టీఎస్ కస్తూర్భాగాంధీలో 1050 ఖాళీలు


Mon,June 18, 2018 11:38 PM

తెలంగాణ కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన సీఆర్‌టీ, పీవో తదితర పోస్టుల భర్తీకి సర్వశిక్ష అభియాన్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
teacher
-మొత్తం పోస్టుల సంఖ్య: 1050
-పోస్టు గ్రాడ్యుయేట్ కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ (పీజీసీఆర్‌టీ)-580
-సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, నర్సింగ్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు 45 శాతం) పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణత.
-స్పెషల్ ఆఫీసర్లు (ఎస్‌వో)-49
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడీతోపాటు టీఎస్ టెట్/సీటెట్ అర్హత సాధించాలి.
-కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ)-359
-సబ్జెక్టులు: మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లిష్, హిందీ
-అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కు లతో (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు 45 శాతం) గ్రాడ్యుయేషన్, బీఈడీతోపాటు టీఎస్ టెట్/సీటెట్‌లో అర్హత సాధించాలి.
-ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)-62 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌తోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్/డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కనీసం ఒక ఏడాది బీపీఈడీ ఉండాలి.
గమనిక: ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. రాతపరీక్షలు పాత 10 జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభం: జూన్ 20 నుంచి
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 23 (సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే)
-రాతపరీక్ష తేదీలు: ఎస్‌వో జూలై 2, పీజీసీఆర్‌టీ- జూలై 3, సీఆర్‌టీ/పీఈటీ-జూలై 4
-వెబ్‌సైట్: http://ssa.telangana.gov.in

6028
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles