ఈఎస్‌ఐసీలో 771 ఖాళీలు


Tue,October 16, 2018 01:12 AM

న్యూఢిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) వివిధ ఈఎస్‌ఐ హస్పిటల్స్/డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ (అల్లోపతిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
esi-doctors
-పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్ (అల్లోపతిక్)
-మొత్తం పోస్టులు: 771 (జనరల్-338, ఓబీసీ-252, ఎస్సీ-122, ఎస్టీ-59)
-ప్రాంతాలవారీగా ఖాళీలు: అసోం-30, బీహార్-60, ఛత్తీస్‌గఢ్-17, ఢిల్లీ-152, గుజరాత్-27, హర్యానా-45, హిమాచల్ ప్రదేశ్-21, జమ్మూ అండ్ కశ్మీర్-10, జార్ఖండ్-22, మధ్యప్రదేశ్-44, మహారాష్ట్ర-101, ఒడిషా-12, పంజాబ్-34, రాజస్థాన్-30, తమిళనాడు-11, ఉత్తరప్రదేశ్-128, వెస్ట్ బెంగాల్-27
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్-1956 ప్రకారం మూడో షెడ్యూల్ (పార్ట్ 2), మొదటి/రెండో షెడ్యూల్లో చేర్చిన మెడికల్ అర్హత/ఎంబీబీఎస్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం కలిగి ఉండాలి.
-వయస్సు: 2018 నవంబర్ 10 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ.53,100-1,67,800/-
(7వ వేతన పే స్కేల్ అనుసరించి) అదనంగా డీఏ, ఎన్‌పీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పొర్ట్ తదితర
అలవెన్సులు ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-(ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ. 250/-)
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో సెక్షన్-1 లో (జనరల్ మెడిసిన్ అండ్ పిడియాట్రిక్స్)- 100 మార్కులు, సెక్షన్-2లో (సర్జరీ, గైనకాలజీ అండ్ ఒబెస్టెట్రిక్స్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్) -100 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాతపరీక్షను రెండు గంటల్లో పూర్తిచేయాలి.
-క్వాలిఫయింగ్ మార్కులు- జనరల్-45 శాతం, ఓబీసీ -40 శాతం, ఎస్సీ/ఎస్టీ-35 శాతం, పీహెచ్‌సీలకు-30 శాతం కనీస అర్హత మార్కులు తప్పనిసరిగా రావాలి.
-ప్రకటించిన పోస్టులకు ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3 నిష్పత్తిలో) ఇంటర్వ్యూకు
పిలుస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ సాధించినవారిని తుది ఎంపిక చేస్తారు.
-రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ -50 మార్కులకు నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ చివరితేదీ: నవంబర్ 10
-వెబ్‌సైట్: www.esic.nic.in

1988
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles