(ఆర్మీ బీఎస్సీ నర్సింగ్)
Army
ఇంటర్ పూర్తయ్యిందా..! చదువు చెప్పి కొలువు ఇచ్చే కోర్సు కోసం చూస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వ కొలువులో ప్రవేశించాలనే తపన.. దేశసేవ చేయాలన్న ఆశయం ఉన్నాయా? అయితే ఈ సమాచారం మీ కోసమే.. ఇంటర్ పూర్తయి నర్సింగ్‌లో చేరాలనుకునే అవివాహిత మహిళల కోసం మిలిటరీ నర్సింగ్ సర్వీస్ విడుదల చేసిన బీఎస్సీ నర్సింగ్ కోర్సు వివరాలు నిపుణ పాఠకుల కోసం అందిస్తున్నది

- ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ పరిధిలోని నర్సింగ్ కాలేజీల్లో 2019 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాలు.
- కోర్సు వివరాలు: మూడేండ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సు. ఈ కోర్సును మిలిటరీ పరిధిలోని ఆరు కాలేజీలు అందిస్తున్నాయి. మొత్తం 160 సీట్లు.

ఎవరు అర్హులు

- అవివాహిత మహిళ/విడాకులు, చట్టపరంగా వేరుపడ్డవారు అర్హులు.
- 1994, అక్టోబర్ 1 నుంచి 2002, సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
- కనీసం 50 శాతం మార్కులతో 10+2/ఇంటర్ ఉత్తీర్ణత. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బాటనీ & జువాలజీ), ఇంగ్లిష్ చదివి ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- కనీసం 148 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ, హిమాలయ ప్రాంతవాసులకు 5 సెం.మీ. సడలింపు ఉంటుంది.
Army2

ఎంపిక ఇలా!

- 2019 జనవరిలో నిర్వహించే రాతపరీక్ష ద్వారా. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో జనరల్ ఇంగ్లిష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ ఇంటెలిజెన్స్‌పై ప్రశ్నలు ఇస్తారు. కాలవ్యవధి 90 నిమిషాలు. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ అభ్యర్థులను 2019, ఏప్రిల్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.

- స్టయిఫండ్, సౌకర్యాలు: నర్సింగ్ కోర్సుకు ఎంపికైనవారికి నిబంధనల ప్రకారం ఉచిత రేషన్, వసతి, యూనిఫాం అలవెన్స్, ప్రతినెల స్టయిఫండ్ ఇస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఐదేండ్లు మిలిటరీ పర్మినెంట్/షార్ట్‌సర్వీస్ కమిషన్‌లో పనిచేయాలి. దీనికి సంబంధించి కోర్సు ప్రారంభంలో అగ్రిమెంట్ బాండ్ సమర్పించాలి. మిలిటరీ సర్వీస్‌లో ఆకర్షణీమైన జీతభత్యాలు, పదోన్నతులు ఉంటాయి.
Army1
- దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 30
- వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
- పూర్తి సమాచారం కోసం
Integrated Headquarters
of MoD (Army) AGs Branch Dte General of Medical Services (Army)-4B Room No 34,
L Block New Delhi - 01
Telephone No: 01123092294 (Telephonic enquiries will be attended from 1000h to 1700h only)

కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1307
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles