సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో పీవోలు


Thu,June 21, 2018 12:05 AM

సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
south-indian-bank
-పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్ (స్కేల్-I)
-మొత్తం ఖాళీల సంఖ్య - 100
-ఏడాది కాలవ్యవధిగల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీవోగా ఉద్యోగ అవకాశాన్ని బ్యాంక్ కల్పిస్తుంది.
-పీజీడీబీఎఫ్ కోర్సును మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు నిర్వహిస్తుంది.
-ఎంపిక: మొదట ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రూప్‌డిస్కషన్/వ్యక్తిగత ఇంటర్వ్యూకు ఎంపికచేసి పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు అనంతరం పీవోగా ఉద్యోగం ఇస్తారు.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత. దూరవిద్యా విధానంలో చదువుకున్నవారు అర్హులు కారు.
-వయస్సు: 2017, డిసెంబర్ 31 నాటికి 25 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు వయోపరిమితిలో ఐదేండ్లు సడలింపు ఇస్తారు.
-పీజీడీబీఎఫ్ కోర్సు: ఇది ఎనిమిది నెలల కోర్సు. అనంతరం నాలుగు నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
-కోర్సు ఫీజు: రూ. 3.50 లక్షలు. రుణ సౌకర్యం కల్పిస్తారు.
-స్టయిఫండ్: కోర్సు చదువుతున్న సమయంలో విద్యార్థులకు నెలకు రూ. 3 వేలు. ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు 15 వేలు చెల్లిస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-పేస్కేల్: రూ. 23,700 - 42,020 + డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 27
-ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: జూలై 7
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌తోపాటు దేశంలోని పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
-వెబ్‌సైట్: https://www.southindianbank.com

836
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles