భారత సైన్యంలో హవల్దార్లు


Mon,October 15, 2018 02:33 AM

భారత ప్రభుత్వ రక్షణశాఖ పరిధి లోని ఇండియన్ ఆర్మీ (ఐఆర్) హవల్దార్ (2019 బ్యాచ్) పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
INDIAN-ARMYs
-పోస్టు పేరు: హవల్దార్ (సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్)
-మొత్తం పోస్టులు: 20
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఏ/బీఎస్సీలో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి.
-వయస్సు: 2019 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 25 ఏండ్ల (1993 అక్టోబర్1 నుంచి 1998 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి) మధ్య ఉండాలి.
-నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్
-ఆబ్జెక్టివ్ రాతపరీక్ష పేపర్ 1 (మ్యాథమెటిక్స్)-100 మార్కులు, పేపర్ 2 (ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ)-100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 ప్రశ్నలు (ప్రతి విభాగం నుంచి) ఇస్తారు.
-ప్రతి అభ్యర్థి పేపర్ 1 అండ్ పేపర్ 2లో కనీసం 40 శాతం అర్హత మార్కులను సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 3
-వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

2301
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles