కోస్ట్‌గార్డ్‌లో 260 నావిక్‌ పోస్టులు


Tue,January 14, 2020 01:20 AM

ICG
-పోస్టు: నావిక్‌ (జనరల్‌ డ్యూటీ) 10+2 ఎంట్రీ-2/2020 బ్యాచ్‌
-మొత్తం ఖాళీలు: 260. వీటిలో జనరల్‌-113, ఈడబ్ల్యూఎస్‌-26, ఓబీసీ-75, ఎస్టీ-13, ఎస్సీ-33 ఉన్నాయి.
-పేస్కేల్‌: లెవల్‌-3 ప్రకారం బేసిక్‌ పే రూ.21,700తోపాటు అదనంగా డీఏ, ఇతర అలవెన్స్‌లు, సౌకర్యాలు కల్పిస్తారు.
-అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో 10+2/ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ, జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారులకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-వయస్సు: 18-22 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1998, ఆగస్టు 1 నుంచి 2002, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: సెంటర్లవారీగా దరఖాస్తులను ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి పీఎఫ్‌టీ నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్యపరీక్షలు చేసి తుది ఎంపిక చేస్తారు.
-శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ ఛాతీ, బరువు ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జనవరి 26 నుంచి ప్రారంభం
-చివరితేదీ: ఫిబ్రవరి 2
-వెబ్‌సైట్‌: www.join indiancoastguard.gov.in

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles