జేఈఈ మెయిన్ పర్సంటైల్


Wed,September 12, 2018 01:41 AM

Joint-Entrance-Exam
- ఈ ఏడాది జేఈఈ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనున్నది. అయితే ఇంతకుముందు పరీక్షను ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో అభ్యర్థి ఏది కోరుకుంటే అలా నిర్వహిస్తూ వచ్చారు. అది కూడా ఏడాదికి ఒక్కసారే. కానీ ఈ ఏడాది ప్రభుత్వం పరీక్ష నిర్వహణ కోసం ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయడం, ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థుల్లో కొంతమేరకు ఆందోళన, అపోహలు నెలకొన్నాయి. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ఈ వ్యాసం...
- ఇంతకుముందు ఆన్‌లైన్‌లో పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే, ఒక విద్యార్థి రాసిన పేపర్‌కు మరో విద్యార్థి రాసిన పేపర్‌కు క్లిష్టత స్థాయిలో తేడాలు ఉన్నాయి. అయితే క్లిష్టత స్థాయి దాదాపుగా ప్రతి పరీక్షలో ఒకే స్థాయిలో ఉంచడానికి ఆయా పరీక్ష నిర్వహణ సంస్థలు ప్రయత్నం చేశాయి. అయితే కఠిన్యత ఒకేస్థాయిలో అంటే ప్రతి సబ్జెక్టు కఠినతస్థాయి అన్ని పేపర్లలో ఒకే మాదిరిగా లేదనేది వాస్తవం. ఇది అభ్యర్థి విజయావకాశాలను కొంత మేర ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎ, బి అనే ఇద్దరు అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష రాసినప్పుడు ఎ అనే అభ్యర్థికి ఫిజిక్స్ కఠినస్థాయి కొంత హెచ్చుగా ఉండవచ్చు. ఈ తేడావల్ల ఫైనల్ మార్కింగ్‌లో తేడా రావడంవల్ల ఎ, బి అభ్యర్థుల ర్యాంకింగ్‌లో తేడా వస్తుంది.
- పైన ఉదహరించిన అంశాలను ఎన్‌టీఏ దృష్టిలో ఉంచుకొని నార్మలైజేషన్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ పర్సంటైల్ స్కోర్ అనే పద్ధతిని ప్రవేశపెట్టింది.

పర్సంటైల్ స్కోర్ అంటే ఏమిటి?

- పర్సంటైల్ అంటే సబ్జెక్టులో అభ్యర్థులు సాధించిన పర్సంటేజీ ఆఫ్ స్కోర్.
ఉదా: 120 మార్కులకుగాను ఒక అభ్యర్థి100 మార్కులు సాధిస్తే, 99 మార్కులు నలుగురు, 96 మార్కులు 10 మంది. 100 శాతానికి 100 మార్కులకు సమానంగా అంతకంటే తక్కువ లెక్కగట్టితే అది పర్సంటైల్.
- పర్సంటైల్ స్కోర్‌ను 7 డెసిమల్ స్థానాల వరకు లెక్కగడుతారు.
Joint-Entrance-Exam1
Joint-Entrance-Exam2
Joint-Entrance-Exam3

పర్సంటైల్ స్కోర్ సమానమైతే?

- మొత్తం పర్సంటైల్ స్కోర్ సమానమైతే, మ్యాథమెటిక్స్ పర్సంటైల్ ఎక్కువ ఏ అభ్యర్థికి వస్తుందో అతడి ర్యాంక్ ముందుకువేయడం జరుగుతుంది.
- ఒకవేళ మ్యాథమెటిక్స్‌లో సమానమైన పర్సంటైల్ ఉంటే తర్వాతి క్రమంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ పర్సంటైల్‌ను చూస్తారు.
- ఒకవేళ అన్ని సబ్జెక్టుల్లో సమానమైన పర్సంటైల్ ఉంటే అభ్యర్థి వయస్సు ఆధారం చేసుకుంటారు. ఇక్కడ ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థి మొదటి ర్యాంక్, తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి తర్వాతి ర్యాంక్ ఇస్తారు.

అభ్యర్థి రెండుసార్లు పరీక్ష రాయవచ్చా?

- నిస్సందేహంగా రాయవచ్చు. రెండు దశల్లో కూడా పైన చెప్పిన పర్సంటైల్ స్కోర్ పద్ధతిని అవలంబిస్తారు. కానీ రెండు దశల్లో వచ్చిన ఉత్తమ ఫలితాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

మెరిట్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు?

- రెండు దశల పరీక్ష పూర్తయిన తర్వాత ప్రకటిస్తారు.
- పై ఉదాహరణలో పర్సంటైల్ స్కోర్ తేడా రావడం గమనించవచ్చు. ఎందుకంటే మొత్తం అభ్యర్థుల్లో కనిష్ట మార్కులు వచ్చిన అభ్యర్థులు ఒక్కరే కావడం. ఒకవేళ ఇద్దరికి -39 మార్కులు వచ్చినట్లయితే పర్సంటైల్ స్కోర్ ఆ ఇద్దరు అభ్యర్థులకు 0.0071397.
gopikrishna

1191
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles