ప్రతిభకు చేయూత స్కాలర్‌షిప్స్


Sun,September 23, 2018 11:29 PM

చదువుకోవాలన్న తపన.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు... పేదరికం, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో.. కేవలం ఐదువేలు లేక ఐఐటీ సీటు పోగొట్టుకున్న ఒక అభ్యర్థి.. లక్ష రూపాయలు స్పాట్‌లో కట్టలేక బీడీఎస్ చేజార్చుకున్న మరో విద్యార్థిని.. వీరందరికి చేయూత ఇస్తే.. ఇష్టమైన రంగాల్లో ఉన్నతస్థితికి చేరుకునేవారే.. అయితే కేంద్ర, రాష్ట్ర, కార్పొరేట్, పలు స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వారికోసం ఎన్నో రకాలుగా చేయూతనిస్తున్నాయి. అయితే చాలామందికి వాటి గురించి సమాచారం లేక.. అవగాహన లోపంతో మరికొంతమంది.. విలువైన జీవితాలను కోల్పోతున్నారు. పదోతరగతి నుంచి పీహెచ్‌డీ వరకు.. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎన్నో స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. వాటిగురించి సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...
scholorship

స్కాలర్‌షిప్స్ అందించే సంస్థల్లో ప్రధానమైనవి

-సెంట్రల్ స్కీమ్స్
-యూజీసీ స్కీమ్స్
-ఏఐసీటీఈ స్కీమ్స్
-స్టేట్ స్కీమ్స్

సెంట్రల్ స్కీమ్స్

-మైనారిటీ మంత్రిత్వశాఖ పరిధిలోని స్కాలర్‌షిప్స్
-ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ స్కీం ఫర్ మైనారిటీస్
-అర్హతలు: ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైనులు, జొరాస్ట్రియన్ (పార్శీలు) విద్యార్థులు.
-ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులకు. పూర్వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
-1-5వ తరగతి చదివే డేస్కాలర్స్‌కు నెలకు రూ.100 చొప్పున, 6-10వ తరగతి డేస్కాలర్స్‌కు నెలకు రూ.500 చొప్పున ఇస్తారు.
-తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష రూపాయలకు మించరాదు.
-ఇతర ఏ స్కాలర్‌షిప్స్ తీసుకుంటున్నవారైనా అర్హులు కారు.
-దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: సెప్టెంబర్ 30

పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్స్

-ఇంటర్, వొకేషనల్, టెక్నికల్ కోర్సులు చేస్తున్నవారు.. యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు.
-తల్లిదండ్రుల వార్షికాదాయం రెండు లక్షలు మించరాదు.
-గతేడాది చదివిన కోర్సు/తరగతి ఫైనల్ ఎగ్జామ్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రూ.7 వేలతోపాటు మెయింటెనెన్స్ కింద నెలకు రూ. 230 చొప్పున ఇస్తారు. టెక్నికల్, వొకేషనల్ కోర్సుల (ఇంటర్‌స్థాయి) వారికి ఏడాదికి పదివేల రూపాయలతోపాటు నెలకు రూ. 230 ఇస్తారు. యూజీ, పీజీ వారికి ఏడాదికి మూడువేలతోపాటు నెలనెలా మెయింటెనెన్స్ అలవెన్సు ఇస్తారు.
-దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 30

మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్

-తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2.50 లక్షలు మించరాదు
-కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా డిగ్రీ, పీజీస్థాయి కోర్సుల్లో ప్రవేశాలు పొందిన మైనారిటీ విద్యార్థులకు ఇస్తారు.
-టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లేకుండా నేరుగా ప్రవేశం పొందినవారు కూడా ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులు.
-ఇంటర్/డిగ్రీస్థాయిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
-పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: https://scholarships.gov.in

సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వశాఖ

-దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్ అందిస్తుంది.
-ప్రీ, పోస్టు మెట్రిక్ బేస్డ్ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తుంది.
-వీటికి అదనంగా దేశవ్యాప్తంగా గుర్తించిన సుమారు 175 టాప్ క్లాస్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన ఎస్సీ విద్యార్థుల కోసం టాప్‌క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు దాఖలు, అర్హతలు, స్టయిఫండ్ తదితరాల కోసం https://scholarships.gov.in వెబ్‌సైట్ చూడవచ్చు.

కార్మిక & ఉపాధి మంత్రిత్వశాఖ

-కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ బీడీ కార్మికులకు, ఇనుప గనులు, మాంగనీస్, క్రోమ్ గనుల్లో పనిచేసేవారి పిల్లలకు, లైమ్‌స్టోన్, డోలమైట్ మైన్‌లలో పనిచేసేవారి పిల్లలకు, సినీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్స్‌ను ఇస్తుంది.
-బీడీ వర్కర్లు, మైన్ వర్కర్లుగా పనిచేసే వారికి నెలకు రూ. పదివేలు, సినీ కార్మికులకు నెలకు రూ. 8 వేలు ఆదాయం మించరాదు.
-1 నుంచి 4వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు రూ. 250/-
-5 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు రూ. 500 (బాలురు), 940 (బాలికలు).
-తొమ్మిదో తరగతి విద్యార్థినులకు రూ. 1140, బాలురకు రూ. 700/-
-పదోతరగతి బాలికలకు రూ. 1840, బాలురకు రూ. 1400/-
-డిగ్రీ కోర్సులకు రూ. 3000/-
-బీఈ/బీటెక్, ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ. 15,000/ స్కాలర్‌షిప్‌గా ఇస్తారు.
-ఈ స్కాలర్‌షిప్ కోసం అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-అదేవిధంగా పైన పేర్కొన్న కార్మికుల పిల్లలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తారు. వీరు సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పదోతరగతి విద్యార్థులకు ఎన్‌టీఎస్‌ఈ

-జాతీయస్థాయిలో ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పరీక్ష నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్‌టీఎస్‌ఈ). ఇది పదోతరగతి చదువుతున్న విద్యార్థుల కోసం
-రెండు దశల్లో ఎంపిక జరుగుతుంది. మొదటి దశ రాష్ట్ర స్థాయి, రెండోదశ జాతీయస్థాయి. దేశవ్యాప్తంగా రెండు దశల్లో ఎంపికైన 1000 మందికి స్కాలర్‌షిప్స్ ఇస్తారు.
-ఇంటర్‌లో నెలకు రూ. 1250 చొప్పున, డిగ్రీ, పీజీలో నెలకు రూ. 2వేల చొప్పున, పీహెచ్‌డీ వారికి యూజీసీ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్ ఇస్తారు.
-మొదటి దశ పరీక్ష నవంబర్ మొదటి ఆదివారం, రెండోదశ ప్రతి ఏటా మేలో నిర్వహిస్తారు.
-పూర్తి వివరాల కోసం http://bse.telangana.gov.in చూడవచ్చు. లేదా సీబీఎస్‌ఈ వెబ్‌సైట్ చూడవచ్చు.

ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వశాఖలో

-కేంద్ర ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వశాఖ షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు నేషనల్ ఫెలోషిప్, స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కింద సహాయం చేస్తుంది.
-ఎంఫిల్, పీహెచ్‌డీ చదివే ఎస్టీ విద్యార్థులకు ఈ స్కీం కింద స్కాలర్‌షిప్ ఇస్తారు. అర్హతలు, స్కాలర్‌షిప్ కింద ఇచ్చే స్టయిఫండ్ మొత్తం తదితర వివరాల కోసం https://tribal.nic.in/Schemes.aspx చూడవచ్చు.
-ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేదీ అక్టోబర్ 31

సీబీఎస్‌ఈ స్కాలర్‌షిప్ ఫర్ గర్ల్‌చైల్డ్

-సీబీఎస్‌ఈ విధానంలో 11, 12 తరగతులు చదివే బాలికల కోసం సీబీఎస్‌ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
-అర్హతలు: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన సీబీఎస్‌ఈ పాఠశాలలో 11/12వ తరగతి చదువుతుండాలి. తల్లిదండ్రులకు ఏకైక సంతానం (బాలిక) అయి ఉండాలి. పూర్తి వివరాల కోసం http://cbse.nic.in చూడవచ్చు.

దివ్యాంగులకు 2500 స్కాలర్‌షిప్స్

-ప్రతి ఏటా కేంద్ర వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా 2500 స్కాలర్‌షిప్స్‌ను దివ్యాంగ విద్యార్థుల కోసం అందిస్తారు.
-దీన్ని నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇస్తుంది.
-స్కాలర్‌షిప్ స్కీం (ట్రస్ట్ ఫండ్) పరిధిలో 2500 స్కాలర్‌షిప్స్ ఇస్తారు.
-గుర్తింపు పొందిన విద్యాసంస్థలో డిగ్రీ/పీజీస్థాయి ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ కోర్సులు చదువుతున్నవారు అర్హులు.
-డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.2,500/- , పీజీ విద్యార్థులకు నెలకు రూ.3,000/ ఇస్తారు. దీంతోపాటు ఇతర ఖర్చుల కింద ఏడాదికి 6/10 వేలు చెల్లిస్తారు.
-తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3 లక్షలు మించరాదు
-ఈ స్కాలర్‌షిప్స్ కోసం జూలై 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
-www.nhfdc.nic.in/scholarship

వికలాంగుల సాధికారిక సంస్థ స్కాలర్‌షిప్స్

-ఈ శాఖ ద్వారా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ తదితర స్కాలర్‌షిప్స్ ఇస్తున్నారు.
-ఈ స్కాలర్‌షిప్స్‌ను 2016 వికలాంగుల చట్టం ప్రకారం గుర్తించిన 21 రకాల దివ్యాంగులకు ఇస్తారు.
-ప్రీమెట్రిక్ - తొమ్మిది, పదోతరగతి విద్యార్థులకు
-పోస్ట్ మెట్రిక్ - ఇంటర్ నుంచి పీజీ స్థాయి డిగ్రీ/డిప్లొమా విద్యార్థులకు
-టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ - నోటిఫైడ్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు
-నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ - పీజీ/పీహెచ్‌డీ డిగ్రీని విదేశాల్లో చదివే వికలాంగ విద్యార్థులకు
-నేషనల్ ఫెలోషిప్ - దేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, పీహెచ్‌డీ చదివే వికలాంగ విద్యార్థులకు
-ఉచిత కోచింగ్ సౌకర్యం - గ్రూప్ ఏ, బీ. టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకున్నవారికి ఆర్థిక సహాయం అందజేస్తారు.
-40 శాతం పైగా వికలాంగత్వం ఉన్నవారు, వ్యాలిడ్ డిసేబిలిటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేవారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.50 లక్షలు మించరాదు.
-టాప్ క్లాస్ ఎడ్యుకేషన్, నేషనల్ ఓవర్సీస్, ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకునేవారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 6 లక్షలు మించరాదు.
-నేషనల్ ఫెలోషిప్ కోసం ఎటువంటి ఆదాయ పరిమితి లేదు.
-దరఖాస్తులకు చివరితేదీ:
-ప్రి మెట్రిక్ - సెప్టెంబర్ 30
-పోస్ట్ మెట్రిక్ - అక్టోబర్ 31
-టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ - అక్టోబర్ 31
-వివరాల కోసం https://scholarships.gov.in

హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ స్కాలర్‌షిప్స్

-సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్ ఫర్ కాలేజీ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్
-తక్కువ ఆదాయ కుటుంబాలకు విద్యార్థులకు చేయూతనివ్వడం దీని ప్రధాన ఉద్దేశం
-ఏటా 82,000 మందికి ఈ స్కాలర్‌షిప్స్ ఇస్తున్నారు. వీటిలో 41వేలు బాలురకు, 41 వేలు బాలికలకు ఇస్తారు.
-డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ ఇస్తారు.
-ఈ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31 చివరితేదీ.
-పూర్తి వివరాల కోసం నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ చూడవచ్చు.

సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్

-బాలికలను ఉన్నత విద్యలో ప్రోత్సహించడానికి యూజీసీ ప్రారంభించిన ప్రోగ్రామే ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ ఫర్ పీజీ ప్రోగ్రామ్స్.
-పీజీస్థాయిలో నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో మహిళలను ప్రోత్సహించడమే దీని ఉద్దేశం
-ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే బాలిక/మహిళ తల్లిదండ్రులకు ఏకైక సంతానమై ఉండాలి. తోబుట్టువులు ఉండకూడదు.
-రెగ్యులర్ విధానంలో పీజీలో ప్రవేశం పొంది ఉండాలి.
-30 ఏండ్లు మించరాదు.
-ఈ స్కాలర్‌షిప్ కింద నెలకు రూ. 3,100/- ఇస్తారు. ఏటా పదినెలల చొప్పున రెండేండ్లు ఇస్తారు. పూర్తి వివరాల కోసం http://scholarships.gov.in చూడవచ్చు.

ఇంటర్ సైన్స్ విద్యార్థులకు కేవీపీవై

-ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం, డిగ్రీ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదివే సైన్స్ (ఎంపీసీ/బైపీసీ) విద్యార్థుల కోసం బెంగళూరులోని ఐఐఎస్సీ అధ్వర్యంలో నిర్వహించేదే కేవీపీవై.
-కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) ప్రధాన ఉద్దేశం బేసిక్ సైన్స్ విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించడం. దీనిలో ఎస్‌ఏ, ఎస్‌ఎక్స్, ఎస్‌బీ స్ట్రీంలు ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
-ఎంపికైన విద్యార్థులకు మొదటి మూడేండ్లు నెలకు రూ.5 వేలు. తర్వాతి రెండేండ్లు నెలకు రూ.7వేలు ఇస్తారు. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పరిశోధన సంస్థల్లో సమ్మర్ క్యాంపుల్లో పాల్గొనవచ్చు.
-ఏటా జూన్/జూలైలో కేవీపీవై ప్రకటన వస్తుంది. నవంబర్‌లో ఎగ్జామ్ ఉంటుంది.
-పూర్తి వివరాల కోసం www.kvpy.iisc.ernet.in చూడవచ్చు.
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1425
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles