కనువిందుగొలిపే తెలంగాణ ఆలయాలు


Wed,December 4, 2019 01:47 AM

వేయి స్తంభాల గుడి (వరంగల్)

-దీన్ని 1163లో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు చాళుక్యవాస్తు శైలిలో నిర్మించారు.
స్వయంభూ దేవాలయం
-కాకతీయుల ఆరాధ్య దైవం. రెండో ప్రోలరాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు.
-ఈ స్వయంభూ దేవాలయం కాకతీయ దేవాలయాలన్నింటిలోకెల్లా పెద్దది, తలమానికమైనది.
-ఈ దేవాలయంలో తూర్పు భాగాన్ని గణపతి దేవుడు, పశ్చిమ భాగాన్ని రుద్రమదేవి కట్టించినట్లు తెలుస్తున్నది.

భద్రకాళి దేవాలయం

-వేయి స్తంభాల గుడికి చేరువలో ఉన్న ఈ దేవాలయం భద్రకాళీ గుడి ఉపస్థితురాలైన భద్రకాళి విగ్రహంతో విరాజిల్లుతున్నది.
-ఈ ఆలయంలో ప్రతి ఏడాది చండీ హోమం, గురుపౌర్ణమి సందర్భంగా శాకాంబరి పూజలు నిర్వహిస్తారు.
-మొదటగా ఈ ఆలయాన్ని రెండో పులకేశి క్రీ.శ. 625లో నిర్మించారు. ఈ ఆలయ శైలి చాళుక్య వాస్తు శైలి..
Temple

కాళేశ్వర ముక్తేశ్వరాలయం (జయశంకర్ జిల్లా)

-జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ ఆలయం ఉంది. త్రిలింగాల్లో ఇది ఒక ప్రదేశం (ద్రాక్షారామం, శ్రీశైలం).
-ఇక్కడ శివుని ప్రతిరూపమైన రెండు లింగాలు ఒకే పానవట్టంలో ఉండటం ప్రత్యేకత.
-శివాలయంతోపాటు ముక్తేశ్వరాలయం (యముడు) కూడా ఉండటం ఇంకో ప్రత్యేకత.
-ఈ దేవాలయంలోని చేప విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

రామప్పగుడి (భూపాలపల్లి జిల్లా)

-క్రీ.శ.1213లో రేచర్ల రుద్రుడు ఏకశిలపై ఈ దేవాలయాన్ని నిర్మించాడు.
-గుడిని చెక్కిన శిల్పి రామప్ప పేరుమీదుగా ఈ గుడికి ఆ పేరు వచ్చింది.
-దేశంలోనే శిల్పి పేరుతో ఉన్న ఏకైక గుడిగా రామప్ప గుడి ప్రసిద్ధి చెందింది.
-ఎటువైపు నుంచి చూసినా వారినే చూస్తున్నట్లుగా ఉన్న నంది ఈ గుడికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

రాజరాజేశ్వర ఆలయం (రాజన్న సిరిసిల్ల)

-వేములవాడ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
-శివుడు రాజరాజేశ్వరుని రూపంలో కొలువై ఉన్నాడు. కోడెదూడలను దేవునికి సమర్పించడం ఈ ఆలయం ప్రత్యేకతగా పేర్కొనవచ్చు.
-ఆలయం లోపల దర్గా ఉండటం లౌకికత్వానికి ప్రతీక.

కొండగట్టు (జగిత్యాల)

-జగిత్యాల జిల్లా కొండగట్టులో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి దేవాలయం ఉన్నది.
-సుమారు 300 ఏండ్ల క్రితం ఈ ఆలయం నిర్మించారు. ఇక్కడ ఆంజనేయస్వామి ఒకవైపు నరసింహ స్వామి ముఖం కలిగి ఉండటం ప్రత్యేకత. శాఖలు, చక్రాలు, హృదయంతో సీతారాములను కలిగి ఉండటం విశేషం.
-ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడైన బేతాళస్వామి ఆలయం కూడా కొండపైనే ఉంది.

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం

-జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి నదీ తీరాన ఈ దేవాలయం ఉంది.
-శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం, శివకేశవుల ఆలయాలు ఒకేచోట, ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి.
-ఈ దేవాలయానికి ఎదురుగా ప్రాచీన రామలింగేశ్వరాలయం ఉంది.

నందికొండ (నల్లగొండ)

-అతి పురాతన బుద్ధుని నిర్మాణాలు, స్తంభాల మండపం, బౌద్ధ ఆరామ అవశేషాలు ఈ ప్రాంతంలో లభించాయి.

ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం

-ఈ ఆలయాన్ని కాకతీయ సామంతులైన కుందూరు చోడులు నిర్మించారు. ఇందులోని శివలింగంపై దీర్ఘమైన నల్లని నీడ పగలంతా కదలకుండా ఒకేచోట ఉంటుంది.
-చిత్రమైన ఈ నీడ రహస్యం ఎవరికీ అంతుపట్టడం లేదు.
-ఇక్కడున్న మరో దేవాలయం పచ్చల సోమేశ్వరాలయం.

వాడపల్లి శివాలయం

-నల్లగొండ జిల్లాలో కృష్ణా, మూసీ నదులు సంగమించే చోట వాడపల్లిలో కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో నదికి 120 మీటర్ల ఎత్తున శివలింగం ఉంటుంది.

పిల్లలమర్రి దేవాలయం

-ఇది కాకతీయుల కాలం నాటి అత్యంత పురాతనమైన శివాలయం.
-కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో నాగిరెడ్డి వంశస్థులు పిల్లలమర్రిలో త్రికూట ఆలయాన్ని నిర్మించారు.
-త్రికూట ఆలయంలో కాటేశ్వర, కాచీశ్వర, నామీశ్వర ఆలయాలు ఉన్నాయి.
-ఇక్కడున్న చెన్నకేశవ స్వామి దేవాలయంలోని రాతి స్థూపాలు ప్రత్యేకమైనవి.

యాదగిరి గుట్ట (యాదాద్రి భువనగిరి)

-దీన్ని మాచ నరసింహక్షేత్రం అనికూడా పిలుస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు తన జీవిత చరిత్రలో ఈ ఆలయం గురించి పేర్కొన్నారు.

కొలనుపాక

-ఇక్కడ 2000 ఏండ్ల క్రితం నిర్మించిన జైన ఆలయం ఉన్నది.

ధూళికట్ట (పెద్దపల్లి జిల్లా)

-ఈ ప్రాంతంలోని బౌద్ధ విహారాలు, స్థూపాలను దాదాపు రెండు వేల ఏండ్ల క్రితం క్రీ.పూ. 2వ శతాబ్దంలో నిర్మించారు.
-ప్రముఖ గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ తన రచనల్లో ఈ ప్రాంత విశేషాలను పేర్కొన్నాడు.
-శాతవాహనుల కాలం నాటి, రోమ్‌ల కాలంనాటి నాణేలు లభించాయి.

గౌతమేశ్వరాలయం (పెద్దపల్లి జిల్లా)

-పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గౌతమేశ్వరాలయం గోదావరి నది తీరాన ఉంది.
-గౌతమేశ్వర ఆలయంలోని శివలింగం నల్లరాతితో చాలా ఎత్తుగా ఉంటుంది. శ్రీ వినాయక విగ్రహం ఆలయ ద్వారంలో కుడివైపున ఉంది.
-వెయ్యేండ్ల క్రితం నిర్మించిన ఆ ప్రాచీన దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్య కాలంలో దర్శించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది.
-ఈ దేవాలయాన్ని తెలంగాణ తిరుపతి అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ గల వేంకటేశ్వరుడు స్వయంభువని, స్వయం వ్యక్తమని అంటారు.

డిచ్‌పల్లి రామాలయం (నిజామాబాద్)

-కొండపైన ఉన్న ఈ రామాలయాన్ని నలుపు, తెలుపు రంగు రాయితో 17వ శతాబ్దంలో నిర్మించారు.
-ఈ దేవాలయంపై ఆకృతులు ఖజురహో శిల్పాలను పోలి ఉంటాయి. అందుకే ఈ దేవాలయాన్ని ఇందూరు ఖజురహో అనిపిలుస్తారు.

శ్రీ నీలకంఠేశ్వర ఆలయం

-నిజామబాద్ పట్టణంలో కొండపైన వెలసిన నీలకంఠేశ్వరాలయం ఎంతో పవిత్రమైనది.
-జనవరిలో వచ్చే రథసప్తమి రోజు శివలింగంపైన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి.

సారంగపూర్ హనుమాన్ దేవాలయం

-ఇక్కడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు శంకుస్థాపన చేశాడని పేర్కొంటారు.

నవనాథ సిద్దేశ్వరాలయం

-నిజామాబాద్‌లోని ఆర్మూర్ గుట్టలు నవనాథ సిద్దేశ్వరాలయానికి ప్రసిద్ధి. ఈ నవనాథులు సిద్ధులని, వీరు ఈ గుట్టల్లోనే నివసిస్తుంటారని స్థానికుల నమ్మకం.

సోమశిల ఆలయం (నాగర్ కర్నూల్)

-నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో ఈ సోమేశ్వరాలయం ఉన్నది. దీని చుట్టుపక్కల ఉన్న 15 ఆలయాల్లో కూడా శివలింగాలు ప్రతిష్టించారు.
-ఈ సోమశిల ప్రాంతంలో సప్తనదుల సంగమ క్షేత్రం ఉన్నది. ఇక్కడ 12 ఏండ్లకు ఒకసారి వచ్చే కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు.

జైనథ్ లక్ష్మీనారాయణ దేవాలయం

-ఆదిలాబాద్ సమీపంలోని జైనథ్ గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ఇది అష్టకోణాకృతిలో ఉన్నది. ఈ ఆలయం సూర్యదేవాలయంగా గుర్తింపు పొందింది. దీన్ని పల్లవుల కాలంలో నిర్మించారు.

గోదాదేవి ఆలయం

-పూర్వ రంగారెడ్డి జిల్లాలోని ఎదులాబాద్‌లో దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం ఉన్నది.

భద్రాచలం (భద్రాద్రి కొత్తగూడెం)

-ప్రస్తుత ఆలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించారు.
-సీతాదేవి అడుగు, మారీచుని ముద్రలు ఇక్కడ కనిపిస్తాయి.
పర్ణశాల
-ఈ ప్రాంతంలో శ్రీరాముడు తన వనవాసంలో భాగంగా కొంతకాలం నివసించాడని ప్రతీతి.

అలంపూర్ గుడి (జోగులాంబ గద్వాల జిల్లా)

-ఆలయ సమూహంలోని నవబ్రహ్మ ఆలయం, జోగులాంబ ఆలయం అత్యంత ప్రఖ్యాతి చెందాయి.
-ఈ ఆలయ సమూహాలను 7-8 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించారు.
-దేశంలోని 18 శక్తి పీఠాల్లో జోగులాంబ ఆలయాన్ని ఒక శక్తి పీఠంగా పేర్కొంటారు.

1225
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles