సాహసికుల గమ్యం నేవీ యూనివర్సిటీ ఎంట్రీ స్క్రీం


Wed,June 20, 2018 02:54 AM

Navy
దేశరక్షణలో నావికాదళం పాత్ర కీలకం. సుమారు 7,516 కి.మీ. పొడవున్న సముద్రతీరం భారత్ సొంతం. ఇంత పెద్ద తీరప్రాంతాన్ని రక్షించడంలో నావికాదళం కృషి అమోఘం. ప్రతిఏటా పదోతరగతి నుంచి పట్టభద్రుల వరకు ఉద్యోగావకాశాన్ని, దేశ సేవ చేసే భాగ్యాన్ని నేవీ కల్పిస్తుంది. ఇంజినీరింగ్ చేసి రొటీన్ జాబ్స్‌కు భిన్నంగా.. ఛాలెంజింగ్ కెరీర్ కోరుకునే వారికి, మంచి జీతభత్యాలు, సమాజంలో సమున్నత గౌరవాన్ని కల్పించే ఉద్యోగాల సమాహారమైన యూనివర్సిటీ ఎంట్రీ స్కీం కోర్సు నోటిఫికేషన్ విడుదలైంది. సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాలను అందించే ఈ ప్రకటన వివరాలు సంక్షిప్తంగా.

ముఖ్యతేదీలు:

-ఆన్‌లైన్‌లో జూన్ 30 నుంచి జూలై 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

-పర్మనెంట్ కమిషన్ కింద ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ (జీఎస్) ఆఫీసర్స్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచీల ద్వారా ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేస్తారు.

ఎవరు అర్హులు?

-బీఈ/బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-1995, జూలై 2 నుంచి 1998, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-నేవల్ ఆర్కిటెక్చర్ బ్రాంచీకి మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన బ్రాంచీలన్నింటికి కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
-పురుషులు కనీసం 157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. నేవీ నిర్దేశించిన ఇతర శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక ఎలా?

-నేవల్ క్యాంపస్ ప్రాసెస్‌లో భాగంగా ఇంటర్వ్యూ చేసి షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత రెండుదశల్లో ఎంపిక ఉంటుంది.

శిక్షణ- పదోన్నతులు

-ఎంపికైనవారికి 22 వారాల ప్రొఫెషనల్ ట్రెయినింగ్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ జీఎస్ ఎంట్రీ అభ్యర్థులకు 44 వారాల శిక్షణనిస్తారు.
-విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో ఉద్యోగావకాశాన్ని కల్పిస్తారు. కమాండర్ స్థాయి వరకు పదోన్నతి పొందవచ్చు.
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

898
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles