సోషల్ సైన్సెస్‌లో రారాజు టిస్ టిస్-2019 ప్రవేశాలు


Wed,November 14, 2018 03:12 AM

TISS
భారతదేశం అంటేనే గ్రామీణం. గ్రామాలు స్వయం సంవృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతిపథాన పయనిస్తుందని మహాత్ముడు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా జరగాల్సినంత అభివృద్ధి జరుగలేదు. దీనికి ప్రధానకారణాల్లో ఒకటి ప్రొఫెషనల్స్ కొరత. ఎక్కడ ఏం అవసరం. ఏం చేస్తే ఆయా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. పక్కా మైక్రోప్లాన్ తయారుచేసి అమలుచేసే వ్యవస్థ లేకపోవడం. సరిగ్గా ఇటువంటి నిపుణులను తయారుచేయడానికే ఏర్పాటైన సంస్థ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్). దీనిలో సీటు దొరికిందంటే చాలు.. ఉద్యోగానికి భరోసా. అంతేకాకుండా ప్రతి కోర్సు ప్రత్యేకత కలగి ఉండటమే కాకుండా చాలెంజింగ్‌గా.. నిత్యనూతనంగా ఉంటాయి. అంతర్జాతీయస్థాయి కరికులం, ఫీల్డ్‌వర్క్‌లతో నిజమైన ప్రొఫెషనల్స్‌ను తయారుచేస్తున్న సంస్థ టిస్. 2019కి సంబంధించి పలు కోర్సుల్లో ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా...

- టిస్... దేశంలో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటి. సోషల్ సైన్సెస్‌లో అత్యంత పేరుగాంచిన సంస్థ. 100 శాతం ప్లేస్‌మెంట్స్‌తో విద్యార్థులకు భరోసానిస్తున్న సంస్థ. సోషల్‌వర్క్, డిజాస్టర్‌మేనేజ్‌మెంట్, హెల్త్, రూరల్ డెవలప్‌మెంట్ ఇలా పలు ప్రత్యేక కోర్సులను రూపొందిస్తూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందిస్తున్న సంస్థ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్). పరిశోధనలతో సమాజానికి ఉపయోగపడే పలు ప్రత్యేకకోర్సులను అందిస్తుంది.

- ప్లేస్‌మెంట్స్: సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 100 శాతం ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. ఏ ప్రోగ్రామ్స్‌లో చదివినవారికైనా మంచి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి.

- టిస్: దేశంలో సోషల్ వర్క్ ఎడ్యుకేషన్ కోసం సర్ దోరబ్జీ టాటా ట్రస్ట్ 1936లో టాటా గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్‌ను ప్రారంభించింది. 20 మంది విద్యార్థులతో ఈ సంస్థ ప్రారంభమైంది. 1944లో దీన్ని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)గా పేరుమార్చారు. 1964లో డీమ్డ్ యూనివర్సిటీగా యూజీసీ గుర్తించింది. ప్రస్తుతం 38 పీజీ ప్రోగ్రామ్స్, ఎంఫిల్, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంది.

టిస్ క్యాంపస్‌లు

- ముంబై, తుల్జాపూర్, హైదరాబాద్, గువాహటితోపాటు బీఏఎల్‌ఎం, చెన్నై.

- ఎంపిక: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఆయా కోర్సులకు వేర్వేరుగా ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- వెబ్‌సైట్: http://www.tiss.edu

కోర్సులు

యూజీ ప్రోగ్రామ్స్

- బీఏ సోషల్ సైన్సెస్, బీఏ (ఆనర్స్) ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్.

పీజీ ప్రోగ్రామ్స్

- మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (సోషల్ ఎపిడిమియోలిజీ), ఎంఏ సోషల్‌వర్క్ (లైవ్‌లీహుడ్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్), ఎంఏ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్), ఎంఏ (క్రిమినాలజీ&జస్టిస్), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెల్త్ అడ్మినిస్ట్రేషన్), ఎంఏ (పబ్లిక్‌హెల్త్, దళిత్&ట్రైబల్ స్టడీస్ అండ్ యాక్షన్, డిజేబిలిటీ స్టడీస్ అండ్ యాక్షన్, ఉమెన్ సెంట ర్డ్ ప్రాక్టీస్, చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ, గ్లోబలైజేషన్ అండ్ లేబర్, ఎలిమెంటరీ, ైక్లెమెట్ చేంజ్ అండ్ సస్టయినబిలిటీ స్టడీస్, మెంటల్ హెల్త్, అర్బన్ పాలసీ&గవర్నెన్స్, మీడియా&కల్చరల్ స్టడీస్, సోషల్ ఇన్నోవేషన్&ఎంట్రప్రె న్యూర్‌షిప్), మాస్టర్ ఆఫ్ లా (ఎల్‌ఎల్‌ఎం), మాస్టర్ ఆఫ్ లైబ్రేరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంఏ (క్లినికల్ సైకాలజీ, ఎడ్యుకేషన్, మెంటల్ హెల్త్, పబ్లిక్ హెల్త్) తదితర 55 రకాల పీజీ కోర్సులు ఉన్నాయి.
- షార్ట్‌టర్మ్ ప్రోగ్రామ్స్: సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, కెరీర్ కౌన్సెలింగ్, స్కూల్ కౌన్సెలింగ్, కపుల్ అండ్ ఫ్యామిలీ థెరపి, జరంటాలజీ, యూత్‌లీడర్‌షిప్&సోషల్ ఛేంజ్ తదితర 25 రకాల కోర్సులు ఉన్నాయి.
- ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్: డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సైకోసోషల్ వర్క్ విత్ అడల్సెన్స్&యంగ్ పీపుల్.
- ఓపెన్&డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్: ఎంఏ (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), పీజీ డిప్లొమా ఇన్ డిజిటల్ లైబ్రేరీ&ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్.

587
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles