పక్కా వ్యూహంతో పట్టొచ్చు కొలువు


Wed,November 14, 2018 03:13 AM

Jobs
ఐబీపీఎస్, స్పెషలిస్ట్ ఆఫీసర్లతో పాటు, కెనరాబ్యాంక్ పీవో పోస్టులకు ప్రకటనలు వెలువడ్డాయి. రెండింటికీ దాదాపుగా ఒకే తరహా సిలబస్ ఉంటుంది కాబట్టి ఉమ్మడిగా సిద్ధమయ్యే వారికి ఇదొక సువర్ణావకాశం. రెండు పరీక్షలు డిసెంబర్ నెలలోనే నిర్వహించనున్నారు. దీంతో అభ్యర్థులు ఉమ్మడిగా ప్రిపేరయితే ఎక్కువగా లబ్ది పొందవచ్చు.

Jobs1
- కెనరాబ్యాంక్ పరీక్షకు మొత్తం కేటాయించిన సమయం రెండు గంటలు. సెక్షనల్ కటాఫ్ లేదు
- మొత్తంగా పరిశీలిస్తే అన్ని పరీక్షల్లోనూ ఉన్న అంశాలు రీజనింగ్, ఇంగ్లిష్. వీటికి అదనంగా జనరల్ అవేర్‌నెస్ (లా ఆఫీసర్, కెనరాబ్యాంక్ పీవో), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (స్పెషలిస్ట్ అధికారుల పరీక్షకు ఉంటుంది)

ప్రిపరేషన్ విధానం రీజనింగ్

- ఇందులో ఆల్ఫాబెట్ బెస్డ్ పరీక్షలు, ర్యాంకింగ్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాజిసం తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇది కామన్‌టెస్ట్‌కు సంబంధించిన పరీక్ష. ఇప్పటికే ఈ అంశాలపై అవగాహన ఉన్నవాళ్లు సాధ్యమైనన్ని మాక్ పరీక్షలు రాయాలి. కొత్తగా ప్రిపేరయ్యే వాళ్లు ప్రశ్నల తీరును ఒక్కసారి పరిశీలించాలి. ఆ తర్వాత ప్రతి అధ్యాయానికి సంబంధించి కనీసంగా 100 ప్రశ్నలకు జవాబులను కనుగొనాలి. దీన్ని అధ్యాయాలవారి ప్రాక్టీస్‌గా చెప్పొచ్చు. ఆ తర్వాత మాక్ పరీక్షలు పూర్తిగా రాయాలి. ఈ పరీక్షలను రాసేటప్పుడు ఐబీపీఎస్ పీవో అభ్యర్థులు 40 నిమిషాల వ్యవధిలో సాధ్యమైనన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనేలా చూడాలి. కెనరాబ్యాంక్ పీవో పరీక్షకు హాజరయ్యే వాళ్లు వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం గుర్తించేలా సిద్ధంకావాలి. ఈ సబ్జెక్ట్‌లో ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్‌కు దాదాపుగా ఒకే తరహా లాజిక్ అవసరం. సిట్టింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్‌కు ఒకే తరహా లాజిక్ అవసరం. ఇలా ఉమ్మడి అంశాలను పరిశీలించి వాటికి అవసరమైన లాజిక్‌లను కనుక్కోవాలి. తర్వాత వాటిని ఉమ్మడిగా ప్రాక్టీస్ చేస్తూ వెళితే ఈ విభాగంలో మంచిస్కోర్ సాధించవచ్చు. ముఖ్యంగా రీజనింగ్‌కు బేసిక్స్ అంటూ ఉండవు. నేరుగా ప్రశ్నల ధోరణిని పరిశీలించి వాటిని ప్రాక్టీస్ చేయాలి. అయితే సిలాజిసంలో మాత్రం కొంత సమాచారాన్ని సేకరించాలి. వివిధ స్టేట్‌మెంట్లు, వాటి నుంచి ఎలా అసంప్షన్స్‌ను రాబట్టాలో తెలుసుకోవాలి. స్టేట్‌మెంట్-ఆర్గ్యుమెంట్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ తదితర అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. వీటిని కూడా గత ప్రశ్నల సరళిని పరిశీలించి సమాధానం కనుక్కోవాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

- ఇందులో నంబర్ సిస్టమ్, అర్థమెటిక్, గ్రాఫ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ముందుగా బేసిక్స్‌పై పట్టుసాధించాలి. అభ్యర్థులు సూత్రాలపై ఆధారపడకుండా, తార్కికంగా ఆలోచించే సామర్థ్ధ్యాన్ని పెంచుకోవాలి. ఉదాహరణకు లాభనష్టాలు (ప్రాఫిట్ అండ్ లాస్) అధ్యాయం నేర్చుకునేటప్పుడు సాధారణంగా ఆలోచించాల్సిన తీరు- ఒక వ్యక్తి కొన్న ధరకంటే వస్తువును తక్కువకు అమ్మితే నష్టం వస్తుంది. కొన్నధర కంటే ఎక్కువ ధరకు అమ్మితే లాభం వస్తుంది. ఆ నష్టాన్ని లేదా లాభాన్ని శాతాల్లో ఎలా చెప్పాలో తార్కికంగా ఆలోచించాలి. అంతేకాని సూత్రాలను బట్టీపట్టకూడదు. ప్రతి అభ్యర్థి తనదైన సొంత తార్కిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని అధ్యాయాల వారిగా సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలి. ఆ తర్వాత పూర్తిస్థాయి మాక్ టెస్టులు రాయాలి. అలాగే అభ్యర్థులు షార్ట్‌కట్స్ నేర్చుకోడానికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. ప్రాక్టీస్ ద్వారా వేగం పెరుగుతుంది, సమయం ఆదా అవుతుంది. కాన్సెప్ట్‌ను నేర్చుకుంటే షార్ట్‌కట్స్ వాటంతట అవే వస్తాయి. దానికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రాఫ్‌ను ఆధారంగా చేసుకుని అడిగే ప్రశ్నలకు శాతాలు, నిష్పత్తులు, సరాసరిలు ప్రాథమిక అంశాలుగా ఉపయోగపడుతాయి.

- కేవలం ప్రిపరేషన్‌తో సరిపెట్టకుండా సాధ్యమైనన్ని మాక్‌పరీక్షలు రాయాలి. పూర్తిస్థాయి టెస్టులు ఎన్ని రాస్తే అంత మంచిది.
- కెనరాబ్యాంక్ పీవో పరీక్ష ఎంపికలో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జనరల్ అవేర్‌నెస్ చదివేటప్పుడు దానికి సంబంధించి విశ్లేషణాత్మక అంశాలను కూడా అధ్యయనం చేయాలి. దీనికి న్యూస్‌పేపర్లలో వచ్చే సంపాదకీయాలు ఉపయోగపడుతాయి.
- ఐబీపీఎస్ మెయిన్స్‌లో కేవలం ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పైనే ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ఉండవు కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్‌కి ప్రిపేరయ్యేటప్పుడు ప్రొఫెషనల్ నాలెడ్జ్ పుస్తకాలను చదవాల్సిన అవసరం లేదు. ముందుగా ప్రిలిమ్స్‌పై దృష్టిసారించాలి.
- ఇంగ్లిష్‌లో ప్యారాజంబుల్స్ నుంచి కూడా ప్రశ్నలు ఇస్తున్నారు. ఒకాబులరీ పెరిగితే వీటిపై పట్టు సాధించొచ్చు

వివిధ తేదీలు

- ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష తేదీలు ప్రిలిమినరీ- డిసెంబర్ 29, 30, మెయిన్స్ జనవరి 27
- కెనరాబ్యాంక్ పీవో పరీక్ష- డిసెంబర్ 23

ఇంగ్లిష్


wordcloud
- రెండు పరీక్షల్లోనూ ఈ విభాగం ఉంటుంది. గ్రామర్‌తోపాటు కాంప్రహెన్షన్ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఇటీవలికాలంలో అభ్యర్థులు సందర్భోచితంగా పదాలను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడనే కోణంలో ప్రశ్నలు ఇస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్ న్యూస్ పేపర్లలో వచ్చే కొత్త పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అలాగే తరచూ వాడే పదాల సమాన, వ్యతిరేక అర్థాలను తెలుసుకోవడంతో పాటు ఆయా పదాలకు సంబంధించి ఏవైనా పదబంధాలు (ఫ్రేజల్ వెర్బ్స్), ప్రొవెర్బ్స్ (సామెతలు) ఉన్నాయో లేదో కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ఆ పదం కిందే స్పష్టంగా ఉంటాయి. రోజూ కనీసం కొత్తగా 50 పదాలను తెలుసుకునేలా సమయాన్ని కేటాయించాలి.
- గ్రామర్ విషయానికి వస్తే.. భాషాభాగాలు, వాటిని ఉపయోగించే విధానం కీలకం. సబ్జెక్ట్ + వర్బ్ అగ్రిమెంట్, టెన్సెస్‌ల నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వాటిపై దృష్టికేంద్రీకరించాలి. రెండో దశలో సాధ్యమైనన్ని ఎక్కువ మాక్ పరీక్షలను రాయాలి. ఇంగ్లిష్‌కు సంబంధించి గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.
canarabank

జనరల్ అవేర్‌నెస్

- ఐబీపీఎస్ సెక్షన్ ఆఫీసర్‌లో ఉండే అంశాలు.... (లా ఆఫీసర్, రాజభాష అధికారి), కెనరాబ్యాంక్ పీవో పరీక్షలో జనరల్ అవేర్‌నెస్ ఉంది. ముఖ్యంగా గడిచిన ఎనిమిది నెలల నుంచి సంవత్సరం వరకు ఆర్థిక, బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పులను నిశితంగా పరిశీలించాలి. ఇటీవల విశ్లేషణాత్మక ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ఉదాహరణకు.. రెపోరేట్ పెంచితే, మార్కెట్‌లో ద్రవ్యత్వం ప్రభావం లేదా తగ్గిస్తే ప్రభావం.. ఇలా భిన్న కోణాల్లో ప్రశ్నలను రూపొందిస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా ఇలాగే అధ్యయనం చేయాలి. అలాగే ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ అంశాలను చదవాలి. వాటి పూర్వాపరాలను తెలుసుకోవాలి. గతంలో ప్రశ్నలు నేరుగా వచ్చేవి. ప్రస్తుతం పూర్వాపరాలను అడుగుతున్నారు. ఉదాహరణకు ఇటీవలే తమిళనాడు అత్యున్నత న్యాయస్థానం 18 మంది శాసనసభ్యులపై వేసిన అనర్హత వేటును సమర్థించింది. దీంతో ఫిరాయింపు నిరోధక చట్టం అంటే ఏమిటీ, దానికి సంబంధించిన రాజ్యాంగపు అంశాలను చదవాలి.
Rajendra

591
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles