జేఈఈ (మెయిన్) 2019 ఎఫ్‌ఏక్యూ


Sun,September 9, 2018 11:17 PM

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్ష జేఈఈ మెయిన్. ఈసారి పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనున్నది. అంతేకాకుండా ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తున్నారు. 2019 జనవరి సెషన్ దరఖాస్తులు స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తరచుగా వచ్చే పలు సందేహాలను తీరుస్తూ ఎన్‌టీఏ రూపొందించిన ప్రశ్నావళి-జవాబులు నిపుణ పాఠకుల కోసం...
jee-main

జేఈఈ మెయిన్ ఆన్‌లైనా/ఆఫ్‌లైనా?

-ఈసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.

జేఈఈ మెయిన్-2019కి ఎవరు అర్హులు?

-2017, 2018లో ఇంటర్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు, 2019 మార్చిలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ పరీక్ష రాయడానికి ఎటువంటి వయోపరిమితి నిబంధన లేదు.

వికలాంగ అభ్యర్థులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారు?

-జేఈఈ మెయిన్ ఇన్ఫర్మేషన్ బులిటెన్‌లో పేజీ నంబర్ 4లో వివరంగా పేర్కొన్నారు.
ఒక్క ఏడాదిలో ఎన్నిసార్లు పరీక్ష రాయవచ్చు?
-కొత్త విధానం ప్రకారం జేఈఈ మెయిన్‌ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నారు. ఒక ఏడాదిలో నిర్వహించే రెండు సెషన్లను కలిపి ఒకటిగానే పరిగణిస్తారు. అభ్యర్థులు మూడు వరుస సంవత్సరాలు జేఈఈ మెయిన్ రాసుకోవచ్చు.

డిప్లొమా అభ్యర్థులకు అర్హత?

-జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా వారు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసుకోవచ్చు. కానీ వారు నిట్, సీఎఫ్‌టీఐ మెయిన్‌స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పించే సంస్థల్లో ప్రవేశాలకు అర్హులు కారు.

నార్మలైజేషన్ స్కోర్ ఎలా నిర్ణయిస్తారు?

-నార్మలైజేషన్ పద్ధతి - ఎన్‌టీఏ స్కోర్ కోసం జేఈఈ మెయిన్ వెబ్‌సైట్ హోంపేజీలో వివరాలను చూడవచ్చు. https://jeemain.nic.in/ webinfo/Public/Home.aspx

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

-ఆన్‌లైన్‌లో (www.nta.ac.in) దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని ముందే సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ సెప్టెంబర్ 30. ఫీజు చెల్లించడానికి చివరితేదీ అక్టోబర్ 1.

ఫొటో కింద పేరు, తేదీ లేకున్నా అనుమతిస్తారా?

-ఫొటో (10 కేబీ-200 కేబీ), అభ్యర్థి సంతకం (4 కేబీ-30 కేబీ) జేపీజీ/జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఫొటో కింద క్యాపిటల్ లెటర్స్‌తో పేరు, ఫొటో దిగిన తేదీని పేర్కొనాలి. కలర్/బ్లాక్ అండ్ వైట్ ఏదైనా అనుమతిస్తారు. పోలరాయిడ్ ఫొటోలను అనుమతించరు.

జేఈఈ మెయిన్ స్లాట్ టైం/తేదీలను ఇస్తారా?

-దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ర్యాండమ్ విధానంలో షిప్ట్, తేదీలను ఎన్‌టీఏ నిర్ణయిస్తుంది.
సిలబస్‌లో ఎటువంటి మార్పులు చేశారు?
-2019లో నిర్వహించే జేఈఈ మెయిన్ సిలబస్‌లో ఎటువంటి మార్పులు లేవు. గతేడాది సిలబస్ ప్రకారం ఈసారి కూడా పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది?

-జేఈఈ మెయిన్ రెండు పేపర్లు ఉంటాయి.
-పేపర్-1 (బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం)
-పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం)

పేపర్-1 పరీక్ష విధానం?
-దీనిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు. మూడు సబ్జెక్టులకు సమాన వెయిటేజీ ఇస్తారు.

పేపర్-2 పరీక్ష విధానం?
-మ్యాథ్స్ (ఆబ్జెక్టివ్ విధానం, ఆన్‌లైన్‌లో), ఆప్టిట్యూడ్ టెస్ట్ (డ్రాయింగ్‌పై) పెన్, పేపర్ పద్ధతిలో డ్రాయింగ్ షీట్‌పై నిర్వహిస్తారు.
ఫీజు ఎలా చెల్లించాలి?
-జనరల్/ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు పేపర్-1/ పేపర్-2 ఏదైనా ఒకదానికి రూ. 500/-
-జనరల్/ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు పేపర్-1, 2 (రెండు పరీక్షలకు) రూ. 900/-
-అన్ని కేటగిరీలకు చెందిన బాలికలకు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు పేపర్-1/ పేపర్-2 (ఏదైనా ఒకటి) - రూ. 250/-
-అన్ని కేటగిరీలకు చెందిన బాలికలకు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు పేపర్-1, 2 (రెండు పేపర్లు) - రూ. 450/-

దరఖాస్తులో పొరపాట్లు జరిగితే ఎలా?

-అక్టోబర్ 8 నుంచి 14 మధ్యలో పొరపాట్లను సరిచేసుకోవాలి. తర్వాత ఎటువంటి సవరణలకు అనుమతించరు.
2019 నుంచి పరీక్ష కఠినంగా ఉండనుందా?
-లేదు. సిలబస్, పరీక్ష విధానం అంతా గతంలోలాగే ఉంటుంది.

పరీక్షకు క్యాలిక్యులేటర్లను అనుమతిస్తారా?

-అనుమతించరు

కంప్యూటర్ లేనివారికి, ఆన్‌లైన్ ఎగ్జామ్ అనుభవంలేని విద్యార్థులకు ప్రాక్టీస్ కోసం ఏం చేస్తున్నారు?

-దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కలిగి ఉన్న పలు స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలను గుర్తించి వాటిని టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లుగా ప్రకటిస్తారు. ఆయా సెంటర్లలో ఉచితంగా విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

ఏ బ్రౌజర్ ద్వారా జేఈఈ మెయిన్ దరఖాస్తు చేసుకోవాలి?

-మొజిల్లా ఫైర్‌ఫాక్స్/ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (9.0 above), మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి. అంటే దరఖాస్తు సమయంలో అంతరాయం కలగకుండా ఉండాలి.

ఏటా రెండుసార్లు జేఈఈ మెయిన్ నిర్వహిస్తే రెండుసార్లు రాయవచ్చా ఒకసారి కూడా రాయవచ్చా? ఏ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు?

-అభ్యర్థులు ఒక్కసారి లేదా రెండుసార్లు కూడా రాసుకోవచ్చు. అభ్యర్థుల ఇష్టం. అభ్యర్థి రెండుసార్లు పరీక్ష రాస్తే రెండింటిలో దేనిలో ఎక్కువ స్కోర్ వస్తే దాన్ని ఆధారంగా చేసుకుని జేఈఈ అడ్వాన్స్‌డ్-2019కు ఎంపిక చేస్తారు. అదేవిధంగా ప్రవేశాలకు కూడా ఎక్కువ స్కోర్‌నే పరిగణనలోకి తీసుకుంటారు.

జోసా-2019 కౌన్సిలింగ్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా?

-జోసా ప్రక్రియలో ఎటువంటి మార్పులు లేవు.
పూర్తి వివరాల కోసం https://jeemain.nic.in చూడవచ్చు.

-ఎన్‌టీఏ దేశవ్యాప్తంగా 2,697 టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటుచేయనున్నది. జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌కు ఈ సెంటర్లలో విద్యార్థులు ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
-జేఈఈ మెయిన్ దరఖాస్తులను పూర్తిచేయడానికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లను ఎన్‌టీఏ ఏర్పాటు చేయనున్నది. నామమాత్రపు ఫీజు తీసుకుని దరఖాస్తు చేసుకోవడం, అడ్మిట్ కార్డు డౌన్‌లోడింగ్, ఫలితాలు చూసుకోవడం వంటి సర్వీస్‌లను ఈ కేంద్రాలు అందిస్తాయి.
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1490
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles