TSPSC Special ఇంద్రధనస్సు విప్లవం ప్రధాన ఉద్దేశం?


Wed,June 20, 2018 01:48 AM

jathiya

ఉల్లి (Onion)

- ప్రపంచంలో ఉల్లి ఉత్పత్తిలో చైనా ప్రథమస్థానంలో ఉండగా, భారతదేశం రెండో స్థానంలో ఉన్నది.
- దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా ఉత్పత్తి చేస్తుండగా, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి.
- రాష్ట్రంలో ఉల్లిగడ్డల సాగు విస్తీర్ణం- 15 శాతంగా ఉంది.
- వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా వృద్ధిలోకి తీసుకురావడానికి వివిధ రకాల విప్లవాలను, వాటి పెంపకాలను ప్రవేశపెట్టారు.

అవి..

1. తేనె టీగల పెంపకం- ఎపికల్చర్
2. పట్టు పురుగుల పెంపకం- సెరికల్చర్
3. చేపల పెంపకం- ఆక్వాకల్చర్ (పిసికల్చర్)
4. కూరగాయలు, మొక్కల పెంపకం (సాగు)- ఆర్బొరికల్చర్
5. ఉద్యానపంటల పెంపకం- హార్టికల్చర్ (పండ్లు, పూలు, కూరగాయలు)
6. పండ్లు, పండ్లతోటల పెంపకం- పొమికల్చర్
7. పూల పెంపకం- ఫ్లోరికల్చర్
8. ద్రాక్షతోటల పెంపకం-విటికల్చర్

- వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన విప్లవాలు.
1. ఊదా విప్లవం (Violet Revolution)
- ఉన్ని వస్తువుల అభివృద్ధి
2. నీలి విప్లవం (Blue Revolution)
- చేపలు, సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి
3. హరిత విప్లవం (Green Revolution)
- గోధుమ ఉత్పత్తుల అభివృద్ధి
4. పసుపు విప్లవం (Yellow Revolution)
- నూనెగింజల ఉత్పత్తి పెంపకం
5. ఆరెంజ్ విప్లవం (Orange Revolution)
- నిమ్మజాతి ఫలాల దిగుబడులు పెంచడం
6. ఎరుపు విప్లవం(Red Revolution)
- మాంసం, టమాటా ఉత్పత్తుల పెంపకం
7. శ్వేత విప్లవం(White Revolution)
- పాలు/ పాల ఉత్పత్తుల పెంపకం
8. బ్లాక్ విప్లవం (Black Revolution)
- చమురు/ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులను అధికం చేయడం
9. బూడిద విప్లవం (Grey Revolution)
- కృత్రిమ ఎరువుల ఉత్పత్తులను పెంచడం
10. గులాబి విప్లవం (Pink Revolution)
- రొయ్యల అభివృద్ధి
11. బ్రౌన్ విప్లవం (Brown Revolution)
- సుగంధ ద్రవ్యాల ఉత్పత్తుల పెంపకం
12. వెండి విప్లవం (Silver Revolution)
- కోడిగుడ్ల ఉత్పత్తుల పెంపకం
13. బంగారు విప్లవం (Gold Revolution)
- పండ్ల ఉత్పత్తుల పెంపకం
14. రౌండ్ విప్లవం (Round Revolution)
- ఆలుగడ్డల ఉత్పత్తుల పెంపకం
15. ఆహారపు గొలుసు విప్లవం (Food chain Revolution)
- గిడ్డంగుల ఏర్పాటు
16. ఇంద్రధనస్సు విప్లవం (Rainbow Revolution)
- అన్నిరకాల ఉత్పత్తుల పెంపకం
గమనిక: 2000, జనవరి 28న మొదటిసారిగా భారత ప్రభుత్వం జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా విప్లవాలన్నింటిని ఏకీకృతం చేస్తూ ఇంద్రధనస్సు విప్లవంను ప్రవేశపెట్టింది. ఈ విప్లవంలో మిశ్రమ వ్యవసాయం కూడా ఒక భాగం.

హరితవిప్లవం (1965-66)

- హరిత విప్లవం అనే పదాన్ని మొదట వాడిన వ్యక్తి
- విలియం గాట్
- హరిత విప్లవాన్ని మొదటిసారిగా ప్రపంచంలో వ్యాప్తి చేసిన వ్యక్తి (ప్రపంచ హరితవిప్లవ పితామహుడు)
- నార్మన్ బోర్లాగ్ (మెక్సికో)
- భారతదేశంలో హరిత విప్లవాన్ని అధికంగా వ్యాప్తిచేసిన వ్యక్తి (భారత హరితవిప్లవ పితామహుడు)
- ఎంఎస్ స్వామినాథన్

దేశంలో హరితవిప్లవం

- దేశంలో హరితవిప్లవం ద్వారా పంజాబ్, హర్యానా రాష్ర్టాలు, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అధికంగా ప్రయోజనం పొందాయి.
- హరితవిప్లవం వల్ల అధికంగా ప్రయోజనం పొందిన పంటలు గోధుమ, వరి, జొన్నలు, మొక్కజొన్న
- హరితవిప్లవం ద్వారా తక్కువ ప్రయోజనం పొందిన పంటలు.. పప్పుధాన్యాలు, నూనెగింజలు

శ్వేత విప్లవం (White Revolution)

- కేంద్ర ప్రభుత్వం శ్వేత విప్లవాన్ని ప్రోత్సహిస్తూ 1970లో పాల వెల్లువ (Operation Flood) అనే పథకాన్ని ప్రారంభించింది.
- పాల విప్లవ (శ్వేత విప్లవ) పితామహుడు - వర్గీస్‌కురియన్
ఉద్దేశం: గ్రామాలను పట్టణాలతో అనుసంధానించడం. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తులను, పట్టణ ప్రాంతాల్లో పాల వినియోగతను పెంచడం
గమనిక: దేశంలో ప్రముఖ పాల కంపెనీ - Amul (ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్)
- జాతీయ పాల పరిశోధనా కేంద్రం - కర్నాల్ (హర్యానా)

గోదాంల ఏర్పాటు (Food Revolution)

- తెలంగాణ ప్రభుత్వం మొత్తం 17,057 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాంల నిర్మాణం చేపడుతుంది.
- మొత్తం 330 ప్రదేశాలోల నాబార్డ్ సహాయంతో మొత్తం 138 గోదాంల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. ఒక్కొక్క గోదాం ప్రత్యేక డిజైన్‌తో కూడి మొత్తం మూడు కంపార్ట్‌మెంట్లను కలిగి ఉంటుంది. వీటిలో..
- రైతుబంధు పథకం
- ఎంఎస్పీ ఆపరేషన్లు
- పీడీఎస్ బియ్యం/ విత్తనాలు నిల్వ చేస్తారు.

పశుసంపద

- ప్రపంచంలో పశువుల విషయంలో మొదటి స్థానం భారత్
- ప్రపంచం మొత్తం మీద ఉన్న పశువుల్లో 57 శాతం బర్రెలు భారత్‌లో ఉన్నాయి.
- 2016-17 సీజన్‌లో పశువులు 42 శాతం కలిగి వ్యవసాయం తర్వాత స్థానాన్ని కలిగి ఉన్నాయి.
- వ్యవసాయరంగంలో పశుపోషణ ఒక భాగం.

పాడి పశువులను ఆవులు, బర్రెలుగా.. మాంసాన్నిచ్చే జంతువులను గొర్రెలు, మేకలుగా విడదీస్తాం.

- భారత్‌లోని బర్రెలు, గొర్రెల సంతతి మొత్తంలో తెలంగాణలోని బర్రెలు, గొర్రెల సంతతి 5.52 శాతానికిపైగా ఉంది.
- దేశంలో మొదటిసారిగా పశుసంపద గణాంకాలను తయారుచేసిన సంవత్సరం 1919
- ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఈ గణాంకాలు తయారు చేస్తారు.
- తెలంగాణలో సుమారు 29 లక్షల కుటుంబాలు పశుపోషణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి.
- రాష్ట్రంలో మొత్తం పశుసంపద 2,70,72,891
(తెలంగాణ పశుసంపద 2012 లెక్కల ప్రకారం)

వీటిలో

- గొర్రెలు - 1,28,35,761
- ఆవులు, ఎద్దులు -48,80,293
- గేదెలు - 41,60,419
- మేకలు - 45,75,695
- కోళ్లు - 807.51 లక్షలు
- పశుసంపద జనాభాలో భారత్‌లో తెలంగాణ
- 10వ స్థానం

దేశ పశుసంపదలో తెలంగాణ స్థానం

- గొర్రెల సంఖ్యలో 2వ స్థానం
- కోళ్ల సంఖ్యలో 4వ స్థానం
- మేకల సంఖ్యలో 13వ స్థానం
- పశువుల సంఖ్యలో 13వ స్థానం
- పందుల సంఖ్యలో 15వ స్థానం

గమనిక: తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిలో భాగంగా గొల్లకురుమ, యాదవులకు గొర్రెల పంపిణీని చేపట్టారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 2017, జూన్ 20న సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో ప్రారంభించారు.
- ఈ పథకంలో 75 శాతం సబ్సిడీతో ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందిస్తున్నారు.
- తెలంగాణలోని మూడు రకాల గొర్రెలు లభిస్తాయి. అవి.. 1. దక్కనీబ్రీడ్ 2. నెల్లూరు బ్రీడ్ 3. జొడిపి
- కేంద్ర గొర్రెలు, ఉన్ని పరిశోధనా సంస్థ
- అవికానగర్ (రాజస్థాన్)
- కేంద్ర మేకల పరిశోధనా సంస్థ- మక్దూమ్ (ఉత్తరప్రదేశ్)
- కేంద్ర ఉన్ని అభివృద్ధి బోర్డు- జోధ్‌పూర్ (రాజస్థాన్)
- కేంద్ర బర్రెల పరిశోధన సంస్థ- హిస్సార్ (హర్యానా)
- కేంద్ర పాడి పరిశోధన సంస్థ- కర్నాల్ (హర్యానా )
- తెలంగాణలో ఏడాదికి 34.24 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తితో దేశంలో 13వ స్థానంలో ఉంది.
- భారత్ మొదటి స్థానం: ఉత్తరప్రదేశ్

పాల ఉత్పత్తి - ఉత్పాదకత

- 2014-15లో రాష్ట్రం 235.32 మెట్రిక్ టన్నుల పాలను ఉత్పత్తి చేసింది.
- రాష్ట్రంలో జనాభాకు తలసరి పాల లభ్యత: 234 గ్రా./ రోజు
- జాతీయ తలసరి లభ్యత 2009-10లో 263 గ్రా./ రోజు అంటే జాతీయ తలసరి లభ్యత కంటే రాష్ట్ర తలసరి లభ్యత తక్కువగా ఉంది.
- రాష్ట్రంలో డెయిరీ ఫెడరేషన్‌కి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతులకు 2014, నవంబర్ 1 నుంచి లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి జరుగుతుంది. ఇందుకోసం 537 లక్షల మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది.
- ప్రస్తుత ధరల్లో జీఎస్‌డీపీలో పశుసంపద వాటా (2016-17) - 6.4 శాతం
RAINBOW
RAMESH

1060
Tags

More News

VIRAL NEWS

Featured Articles