‘ఎస్‌ఎస్‌సీ’ 1136 పోస్టులు


Sun,September 9, 2018 11:16 PM

భారత ప్రభుత్వ పరిధిలోని రీజినల్/సబ్ రీజినల్ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్ స్టోర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, టెక్నికల్ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
staff_selection_commission
-మొత్తం పోస్టులు: 1136
-విభాగాల వారీగా పోస్టులు: జూనియర్ ఫిజియోథెరపిస్ట్-26, జూనియర్ ఇంజినీర్-115, సైంటిఫిక్ అసిస్టెంట్-99, బొటానికల్ అసిస్టెంట్-31, డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-48, లైబ్రేరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-25, డైటీషియన్-9, టెక్నికల్ అసిస్టెంట్/అసిస్టెంట్-14, రిసెర్చ్/ల్యాబొరేటరీ అసిస్టెంట్-17, సీనియర్ ఆఫీసర్ (హార్టికల్చర్)-12, అసిస్టెంట్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్-15, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్-68, డ్యాఫ్ట్స్‌మ్యాన్-54, అసిస్టెంట్ మ్యాప్ క్యూరేటర్-5, అసిస్టెంట్ స్టోర్ కీపర్-14, ఫోర్‌మ్యాన్-13, ల్యాబొరేటరీ అటెండెంట్-69, నావిగేషనల్ అసిస్టెంట్-19, లేడీ మెడికల్ అటెండెంట్-16, టెక్నికల్ ఆపరేటర్-201, మెడికల్ అటెండెంట్-36, క్యాంటీన్ అటెండెంట్-155, క్లర్క్-3 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి మెట్రిక్యులేషన్, ఇంటర్, సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమా లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
గమనిక: అర్హతలు, వయస్సు వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

-దరఖాస్తు ఫీజు: రూ. 100/- మహిళలు, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్లకు ఎటువంటి ఫీజు లేదు.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, సీనియర్ లెవల్స్ పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
-పరీక్ష విధానం: మొత్తం100 ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్- 25 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్-25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ - 25 ప్రశ్నలు ఇస్తారు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కుల కోత విధిస్తారు. అదే విధంగా కొన్ని పోస్టులకు స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు.
-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆయా పోస్టులను బట్టి పదోతరగతి/ఇంటర్, డిగ్రీ స్థాయిలో ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.sscsr.gov.in లేదా www.ssconline.nic.in

5166
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles