జీఎస్-2019 గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్స్


Wed,October 17, 2018 01:47 AM

GS2019
దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ.. పరిశోధనలకు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సంస్థ.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్). మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్స్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో కోర్సులు, అర్హతలు, ప్రవేశాలు కల్పించే విధానం, క్యాంపస్‌ల వివరాలు నిపుణ పాఠకుల కోసం...

- టీఐఎఫ్‌ఆర్: ఈ సంస్థను ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.హోమి బాబా 1945, జూన్‌లో ప్రారంభించారు. టాటా ట్రస్ట్ సహకారంతో దీన్ని ఏర్పాటుచేశారు. ఫండమెంటల్ సైన్సెస్, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ ఎడ్యుకేషన్‌లలో పరిశోధనల కోసం ప్రారంభించి కాలక్రమేణా పలు ఇతర ప్రోగ్రామ్స్, క్యాంపస్‌లను ఏర్పాటుచేశారు.
- జీఎస్-2019: ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టెస్టే గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్స్ (జీఎస్-2019).

సబ్జెక్టులు:

- మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ & సిస్టమ్స్ సైన్సెస్ (కమ్యూనికేషన్స్ అండ్ అప్లయిడ్ ప్రొబబులిటి), సైన్స్ ఎడ్యుకేషన్

ప్రోగ్రామ్స్:

- పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
- అర్హతలు: పీహెచ్‌డీ కోర్సుకు - ఎంఏ/ఎమ్మెస్సీ/ఎంటెక్
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ : బీఏ/బీఎస్సీ లేదా బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ/బీఫార్మా లేదా బీఎస్ లేదా తత్సమాన కోర్సు. బీఈ / బీటెక్ డిగ్రీ ఉన్నవారిని అప్షనల్స్‌ను బట్టి ఎమ్మెస్సీ డిగ్రీకి ఎంపికచేస్తారు.
నోట్: ఫిజిక్స్‌కు దరఖాస్తు చేసుకునేవారు ఇండియన్ బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ (ఐఎన్‌వో)లో గ్రాడ్యుయేట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ (జీటీపీ)లో కూడా ప్రవేశాలు తీసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఈ విషయాన్ని పేర్కొనాలి.

కోర్సులు - కాల వ్యవధి
పీహెచ్‌డీ ఐదేండ్లు
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ ఆరేండ్లు
ఎమ్మెస్సీ ప్రోగ్రామ్ - వేర్వేరుగా ఉన్నాయి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ప్రవేశాలు ఇలా..

- సైన్స్ ఎడ్యుకేషన్ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
గమనిక: జీఎస్-2019 ద్వారానే కాకుండా గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా ఫిజిక్స్/కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు గేట్/జెస్ట్, నెట్ ద్వారా కూడా ప్రవేశాలు కల్పిస్తారు.

ఫెలోషిప్స్:

- పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి, ఎమ్మెస్సీ చదివేవారికి జూలై 1 నుంచి ఫెలోషిప్స్ ఇస్తారు.
- పీహెచ్‌డీ- ప్రారంభంలో నెలకు రూ.25వేలు (రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత నెలకు రూ.28 వేలు) ఇస్తారు.
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ- మొదటి ఏడాది నెలకు రూ.16వేలు ఇస్తారు. అనంతరం అభ్యర్థి చదువులో చూపించిన ప్రతిభ నుబట్టి నెలకు రూ. 25 వేల వరకు ఇస్తారు. పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నెలకు రూ. 28 వేలు ఇస్తారు.
- ఎమ్మెస్సీ బయాలజీ విద్యార్థులకు నెలకు రూ. 16 వేలు. ఎమ్మెస్సీ (వైల్డ్‌లైఫ్ అండ్ కన్జర్వేషన్) అభ్యర్థులకు నెలకు రూ. 12 వేలు ఇస్తారు.
నోట్: పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ అభ్యర్థులకు నామమాత్రపు ఫీజుతో వసతి సౌకర్యం కల్పిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: నవంబర్ 9
- పరీక్ష కేంద్రం: రాష్ట్రంలో హైదరాబాద్
- ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: 2018, డిసెంబర్ 9
- వెబ్‌సైట్: http://univ.tifr.res.in

బయాలజీ @ జేజీఈఈబీఐఎల్‌ఎస్

- టీఐఎఫ్‌ఆర్ నిర్వహించే జాతీయస్థాయి జీఎస్-2019 బయాలజీ పరీక్షను జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయాలజీ అండ్ ఇంటర్‌డిసిప్లినరీ లైఫ్ సైన్సెస్ (జేజీఈఈబీఐఎల్‌ఎస్)గా పిలుస్తారు.

ప్రవేశాలు కల్పించే సంస్థలు:

- Tata Institute of Fundamental Research
- NCBS Bangalore (https://ncbs.res.in)
- DBS Mumbai (www.tifr.res.in/~dbs)
- TCIS Hyd (https://www.tifrh.res.in)
- Indian Institute of Science Education and Research (IISER): Kolkata (http://www.iiserkol.ac.in); Pune (http://www.iiserpune.ac.in) and Thiruvananthapuram (http://www.iisertvm.ac.in)
- Tirupati (http://www.iisertirupati.ac.in)
- Advanced Centre for Treatment, Research and Education in Cancer (ACTREC), Mumbai (http://www.actrec.gov.in)

- Centre for Cellular and Molecular Biology, Hyd (http://www.ccmb.res.in)
- Centre for DNA Fingerprinting and Diagnostics, Hyd (www.cdfd.org.in)
- National Brain Research Centre, Manesar(http://www.nbrc.ac.in)
- National Institute of Immunology, New Delhi (http://www1.nii.res.in/)
- NISEResearch, Bhubaneshwar (http://www.niser.ac.in)
- Institute for Stem Cell Biology and Regenerative Medicine, Bangalore (http://instem.res.in/)
- National Centre for Cell Science, Pune (http://www.nccs.res.in)
- Regional Centre for Biotechnology, Faridabad (http://www.rcb.res.in)
- Saha Institute of Nuclear Physics, Kolkata (http://www.saha.ac.in)
- Institute of Mathematical Sciences, Chennai (http://www.imsc.res.in)
- MAHE: Manipal (Life Sciences) (http://www.manipal.edu/mu.html)
- Bose Institute, Kolkata (www.jcbose.ac.in)

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

610
Tags

More News

VIRAL NEWS

Featured Articles