కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు


Sat,November 10, 2018 12:51 AM

Indian-Coast
-పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్
బ్రాంచీల వారీగా అర్హతలు:
-జనరల్ డ్యూటీ/జనరల్ డ్యూటీ (ఎస్‌ఎస్‌ఏ): బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో లేదా 10+2+3 స్కీంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులో తప్పనిసరిగా చదివి ఉండాలి.
-కమర్షియల్ పైలట్ ఎంట్రీ (ఎస్‌ఎస్‌ఏ): ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగి ఉండాలి.
-లా: మూడేండ్ల/ఐదేండ్ల బ్యాచిలర్ ఆఫ్ లాలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 10+2 విధానంలోనే డిగ్రీని పూర్తిచేయాలి.
-వయస్సు: జనరల్ డ్యూటీ అభ్యర్థులు - 1994, జూలై 1 నుంచి 1998, జూన్ 30 మధ్య
-కమర్షియల్ ఫైలట్ ఎంట్రీ (సీపీఎల్) అభ్యర్థులు - 1994, జూలై 1 - 2000, జూన్ 30 మధ్య
-లా విభాగానికి 1989 జూలై 1 నుంచి 1998 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-గమనిక: జనరల్ డ్యూటీ విభాగానికి పురుషులు, జనరల్ డ్యూటీ (ఎస్‌ఎస్‌ఏ) విభాగానికి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మిగతా విభాగాలకు పురుష/మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా రెండు దశల్లో (స్టేజ్ 1, స్టేజ్ 2) ఎంపిక ఉంటుంది.
-స్టేజ్-1: ప్రిలిమినరీ సెలక్షన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)- మెంటల్ ఎబిలిటీ టెస్ట్/ కాంగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ ప్రిస్క్రిప్షన్, డిస్కషన్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-స్టేజ్-2:ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారిని స్టేజ్-2 (ఫైనల్ సెలక్షన్)కు ఎంపికచేస్తారు. దీనిలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలు ఉంటాయి.
-శారీరక ప్రమాణాలు: జనరల్ డ్యూటీ/లా: పురుషులు-157 సెం.మీ., మహిళలు-152 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-పే స్కేల్: ట్రెయినింగ్‌లో నెలకు రూ. 56, 100/-
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ-ఎజిమల (కేరళ)లో జూన్ 2019 నుంచి ట్రెయినింగ్ ప్రారంభమవుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబర్ 18
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

1501
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles