టాలెంట్ సెర్చ్- NTSE


Wed,August 15, 2018 12:08 AM

- దేశంలో ప్రతిష్ఠాత్మకమైన స్కాలర్‌షిప్‌గా పేరొందిన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) నోటిఫికేషన్‌ను ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసింది.
- ప్రతి సంవత్సరం సుమారుగా 9 నుంచి 10 లక్షలమంది పోటీ పడితే అందులో నుంచి రెండుదశల్లో 1000 మంది విద్యార్థులు (750 జనరల్ + 250 రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు) స్కాలర్‌షిప్స్‌కు ఎంపికవుతారు.
ఎందుకీ పరీక్ష
- దేశవ్యాప్తంగా మెరికల్లాంటి విద్యార్థులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1961లో ఎన్‌సీఈఆర్‌టీ ఈ పరీక్షలను ప్రారంభించింది. మొదట ఢిల్లీలో చదివే విద్యార్థులకు దీన్ని నిర్వహించేవారు. తర్వాత క్రమంలో దేశవ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు.
ఎవరు అర్హులు
- ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు
పరీక్ష స్వరూపం
- ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తే, రెండో దశను కేంద్రం (ఎన్‌సీఈఆర్‌టీ) నిర్వహిస్తుంది.
సిలబస్
- ఈ పరీక్ష రెండు దశలలో ఉంటుంది.
- మొదటి దశలో లాంగ్వేజ్ పరీక్షకు 50 మార్కులు కేటాయించేవారు. కానీ ఈ సంవత్సరం నుంచి ఎన్‌సీఈఆర్‌టీ వారి మార్పులకు అనుగుణంగా రాష్ట్రస్థాయిలో లాంగ్వేజ్ పరీక్షను తొలగించి మానసిక సామర్ధ్య పరీక్ష (మ్యాట్)కు 100 ప్రశ్నలు - 100 మార్కులు కేటాయించారు. అదేవిధంగా స్కోలాస్టిక్ అచీవ్‌మెంట్ టెస్ట్ (ఎస్‌ఏటీ)కు 100 ప్రశ్నలు. 100 మార్కులు.

ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

- పాత ప్రశ్నపత్రాలను, గతంలో పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయం ప్రకారం ఈ పరీక్ష కేవలం తరగతి పుస్తకాల విషయ పరిజ్ఞానం కంటే భిన్నమైనది. లోతైన విషయ అవగాహన, అన్వయ ఆధారిత విషయాలపైన గట్టిపట్టు ఉండాలి. అయితే కొన్ని విషయాలను సబ్జెక్టుపరంగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న అంశాలుగా గుర్తించి వాటికి కొంత ప్రాధాన్యం ఇవ్వాలి.

మెంటల్ ఎబిలిటీ టెస్ట్

- అనాలజీ (వెర్బల్, నాన్ వెర్బల్)
- బ్లడ్ రిలేషన్
- క్యాలెండర్, టైం క్లాక్
-కోడింగ్, డీకోడింగ్
- క్లాసిఫికేషన్
-వెన్ డయాగ్రమ్స్
- వాటర్ & మిర్రర్ ఇమేజెస్
- స్కొలాస్టిక్ అచీవ్‌మెంట్ (SAT)
- మ్యాథ్స్: జామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్, నంబర్ సిస్టమ్, ప్రాఫిట్ & లాస్
- సైన్స్: గ్రావిటీ, ఎనర్జీ, లిక్విడ్స్, గ్యాసెస్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, హిస్టరీ ఆఫ్ ఫిజిక్స్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, న్యూట్రిషన్, నేచురల్ గ్యాసెస్, సెల్స్, కామన్ డిసీసెస్, ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్.

సోషల్

1. మొగలుల చరిత్ర (History of Mughal Dynasty)
2. ప్రాచీన నాగరికతలు (Ancient Civilisation)
3. శాసనసభ (Legislative Assembly)
4. ప్రభుత్వ నిర్మాణం (Government Structure)
5. భారత భౌగోళిక ప్రాంతాలు (Physical divisions of India)
6. జలభాగం (Hydro Sphere)
7. బ్యాంకుల రకాలు (Types of Banks)
8. రాజకీయాంశాలు (Political events)
9. బహుమతులు (Awards)
10. ఆర్థిక వ్యవస్థ రకాలు (Types of economics)
11. ఫ్రాథమిక హక్కులు (Fundamental rights)
12. సహజ వృక్ష సంపద (Natural vegetation)
13. భారత రాజకీయవ్యవస్థ (Political System of India)

ప్రయోజనాలు

- ఈ పరీక్ష ద్వారా కలిగే ప్రయోజనాలకంటే సమాజంలో ఆ విద్యార్థి/విద్యార్థినికి లభించే గుర్తింపు విశేషంగా ఉంటుంది.
- మొదటి రెండేండ్లు నెలకు రూ.1250. తర్వాత నెలకు రూ.2000 చొప్పున ఉపకారవేతనం ఇస్తారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి అభ్యర్థి పీహెచ్‌డీ (Ph.D) పూర్తిచేసే వరకు ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు. దీన్ని రూ.4000 నుంచి 5000 వరకు పెంచాలనే చర్చ కూడా జరుగుతున్నది. ప్రభుత్వ పరిశీలనలో ఈ అంశం ఉన్నది.
- ఐఐటీ-ఢిల్లీలో ఒకవేళ అభ్యర్థి చేరాలనే కోరిక ఉన్నట్లయితే అతని ప్రవేశపరీక్షలో అంటే జేఈఈ పరీక్షలో అతనికి వచ్చిన మార్కులకు అదనంగా 6 మార్కులు కలుపుతారు. దానివల్ల మిగితా అభ్యర్థులకంటే అతని/ఆమె అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉన్నది.
- ఈ విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాలయాలు చాలావరకు డిగ్రీ కోర్సులు ఉచితంగా అందించే అవకాశం ఉన్నది.
- దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఐటీలలో ఎన్‌టీఎస్‌ఈ అర్హత సాధించినవారికి ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత

- ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు. SSC/CBSE/ICSE.

సబ్జెక్టులు

- సైన్స్, మ్యాథ్స్, సోషల్.

ప్రశ్నల విధానం

- ఆబ్జెక్టివ్. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు.

పరీక్ష విధానం స్టేజ్

-1MAT - 100 ప్రశ్నలు
SAT - 100 ప్రశ్నలు

మార్కింగ్ స్కీమ్

- ప్రతి సరైన జవాబుకు
1 మార్కు. నెగెటివ్ మార్కులు లేవు.

ఎంపిక

- స్టేజ్ 1లో 4000 మందిని ఎంపికచేస్తారు.
- స్టేజ్ 2లో 1000 మందిని ఎంపికచేస్తారు.

ముఖ్యమైన తేదీలు

- దరఖాస్తులు: ప్రారంభమైనవి
- ఫీజు చెల్లించడానికి చివరితేదీ (చలానా): ఆగస్టు 28
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 29
- NTSE తెలంగాణ పరీక్ష తేదీ: నవంబర్ 4
- ఫలితాలు విడుదలయ్యే తేదీ: 2019, జనవరి చివరి వారంలో.
- NTSE 2019, స్టేజ్ 2 - 2019, మే 12
ntse
KRISHNA

601
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles