సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్


Wed,November 7, 2018 01:15 AM

Logistics
కాలం మారుతుంది. కాలంతో పాటు చదువులు మారుతున్నాయి. దానికనుగుణంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌నే వినియోగిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ముఖ్యంగా సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అనేది కీలకం. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

- వస్తువులు, సేవల ప్రవాహాల నిర్వహణను సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ (సరఫరా గొలుసు నిర్వహణ) అంటారు. వస్తువులు, సేవల ఉత్పత్తి క్రమంలో వివిధ విభాగాల మధ్య వస్తువులు, సేవల రాకపోకలు జరుగుతుంటాయి. ఉత్పత్తుల ప్రవాహాన్ని ఎలా నియంత్రించాలి, ఎలా అమలు చేయాలో ఒక ప్లాన్ వేసుకోవాలి. ముడిపదార్థాలు, ఉత్పాదనను తుది వినియోగదారుడికి పంపిణీ అయ్యేలా చూసుకోవాలి. సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అనేది వస్తువులు, సేవల ప్రవాహ నిర్వహణతోపాటు ముడి పదార్థాలను తుది ఉత్పత్తుల్లోకి మార్చే అన్ని ప్రక్రియలను కలిగి ఉంటుంది. ఇది కస్టమర్ విలువను పెంచడానికి, మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలబడేందుకు చురుగ్గా సాగే వ్యవహారం.
- సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ సాధారణంగా ఒక ఉత్పత్తి రవాణా, పంపిణీని కేంద్రీయంగా నియంత్రించడానికి లేదా లింక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌వల్ల కంపెనీలు అధిక వ్యయాన్ని తగ్గించగలవు. వినియోగదారులకు వేగంగా ఉత్పత్తులను సరఫరా చేయగలవు. అంతర్గత ఉత్పత్తి, పంపిణీ, విక్రయాలు, కంపెనీ విక్రయదారుల జాబితాల నియంత్రణను సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ చేపడుతుంది. ఈ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అనేది యుగాల నుంచి ఉంది. కానీ చాలా కంపెనీలు ఇటీవలే వాటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
- సరఫరా గొలుసు అనేది వ్యక్తులు, సంస్థలు, వనరులు, కార్యకలాపాలు, ఉత్పత్తి లేదా సేవల తయారీ విక్రయాల్లో టెక్నికల్‌గా పాల్గొనడం. సరఫరాదారుడి నుంచి ముడి పదార్థాల పంపిణీతో సరఫరా గొలుసు మొదలవుతుంది. అంతిమంగా వినియోగదారునికి తుది ఉత్పత్తి లేదా సేవ పంపిణీతో ఇది ముగుస్తుంది. ఉత్పత్తి లేదా సేవ ప్రతి టచ్ పాయింట్‌ను, ప్రారంభ అమ్మకం నుంచి చివరి విక్రయం వరకు పర్యవేక్షిస్తుంది. సరఫరా గొలుసును సరైన విధంగా నిర్వహించకుంటే అనేక ప్రదేశాల్లో విలువను జోడించడం లేదా పెరిగిన ఖర్చుల ద్వారా విలువను కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల కంపెనీ లక్ష్యం, ఆదాయ, వ్యయాలపై ప్రభావం పడుతుంది.
- సప్లయ్ మేనేజ్‌మెంట్ నిర్వహణ అనేది సంస్థ సరఫరాదారులు, తయారీదారు, పంపిణీదారులు, వినియోగదారులపై ఆధారపడుతుంది.

ఉపయోగాలు

- సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ సంస్థ సామర్థ్యాన్ని, లాభాలను పెంచుతుంది. ఖర్చులను తగ్గిస్తుంది. సహకారాన్ని పెంపొందించడం వంటి అనేక కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
- సంస్థ పేరును, సామర్థ్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది. కస్టమర్ డిమాండ్‌కు అనుగుణంగా ఖరీదును నిర్ణయిస్తుంది.

సాఫ్ట్‌వేర్ పాత్ర

- ప్రస్తుతం ఇ-కామర్స్ దినదినాభివృద్ధి చెందుతుంది. వినియోగదారులకు నేరుగా చిన్న చిన్న పంపిణీలపై దృష్టిసారించడంతో సరఫరా గొలుసు నిర్వహణలో సాఫ్ట్‌వేర్ పాత్ర చాలా కీలకం.
- కాబట్టి సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు సాఫ్టవేర్ చాలా దోహదం చేస్తుంది. దీని ద్వారా సరఫరా గొలుసు నిర్వహణ సంక్లిష్టతను నిర్వహించడానికి, సరైన వ్యూహాలను అమలు చేయవచ్చు.

కోర్సులు - సంస్థలు

- ఈ కోర్సును చేయడానికి సంభావ్యత, గణాంకాలు, విశ్లేషణలు, సంక్లిష్ట నమూనాల్లో అధునాతన నైపుణ్యాలు అవసరం.

ఐటీఎం బిజినెస్ స్కూల్, నవీ ముంబై

- ఈ కాలేజీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా మేనేజ్‌మెంట్ ఇన్ సప్లయ్ చైన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తుంది.
- ఇది రెండేండ్ల ఫుల్‌టైమ్ కోర్సు.
- ఈ కోర్సు చేయడానికి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
- ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్, క్యాట్, గ్జాట్, మ్యాట్, సీమ్యాట్, జీమ్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
- కోర్సు ఫీజు రూ. 9 లక్షల వరకు ఉంటుంది.
- వెబ్‌సైట్: www.itm.edu

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోల్‌కతా

- ఈ కాలేజీ అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్ ఇన్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తుంది.
- ఇది ఏడాది వ్యవధిగల పార్ట్‌టైమ్ కోర్సు.
- మూడేండ్ల డిగ్రీ చదివిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ అర్హులు. తమ కెరీర్‌ను కొనసాగించాలనుకునే కంపెనీ మేనేజర్లకు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు.
- 2019, ఫిబ్రవరిలో ఈ కోర్సు ప్రారంభం కానున్నది.
- కోర్సు ఫీజు సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుంది.
- ఇతర వివరాలకు
www.niitmperia.com/prgramma-in-supply-chain-management వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇండోర్

- ఇది నాలుగు రోజుల ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.
- కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేసేవారి కోసం ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు.
- ఇది డిసెంబర్ 18 నుంచి 21 వరకు జరిగే ప్రోగ్రామ్.
- ఫీజు రూ. 54,000.
- ఇతర వివరాలకు వెబ్‌సైట్ www.iimidr.ac.inలో సంప్రదించవచ్చు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ & ఏవియేషన్ మేనేజ్‌మెంట్ బెంగళూరు

- జైపూర్, అహ్మదాబాద్, డెహ్రాడూన్, ముంబై, పుణెలలో దీని క్యాంపస్‌లు ఉన్నాయి.
- ఈ కాలేజీ బీబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ ఫుల్‌టైమ్ కోర్సులను అందిస్తుంది.
- బీబీఏకు రూ. 3.45 లక్షలు, ఎంబీఏకు రూ. 5 లక్షల వరకు ఫీజు ఉంటుంది.
- ఇతర వివరాలకు వెబ్‌సైట్ www.ilamindia.inలో సంప్రదించవచ్చు.

కింగ్‌స్టర్ ఎడ్యుకేషన్

- ఇది సర్టిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్. తిరువనంతపురం (కేరళ), తిరువాన్మియూర్ (చెన్నై)లలో దీని సంస్థలున్నాయి.
- డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ మేనేజ్‌మెంట్. దీనికి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు.
- ఆరు నెలల కోర్సు అయిన దీని ఫీజు రూ. 7500.
- అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్. దీనికి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు.
- పది నెలల కోర్సు అయిన దీని ఫీజు రూ. 14,700.
- పోస్ట్ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్. దీనికి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసి ఉండాలి.
- ఏడాది కోర్సు అయిన దీని ఫీజు రూ. 16,700.
- ఇతర వివరాలకు www.kingster.edu.in
- హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ కోర్సు లో ట్రెయినింగ్ ఇస్తున్నాయి.
- ఇంకా ఇవేకాకుండా హైదరాబాద్, బెంగళూరుల్లోని ఐఐఎం సంస్థల్లో, శైలేష్ జే మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ముంబై, నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ముంబై, సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్-పుణె, అమైటీ యూనివర్సిటీ, ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రిసర్చ్-ముంబై, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్-డెహ్రాడూన్, ఐటీఎం యూనివర్సిటీ లేదా నార్త్ క్యాప్ యూనివర్సిటీ-గ్వాలియర్, చిట్‌కారా యూనివర్సిటీ-చండీగఢ్, వేల్స్ యూనివర్సిటీ-చెన్నై, లండన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్-ఎర్నాకుళం, ఎస్‌సీఎం హబ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్-కొచ్చి వంటి పముఖ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
Logistics1

ఉద్యోగావకాశాలు

- ప్రపంచవ్యాప్తంగా కంపెనీలకు సంబంధించి తయారీ, సరఫరాకు సంబంధించి సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కోర్సు చేసినవారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి.
- ఈ రంగంలో లక్షల ఉద్యోగులు అవసరమవుతారని ఫార్చ్యూన్ అండ్ మెటీరియల్స్ హ్యాండ్లింగ్ ఇన్‌స్టిట్యూట్ అంచనావేసింది.
- టెస్లా, అమెజాన్, డెలాయిట్, లాక్‌హీడ్ మార్టిన్, డీహెచ్‌ఎల్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఎన్నో కంపెనీలు వీరిని రిక్రూట్ చేసుకుంటున్నాయి.
- వేతనం కూడా బాగా ఉంటుంది. ప్రారంభంలోనే ఏడాదికి రూ. 2 లక్షలకుపైగా వేతనం లభిస్తుంది.
Logistics2

ఆన్‌లైన్ కోర్సులు

- ముంబైలోని సింబయాసిస్ ఏడాదిన్నర ఆన్‌లైన్ కోర్సును అందిస్తుంది.
- జైపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ షిప్పింగ్ నాలుగు వారాల ఆన్‌లైన్ కోర్సును అందిస్తుంది.
- మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ మాస్టర్ సర్టికెట్ ఆన్‌లైన్ కోర్సులను అందిస్తుంది.
- ఇంకా యూనివర్సిడాడ్ టెక్‌మిలీనియో (మెక్సికో), యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా యూఎస్‌ఏ, ఇ-లెర్నింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ (ఏథెన్స్), ఈబీఎస్‌ఐ ఎక్స్‌పోర్ట్ అకాడమీ (ఐర్లాండ్), మోర్గాన్ ఇంటర్నేషనల్ (జోర్డాన్) వంటి విదేశీ సంస్థలు కూడా ఈ ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి.
నోట్: చాలావరకు ఇన్‌స్టిట్యూట్లు ఎంబీఏ చదివి కంపెనీల్లో పనిచేసే వర్క్ ప్రొఫెషనల్స్‌కే ఈ కోర్సును అందిస్తున్నాయి.

- చాపల సత్యం

841
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles